TE/Prabhupada 0208 - ఎవరైతే కృష్ణ భక్తులో వారి యొక్క ఆశ్రయం తీసుకోండి

Revision as of 12:14, 18 July 2017 by Jogeswara (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0208 - in all Languages Category:TE-Quotes - 1975 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on SB 6.1.16 -- Denver, June 29, 1975

వైష్ణవుడైనవాడు ఏ పాపాత్మకమైన చర్యలను చేయడు, గతంలో ఏదైతే చేసాడో అది కూడా పూర్తి అవుతుంది. ఇది కృష్ణుడిచే చెప్పబడింది. లేదా ఇంకొక విధముగా చెప్పాలంటే, మీరు గనుక భక్తిగా భగవంతుని సేవలో నిమగ్నమై వుంటే, అప్పుడు మీరు పాపభరితమైన కార్యములన్నిటి ప్రతి చర్యల నుండి విముక్తి పొందుతారు.

అది ఎలా సాధ్యమవుతుంది? Yathā kṛṣṇārpita-prāṇaḥ. Prāṇaḥ, prāṇair arthair dhiyā vācā. Prāṇa, prāṇa అంటే జీవితం. కృష్ణుని సేవకు తన జీవితాన్ని అంకితం చేసుకున్న వ్యక్తి, అటువంటి వ్యక్తి జీవితాన్ని కృష్ణుని సేవకు అంకితం చేయటము ఎలా సాధ్యమౌతుంది? ఇది కూడా ఇక్కడ చెప్పబడింది: tat-puruṣa-niṣevayā. మీరు ఎవరైతే కృష్ణుని భక్తుడో, ఆ వ్యక్తి యొక్క ఆశ్రయం తీసుకోవలసి వుంటుంది, మీరు వాని సేవ చేయాలి. అంటే మీరు ఒక భక్తుని, వాస్తవమైన భక్తుని, స్వచ్ఛమైన భక్తుని, మీ మార్గదర్శకునిగా అంగీకరించాలి. అది మన పధ్ధతి. భక్తి-రసామృత సింధులో రూప గోస్వామి ఇలా చెప్పారు. మొదటి పద్ధతి, మొదటి దశ ādau gurvāśrayam యజమానిని అంగీకరించటము. గురువుని అంగీకరించండి. కృష్ణుని ప్రతినిధియే గురువు. ఎవరైతే కృష్ణుని ప్రతినిధి కారో వారు గురువు కాజాలరు. గురువు అంటే అర్ధం లేని వారంతా గురువవటం కాదు. కాదు. tat-puruṣa మాత్రమే. tat-puruṣa అంటే ఎవరైతే దేవాది దేవుడు సకలము అతనే అని అంగీకరిస్తారో వారు. Tat-puruṣa-niṣevayā. అనగా, వైష్ణవుడు, స్వచ్చమైన భక్తుడు. ఇది అంత కష్టం కాదు. కృష్ణుని దయ వలన స్వచ్ఛమైన భక్తులు ఉన్నారు, అందుచేత అలంటి వారి ఆశ్రయం తీసుకోవాలి. Ādau gurvāśrayam. అప్పుడు sad-dharma-pṛcchāt: ఒక ప్రామాణికమైన ఆధ్యాత్మిక గురువుని అంగీకరించిన తరువాత, కృష్ణునికి సంభందించిన విజ్ఞాన శాస్త్రం ఏమిటో తెలుసుకోవాలనే కుతూహలత వానికి వుండాలి. Sad-dharma-pṛcchāt sādhu-mārga-anugamanam. ఈ కృష్ణ చైతన్యమంటే భక్తుని అడుగు జాడలను అనుసరించటం, sādhu-mārga-anugamanam.

ఆ సాధువులు ఎవరు? అది కూడా శాస్త్రములలో చెప్పబడింది, మనము ఇప్పటికే చర్చించాము అది.

Svayambhūr nāradaḥ śambhuḥ kumāraḥ kapilo manuḥ prahlādo janako bhīṣmo balir vaiyāsakir vayam (SB 6.3.20)

మరియూ ..., పన్నెండు వ్యక్తులు ప్రత్యేకించి ప్రస్తావించబడ్డారు, వారు మహాజనులు అని, వారికి ప్రామాణికం ఇవ్వబడింది, ప్రామాణికమైన గురువులు, మీరు వారి మార్గాన్ని అనుసరించ వలసి వుంటుంది. అది అంత కష్టం కాదు. స్వయంభు అనగా ఈశ్వరుడు అయిన బ్రహ్మ. Svayambhūḥ nāradaḥ śambhuḥ. శంభు అనగా ఈశ్వరుడు అయిన శివుడు. వారిలో ప్రతి ఒక్కరూ ... ఈ పన్నెండు మహాజానస్ లలో, నలుగురు ముఖ్యమైనవారు. అది స్వయంభువు, అనగా బ్రహ్మ, తరువాత శంభు, ఈశ్వరుడు అయిన శివుడు, తరువాత కుమారః. మరియొక సంప్రదాయము వుంది, శ్రీ లక్ష్మికి సంభందించిన శ్రీ సాంప్రదాయ. మనము ఒక ఆధ్యాత్మిక గురువుని అంగీకరించాలి, వారు గనుక ఈ నాలుగు గురు పరంపరలో ఉన్నవారైతే. అప్పుడు మనం సాధించగలుగుతాము. మనము ఎదో ఒక గురువు అని పిలవబడే వారిని అంగీకరిస్తే, అప్పుడు అది సాధ్యం కాదు. మనము ఈ గురు పరంపరలోని గురువుని అంగీకరించాలి. అందువల్ల ఇది ఇక్కడ సిఫారసు చేయబడింది, tat-puruṣa-niṣevayā:మనము వానికి నమ్మకంగా, ఎల్లప్పుడూ నిజాయితీగా సేవ చేయవలసి వుంటుంది. అప్పుడు మన ముఖ్య ఉద్దేశ్యము నెరవేరినట్లే. మనము కృష్ణునికి మన జీవితము అంకితము చేస్తూ ఈ క్రియా క్రమాన్ని ఆచరిస్తే, ఎల్లప్పుడూ కృష్ణుని సేవలో నిమగ్నమైతే తత్-పురుష లక్ష్యము అనుసరించి అనగా ఎవరికైతే కృష్ణ చైతన్యాన్ని ప్రచారము తప్ప వేరే వ్యాపారము లేదో - అప్పుడు వారి జీవితం విజయవంతమైనట్లే. మనము పాపపు ప్రతిచర్యనుండి స్వతంత్రులవుతాము, మరియూ పవిత్రీకరణ చేయబడకుండ ... ఎందుకంటే కృష్ణ, లేదా దేవుడు, స్వచ్ఛమైనవాడు. అర్జునుడు చెప్పాడు, paraṁ brahma paraṁ brahma pavitraṁ paramaṁ bhavān: నా పరమేశ్వరుడైన కృష్ణా, నీవు పరమ పవిత్రమైనవాడవు. మనం పవిత్రముగా వుండనియెడల, మనము కృష్ణుని చేరుకోలేము. అది శాశ్త్రములో చెప్పిన మాట. అగ్ని అవ్వకుండా, మీరు అగ్నిలోకి ప్రవేశించలేరు. అదేవిధంగా, పూర్తిగా పవిత్రముగా వుందని యెడల, మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. అది అన్ని మత పద్ధతులలో అంగీకరించబడినది. క్రైస్తవ పద్ధతి కూడా అలాంటిదే, అనగా పవిత్రముగా ఉండని యెడల నీవు దేవుని రాజ్యమునందు ప్రవేశించలేవు.