TE/Prabhupada 0220 - ఆధ్యాత్మిక స్థితిలో ప్రతి జీవి భగవంతునిలో భాగం అని మనము చూడవచ్చు

Revision as of 08:57, 2 January 2018 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0220 - in all Languages Category:TE-Quotes - 1972 Category:TE-Quotes - Ar...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Arrival Lecture -- Paris, July 20, 1972


ఆధ్యాత్మిక స్థితిపై వాస్తవానికి జ్ఞానవంతుడైన ఒక వ్యక్తికి తెలుసు, "ఇక్కడ ఒక కుక్క ఉంది ఇక్కడ ఒక జ్ఞానవంతుడు అయిన బ్రాహ్మణుడు ఉన్నాడు. వారి కర్మ ద్వారా వారు వేర్వేరు దుస్తులను మాత్రమే కలిగి ఉన్నారు, కానీ బ్రాహ్మణుని లోను, కుక్కలోను అదే ఆత్మ ఉంది. " కాబట్టి మన భౌతిక స్థితిని మనము గుర్తించాము, "నేను భారతీయుడిని, మీరు ఫ్రెంచి, ఆయన ఆంగ్లేయుడు, ఆయన అమెరికన్, ఆయన పిల్లి, ఆయన కుక్క. " ఇది భౌతిక స్థితి యొక్క దృష్టి. ఆధ్యాత్మిక స్థితిలో మనము ప్రతి జీవి భగవంతునిలో భాగం అని చూడవచ్చు, ఇది భగవద్గీతలో ధృవీకరించబడినది: mām evāṁśa jīva-bhūta. ప్రతి జీవి. ఆయన ఏమిటి అనే దానికి పట్టింపు లేదు. 84,00,000 రకాల జాతులు ఉన్నాయి, కానీ అవి అన్ని వేర్వేరు దుస్తుల ద్వారా మాత్రమే కప్పబడి ఉన్నాయి ఉదాహరణకు మీరు ఫ్రెంచ్ వాళ్ళ వలె, మీరు దుస్తులు భిన్నమైనవి ధరించవచ్చు, ఆంగ్లేయుడు భిన్నంగా ధరించవచ్చు, భారతీయుడు భిన్నంగా ధరించవచ్చు. కానీ దుస్తులు చాలా ముఖ్యం కాదు. దుస్తుల లోపల మనిషి, ఆయన ముఖ్యం. అదేవిధముగా, ఈ శరీరం చాలా ముఖ్యమైన విషయము కాదు. Antavanta ime dehā nityasyoktāḥ śarīriṇaḥ ( BG 2.18) ఈ శరీరం నశ్వరమవుతుంది. కానీ శరీరం లోపల ఆత్మ, ఆయన నశ్వరమవ్వదు. అందువల్ల ఈ మానవ జీవన విధానం నశ్వరమవ్వని దాని యొక్క జ్ఞానమును పెంచుకోవటానికి ఉద్దేశించినది.

దురదృష్టవశాత్తు, మన సైన్స్, తత్వము పాఠశాలలో , కళాశాలలో, విశ్వవిద్యాలయములో, అవి కేవలము నశ్వరము అయ్యే దానితో సంబంధము కలిగి ఉన్నాయి, నశ్వరము అవ్వని వాటితో కాదు ఈ కృష్ణ చైతన్య ఉద్యమం నశ్వరము అవ్వని వాటిని పరిగణలోనికి తీసుకోవడానికి ఉద్దేశించబడినవి. కాబట్టి ఇది ఆత్మ యొక్క ఉద్యమం, రాజకీయ ఉద్యమం, సామాజిక ఉద్యమం లేదా మత ఉద్యమం వంటి ఉద్యమం కాదు. అవి నశ్వరము అయ్యే శరీరానికి సంబంధించినవి. కానీ కృష్ణ చైతన్య ఉద్యమం నాశనం అవ్వని ఆత్మకు సంబంధించినది. అందువల్ల మన ఈ సంకీర్తన ఉద్యమం, కేవలం ఈ హరే కృష్ణ మంత్రాన్ని కీర్తన చేయడము, మీ హృదయం క్రమంగా పరిశుద్ధ మవుతుంది, కాబట్టి మీరు ఆధ్యాత్మిక స్థితికి రావచ్చు. ఉదాహరణకు ఈ ఉద్యమంలో మనము ప్రపంచంలోని అన్ని దేశాల నుండి, ప్రపంచం యొక్క అన్ని ధర్మాల నుండి విద్యార్ధులను కలిగి ఉన్నాము. కానీ వారు ప్రత్యేకమైన ధర్మము లేదా దేశం లేదా వర్గము లేదా రంగును గురించి ఆలోచించరు వారు అందరూ కృష్ణుడి భాగముగా భావిస్తారు. మనము ఆ స్థితికి వచ్చినప్పుడు ఆ స్థానములో మనము నిమగ్నమైనప్పుడు, మనము విముక్తి పొందుతాము.

కాబట్టి ఈ ఉద్యమం చాలా ముఖ్యమైన ఉద్యమం. అయితే కొన్ని నిమిషాల్లో మీకు అన్ని వివరాలను అందించడం సాధ్యం కాదు, కానీ మీరు ఆసక్తి కలిగి ఉంటే మీరు దయచేసి మమ్మల్ని సంప్రదించండి ఉత్తరాల ద్వారా లేదా మా సాహిత్యాన్ని చదవడం ద్వారా లేదా వ్యక్తిగతముగా కలవడము ద్వారా. ఏమైనప్పటికి, మీ జీవితం అద్భుతమైనదిగా ఉంటుంది. ఇది భారతదేశం, "ఇది ఇంగ్లాండ్," " ఇది ఫ్రాన్స్," "ఇది ఆఫ్రికా." అని మేము తేడాను చూపెట్టము మనము ప్రతి జీవి గురించి ఆలోచిస్తాము, మానవుల గురించే కాదు, జంతువుల గురించి కూడా, పక్షులు, జంతువులు, చెట్లు, జలచారాలు, కీటకాలు, సరీసృపాలు - అన్నీ భగవంతునిలో భాగం.