TE/Prabhupada 0235 - అర్హతలేని గురువు అంటే శిష్యునికి మార్గనిర్దేశం ఇవ్వటము ఎలా అని తెలియని వాడు

Revision as of 18:55, 8 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 2.4-5 -- London, August 5, 1973

gurūn ahatvā. కృష్ణడు భక్తుడు అవసరం ఉంటే, అయినకు అర్హతలేని గురువు ఉంటే ... అర్హతలేని గురువు అంటే శిష్యునికి మార్గనిర్దేశం ఇవ్వటము ఎలా అని తెలియని వాడు అని అర్థం. గురువు యొక్క విధి మార్గనిర్దేశం ఇవ్వటము. అటువంటి గురువుని కనీసం తిరస్కరించ వచ్చు ఇది జీవ గోస్వామి యొక్క ... Kārya-kāryam ajānataḥ గురువుగా మనము ఎవరినైనా తప్పుగా, పొరపాటున అంగీకరిస్తే , ఏమి చేయాలో ఏమి చేయకుడదో తెలియని గురువుని, అయినను తిరస్కరించ వచ్చు. అయినని తిరస్కరించడం ద్వారా, మీరు ఒక వాస్తవ ప్రామాణిక గురువును అంగీకరిoచవచ్చు గురువును హత్య చేయడము కాదు, కానీ అయిన తిరస్కరించ వచ్చు. ఇది శాస్త్ర ఉపదేశము. భిష్మదేవుడు మరియు ద్రోణాచార్యుడు, ఖచ్చితంగా వారు గురువులుగా ఉన్నారు, కానీ కృష్ణడు పరోక్షంగా అర్జునుడికి సంకేతం ఇస్తున్నాడు "వారు గురువు స్థానములో ఉన్నప్పటికీ, మీరు వారిని తిరస్కరిoచవచ్చు." Kārya-kāryam ajānataḥ. "వాస్తవముగా వారికీ తెలియదు." ఈ భిష్మదేవుడు అయిన బౌతికముగా తన స్థానమును గురించి ఆలోచిస్తున్నాడు. అయినకు ప్రతిదీ మొదటి నుండి తెలుసు ఆ పాండవులు వారు తల్లిదండ్రులు లేని వారు, తండ్రిలేని పిల్లలుగా ఉన్నారు, అయిన మొదటి నుండి వారిని పెంచాడు. అదొక్కటే కాదు, అయిన ఆలోచన చేస్తున్నాడు పాండవులoటే ఆయినకు చాల ప్రేమ ఉంది, వారిని అడవిలోకి పంపిన్నప్పుడు, వెలివేసిన్నప్పుడు, ఆ సమయంలో భిష్మదేవుడు ఏడుస్తున్నాడు "ఈ ఐదు మంది బాలురు, వారు నిజాయితీ, పవిత్రత కలిగి ఉన్నారు. పవిత్రత నిజాయితీ మాత్రమే కాదు, శక్తివంతమైన యోధులు, అర్జునుడు, భీముడు. ఆచరణాత్మకంగా ఈ ద్రౌపది అదృష్ట దేవత. వారికి వారి స్నేహితుడు, భగవంతుడు, కృష్ణడు దేవాదిదేవుడు ఉన్నాడు. వారు బాధ పడుతున్నారు? "అయిన ఏడుస్తున్నాడు. అయిన ఎంతో ఆప్యాయముగా ఉన్నాడు. అందువలన అర్జునుడు, పరిశీలిస్తున్నాడు "నేను భీష్ముడిని ఎలా చంపుతాను?" కానీ కర్తవ్యము బలంగా ఉంది. కృష్ణడు , సలహా ఇస్తున్నాడు "అవును, అయిన ఇతర వైపున ఉండటము వలన అయినను హత్య చేయలి. అయిన తన విధిని మర్చిపోయాడు. అయిన మీతో కలువ వలసింది. అందువలన అయిన గురువు స్థానములో లేడు. మీరు అతన్ని చంపoడి. అయిన తప్పుగా ఇతర పక్షములో చేరారు. అందువలన ఎటువంటి హాని లేదు, అయినని చంపటము వలన. అదేవిధంగా ద్రోణాచార్యుడు. అదేవిధంగా ద్రోణాచార్యుడు. వారు గొప్ప అభిమానం కలిగి ఉన్నారు. వారు గొప్ప వ్యక్తులు అని నాకు తెలుసు. కానీ కేవలం భౌతిక పరిశీలన వలన వారు అక్కడకి వెళ్ళానారు. "ఆ బౌతికము పరిశీలన ఏమిటి? భీష్ముడు "నేను దుర్యోధనుడి డబ్బు ద్వారా పోషించబడుతున్నాను" అని భావించాడు. దుర్యోధనుడు నన్ను పోషిస్తున్నాడు ఇప్పుడు అతడు ప్రమాదములో ఉన్నాడు. నేను ఇతర వైపుకి వెళ్ళితే, అప్పుడు నేను కృతజ్ఞత లేని వాడను అవ్వుతాను. అయిన నన్ను ఎంతో కాలముగా పోషిస్తున్నాడు. నేను, ప్రమాదం సమయంలో, నేను ఇతర వైపుకు వెళ్ళితే , పోరాటము జరుగుతున్నప్పుడు,అది ... "అయిన ఈ విధముగా ఆలోచన చేస్తున్నాడు. అయిన "దుర్యోధనుడు పోషించ వచ్చు, కానీ అయిన పాండవుల యొక్క ఆస్తిని స్వాధీనం చేసుకున్నాడు." అని ఆలోచించ లేదు కానీ అది తన గొప్పతనము. కృష్ణడు ఉండటము వలన అర్జునుడిని ఎప్పటికీ చంపలేమని ఆయినకు తెలుసు. "కావున బౌతిక స్థానము నుండి , నేను దుర్యోధనుడికి కృతజ్ఞత కలిగి ఉండాలి." అదే పరిస్థితి ద్రోణాచార్యుడుకి ఉంది. వారు పోషించబడినారు.