TE/Prabhupada 0258 - స్వరూప పరముగా మనము సేవకులము

Revision as of 18:59, 8 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture -- Seattle, September 27, 1968


ఒక మంచి బెంగాలీ శ్లోకము ఉంది, krsna bhuliya jiva bhoga vāñchā kare pāsate మాయ tāre jāpaṭiyā dhare మా అసలు చైతన్యము బౌతిక ఆనందము తో కలుషితమైన వెంటనే, అది "నాకు బౌతిక వనరులపై ఆధిపత్యము కావాలని కోరుకున్నప్పుడు ..." ఈ విధంగా మన చైతన్యము మారిన వెంటనే,మనకు ఇబ్బందులు మొదలవుతాయి. వెంటనే మాయ ఉంటుంది ఈ చైతన్యమే, "నేను ఈ బౌతిక ప్రపంచాన్ని నా ఉత్తమ సామర్థ్యంతో ఆస్వాదిస్తాను ..." ప్రతి ఒక్కరూ దీన్ని ప్రయత్నిస్తున్నారు. మనలో ప్రతి ఒక్కరు, చీమ నుండి ఉన్నతమైన జీవి వరకు బ్రహ్మా వరకు, ప్రతి ఒక్కరూ యజమాని కావాలని ప్రయత్నిస్తున్నారు. మీ దేశంలో లాగానే ఇటీవల చాల మంది అధ్యక్షుడు కావాలని ప్రచారం చేస్తున్నారు. ఎందుకు? ఇదే ఆలోచన. ప్రతి ఒక్కరూ ఏదో ఒక్క రకమైన యజమాని కావాలని. ఇది మాయా. మా కృష్ణ చైతన్య ఉద్యమం పూర్తిగా వ్యతిరేకం. కృష్ణుడి సేవకుని సేవకుని సేవకుని సేవకునిగా ఉండటానికి మనము ప్రయత్నిస్తున్నాము. పూర్తిగా వ్యతిరేకము. యజమానిగా మారడానికి బదులుగా, మనము కృష్ణుడి యొక్క సేవకుని సేవకునిగా ఉండాలనుకుంటున్నాము. Gopī-bhartuḥ pada-kamalayor dāsa-dāsānudāsaḥ ( CC Madhya 13.80)

ఆధునిక నాగరికత ధోరణిలో, ప్రజలు దీనిని బానిస మనస్తత్వం అని చెప్ప వచ్చు. ఇది ఉన్నతమైన ఆలోచన. "నేను ఎందుకు బానిస అవుతాను? నేను యజమాని అవుతాను. " కానీ ఈ జ్ఞానాన్ని, "నేను యజమాని అవుతాను," అనే చైతన్యము తన బాధ యొక్క కారణం అని ఎవరికీ తెలియదు. ఈ తత్వమును అర్థం చేసుకోవాలి. స్వరూపపరంగా మనము అందరము సేవకులము. ఈ భౌతిక ప్రపంచం యొక్క యజమానిగా మారే ప్రయత్నములో మనము మన ఇంద్రియాలకు సేవకులము అయ్యాము. స్వరూపపరంగా మనము సేవకులము. మనము సేవ చేయకుండా ఉండలేము. ఈ సమావేశంలో కూర్చున్న మనలో ప్రతి ఒక్కరికి సేవకులు. ఇప్పుడు, ఈ కృష్ణ చైతన్యమును తీసుకున్న బాలురు, వారు కృష్ణుడి సేవకునిగా మారడానికి అంగీకరించారు. వారి సమస్య పరిష్కరించబడింది. కానీ ఇతరులు, "నేను దేవుడు సేవకునిగా లేదా స్వామిజీ యొక్క సేవకునిగా ఎందుకు మారాలి? నేను యజమాని అవుతాను ... "కానీ వాస్తవానికి, అయిన యజమాని కాలేడు. అయిన తన ఇంద్రియాల సేవకుడు, అంతే. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అయిన ఉండాలి సేవకుడిగా, కానీ అయిన తన కామం యొక్క సేవకుడు, అయిన తన అత్యాశ యొక్క సేవకుడు, అయిన తన దురాశ యొక్క సేవకుడు, తన కోపానికి సేవకుడు, చాలా విషయములకు సేవకుడు. Kāmādīnāṁ kati na katidhā pālitā durnideśāḥ. ఉన్నత స్థితిలో, కొంతమంది మానవత్వం యొక్క సేవకులు అయ్యారు, కొంతమంది సమాజము యొక్క సేవకులు అయ్యారు, కొంతమంది దేశం యొక్క సేవకులు అయ్యారు, కానీ వాస్తవ ప్రయోజనము "నేను యజమాని అవ్వుతాను." ఆ వ్యాధి ఉంది. అధ్యక్ష పదవికి అభ్యర్థులు, వారు వారి విభిన్న మానిఫెస్టోలను ప్రదర్శిస్తున్నారు, కాదు, మానిఫెస్టో, "నేను దేశానికి చాలా చక్కగా సేవ చేస్తాను, నాకు మీ ఓటు ఇవ్వండి." కానీ వాస్తవమైన ఆలోచన "ఏదో ఒక్క విధముగా నేను దేశం యొక్క యజమానిని అవ్వుతాను." ఇది మాయా. మనము ఈ చిన్న తత్వము అర్థం చేసుకుంటే, స్వరూపపరంగా నేను సేవకునిగా ఉoటాను ... ఎటువంటి సందేహం లేదు. ఎవరూ చెప్పలేరు "నేను స్వేచ్ఛగా ఉన్నాను, నేను యజమాని ఆని." ఎవరూ చెప్పలేరు.ఎవరు అయిన ఇలా భావిస్తే, అది మాయ. ఆది తప్పు.