TE/Prabhupada 0212 - శాస్త్రోత్ర ప్రకారముగా మరణం తరువాత జీవితం వుంది

Revision as of 18:51, 8 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Garden Conversation -- June 10, 1976, Los Angeles


ప్రభుపాద: ఆధునిక విద్య, వారు అర్థం చేసుకోలేరు , జననం, మరణం, వృద్ధాప్యం మరియూ వ్యాధి యొక్క పునరావృత్తం ఒక బాధ అని. వారికి అది అర్థం కాదు. ఎందుకు వారు అంగీకరించాలి? దాన్ని అంగీకరించు, ఏ ఇతర మార్గం లేదని వారు భావిస్తున్నారు. కానీ దీనిని ఆపడానికి ఒక మార్గం ఉంటే, వారు ఎందుకు తీసుకోరు? Hm? ఈ విద్య యొక్క విలువ ఏమిటి? వారు ఒప్పు తప్పుల మధ్య తేడాను గుర్తించలేరు. ఎవరూ మరణం అంటే ఇష్ట పడరు, కానీ మరణం ఉంది. ఎవరూ ముసలి వాళ్ళు అవటానికి ఇష్ట పడరు, కానీ ముసలితనము ఉంది. ఎందుకు వారు ఈ ముఖ్యమైన సమస్యలను పక్కన పెట్టారు మరియూ శాస్త్రీయ పురోగతి గురించి అతను గర్విస్తున్నాడు? ఇది ఏ రకమైన విద్య? వారు ఒప్పు తప్పులను గుర్తించలేకపోతే, ఈ విద్య యొక్క ఫలితమేమిటి? విద్య అంటే, ఒప్పు తప్పుల తేడాలను తను గుర్తించగలగాలి. కానీ వారు చేయలేరు, లేదా వారు మరణం మంచిది కాదు అని కూడా తెలుసు, కానీ వారు మరణం ఆపడానికి ఎందుకు ప్రయత్నించుట లేదు? అభివృద్ది ఎక్కడ ఉంది? వారు శాస్త్ర పురోగతి వలన చాలా గర్వంగా ఉన్నారు. అభివృద్ది ఎక్కడ ఉంది? మీరు మరణాన్ని ఆపలేరు. మీరు ముసలితనాన్ని ఆపలేరు. మీరు ఆధునిక మందులను తయారు చేయగలరు, కానీ ఎందుకు మీరు వ్యాధిని ఆపలేరు? ఈ మాత్ర తీసుకోండి, ఇక వ్యాధి ఉండదు. ఆ శాస్త్రం ఎక్కడ ఉంది? Hm?

Nalinīkaṇṭha: వారు దాని మీద పని చేస్తున్నామని వారు చెప్తున్నారు. ప్రభుపాద: ఇది మరో మూర్ఖత్వం. బుకాయించడం.

Gopavṛndapāla: కృష్ణ చైతన్యము క్రమక్రమంగా జరిగే పధ్ధతి అని మనము చెప్పినట్లుగా, శాస్త్రీయ అభివృద్ధి కూడా క్రమంక్రమంగా జరుగుతుందని వారు చెబుతున్నారు.

ప్రభుపాద: క్రమక్రమమైన పద్ధతి, కానీ మరణం ఆపగలము అని వారు అనుకుంటున్నారా? మనము తిరిగి ఇంటికి వెళ్తున్నాం, భగవంతుడైన కృష్ణుని వద్దకు తిరిగి వెళుతున్నాము అని మనము నమ్ముతున్నాము. కానీ వారు మరణం, వృద్ధాప్యము, వ్యాధిని ఆపగలరని నమ్మకం ఎక్కడ ఉంది?

Dr. Wolfe: వారు ప్రయత్నిస్తున్నామని చెప్తున్నారని ఇప్పుడు సరికొత్త వ్యాఖ్యానం, వారు మరణించిన తరువాత జీవితం ఉందన్న వాస్తవంను స్థిరపరిచారు.

ప్రభుపాద: ఉంది.

Dr. Wolfe: వారు మళ్ళీ ఇది శాస్త్రీయ పరంగా చేయాలని ప్రయత్నిస్తారు.

ప్రభుపాద: వారిని చేయనీయండి. శాస్త్రీయంగా, మరణం తరువాత జీవితం ఉంది. మనం పదేపదే చెప్తాము, నా చిన్నప్పుడి శరీరం చనిపోయినది, అది పోయింది, అదృశ్యమయింది. నాకు వేరొక శరీరం వచ్చింది. కాబట్టి మరణం తరువాత జీవితం ఉంది. ఇది ఆచరణాత్మకమైనది. కాబట్టి ఈ కృష్ణుడు tathā dehāntara-prāptiḥ ( BG 2.13) అని అంటాడు. అదే విధంగా, na hanyate hanyamāne śarīre ( BG 2.20) ఇది దేవుని యొక్క అధికార పూర్వకమైన ప్రకటన, మరియూ మనకు ఒక శరీరం తరువాత మరొక శరీరం వస్తుందని అనుభవములో చూస్తున్నాము, కానీ నేను కొనసాగుతాను. కాబట్టి అభ్యంతరం ఏమిటి? కాబట్టి మరణం తరువాత జీవితం ఉంది. మరణం అంటే శరీరం యొక్క వినాశనం అని పిలుస్తారు. మనము ఆ జీవితాన్నిఅంటి పెట్టుకొని ఉండగలిగితే, యింక మరణమనేది వుండదు, అందువలన దాన్ని వెతకాలి. అది వివేకము. అది భగవద్గీతలో చెప్పబడింది, మీరు నేరుగా కృష్ణుని అర్థం చేసుకుంటే మీరు ఆయన దగ్గరకు తిరిగి వెళ్ళడానికి అర్హత పొందుతారు, అప్పుడు ఇకపై మరణం వుండదు.