TE/Prabhupada 0182 - మిమ్మల్ని మీరు స్నానము చేసిన స్థితిలోనే ఉంచుకోండి

Revision as of 10:53, 20 July 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0182 - in all Languages Category:TE-Quotes - 1972 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on SB 2.3.15 -- Los Angeles, June 1, 1972

ఒక లాభం ఉంది, కృష్ణుడి గురించి విన్నప్పుడు, అయిన క్రమంగా పాపము చేయకుండా వుంటాడు, కేవలం శ్రవణము ద్వారా. మనము పాపము చేయకపోతే, మనము ఈ భౌతిక ప్రపంచంలోకి రాము. మనము తిరిగి దేవాదిదేవుని దగ్గరకు వెళ్ళాలంటే మనము పాపము చేయకుండ ఉండవలసి ఉంటుంది. ఎందుకంటే దేవుడు రాజ్యం ... దేవుడు స్వచ్చమైవాడు, అయిన రాజ్యం పవిత్రమైనది. అపవిత్ర జీవులు ఎవరు అక్కడకి ప్రవేశించలేరు. మనము పవిత్రముగా మారాలి. ఆది కూడా భగవద్గీతలో చెప్పబడింది. Yesam anta-gatam papam (BG 7.28). తన జీవిములో పాపముల ను0డి పూర్తిగా విముక్తుడుయినా వ్యక్తి yesam tv anta-gatam papam jananam punya-karmanam (BG 7.28), ఎల్లప్పుడూ పవిత్రమైన పనులలో నిమగ్నమయినవాడు, ఇంకా ఎటువంటి పాపములు చేయని వ్యక్తి ... ఈ కృష్ణ చైతన్యం ఉద్యమం, అయినకు ఒకసారి తన పాపములను తుడిచివేసుకోవడానికి అవకాశం ఇస్తుంది తనను తాను తప్పు చేయకుండా ఉండటము కోసము: అక్రమ లైంగికం లేకుండా, మత్తు మందులు లేకుండా, మాంసం తిన కుండా, జూదం లేకుండా. మనము ఈ నిబంధనలను అనుసరిస్తే, దీక్ష తరువాత, నా పాపాలన్నీ కడిగివేయ బడుతాయి. నేను ఆ స్వచ్చమైన పరిస్థితిలో నేను ఉనట్లయితే, అప్పుడు మళ్ళీ పాపం చేయాలనే ప్రశ్నఎక్కడ ఉంది?

కానీ ఒకసారి స్వచ్ఛముగా మారి, మీరు స్నానం చేసి మళ్ళీ మట్టిని తీసుకొని మీ శరీరంపై రుద్దుకుంటే - ఆ పద్ధతి సహాయం చేయదు. మీరు "నేను మళ్ళీ స్నానము చేసి మళ్ళీ మట్టిని పుసుకుంటాను," అని చెప్పితే, స్నానము చేయుట వలన ఉపయోగము ఏమిటి పాపములు పోయిన తరువాత మీరు పాపముల నుండి విముక్తులు అయిన తరువాత మీరు ఆ స్థితిలోనే మీరే ఉండాలి. అది అవసరం. మీరు కృష్ణుని గురించి శ్రవణము చేస్తూ అయినతోఎల్లప్పుడూ ఉండాలని అనుకుంటే అది సాధ్యమవుతుంది. అంతే. మీరు కలుషితము కాకుండా ఉండవలసి ఉంటుంది. అది punya-sravana-kirtanah (SB 1.2.17). మీరు కృష్ణుడి గురించి విoటే, అప్పుడు పుణ్యము, మీరు ఎల్లప్పుడూ పుణ్యము చేసే స్థితిలో ఉంటారు. Punya-sravana-kirtanah. మీరు జపము చేస్తే అందువల్ల మా సిఫారసు ఎల్లప్పుడూ హారే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణా కృష్ణా, హరే హరే / హరే రామ, హరే రామ, రామ రామ, హరే హరే. మనము పాపములు చేయకుండా ఉండటానికి జాగ్రతగా ఉండాలి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి, జపము చేస్తు ఉండాలి. . అప్పుడు అయిన సరిగ్గా వుంటాడు. So srnvatam sva-kathah krsnah punya-sravana-kirtanah (SB 1.2.17). క్రమంగా, మీరు కృష్ణుడి గురించి విoటున్నప్పుడు, హృదయంలోని అన్ని మలినాలు పరిశుభ్రం అవుతాయి.

మలిన విషయాము ఏమిటంటే "నేను భౌతిక శరీరము" నేను అమెరికన్ ని; నేను భారతీయుడిని; నేను హిందూవుని; నేను మహమ్మదీయుడిని; నేను ఇది; నేను ఆది. " ఇ విధముగా ఆత్మ వివిధ రకములుగా కప్ప బడి వున్నది కప్పబడకుండా పూర్తి చైతన్యముతో వున్నా ఆత్మ "నేను దేవుడి శాశ్వతమైన సేవకుడిని." అని తెలుసుకుంటుంది. అంతే. వ్యక్తికి మరొక గుర్తింపు లేదు. దీనిని ముక్తి అని పిలుస్తారు. ఒకరు అర్ధము చేసుకున్నప్పుడు నేను కృష్ణుడి,దేవుడి శాశ్వతమైన సేవకుడిని , నా ఏకైక సేవ అయినని సేవించడమే " దీనిని ముక్తి అంటారు. ముక్తి అంటే మీరు మరొక రెండు చేతులు, మరొక రెండు కాళ్ళు కలిగి వుంటారు అని కాదు. అదే విషయము, కేవలం అది శుభ్రపరుచబడినది ఒక వ్యక్తి జ్వరంతో బాధపడుతున్నట్లుగానే. లక్షణాలు చాలా ఉన్నాయి, కానీ జ్వరం లేనప్పుడు, అప్పుడు అన్ని లక్షణాలు పోతాయి మన భౌతిక ప్రపంచంలో ఈ జ్వరం ఏమిటంటే ఇంద్రియ తృప్తి. ఇంద్రియ తృప్తి. ఇది జ్వరం. మనము కృష్ణ చైతన్యములో నిమగ్నమైనప్పుడు, ఈ ఇంద్రియ తృప్తి వ్యాపారము నిలిచిపోతుంది. ఇదే తేడా. మీరు కృష్ణ చైతన్యములో ఎలా ఉన్నత స్థితికి వెళ్ళుతున్నారో అనే దానికి ఇది పరీక్ష.