TE/Prabhupada 0257 - మీరు భగవంతుని చట్టాలను ఎలా తప్పించుకోగలరు



Lecture -- Seattle, September 27, 1968


మన కార్యక్రమం భగవంతుడు, కృష్ణుడు మహోన్నతమైన వ్యక్తిని ఆరాధించడం. Govindam ādi-puruṣaṁ tam ahaṁ bhajāmi. ఈ భౌతిక ప్రపంచంలో ప్రతిఒక్కరూ ఆనందాన్ని పొందడానికి బాధ నుండి ఉపశమనం పొందడానికి ప్రయత్నిస్తున్నారు. రెండు విషయాలు జరుగుతున్నాయి, ప్రయత్నం. ఇవి వివిధ పద్ధతిలు. బౌతిక పద్ధతి పూర్తిగా అర్థంలేనిది. అది ఇప్పటికే నిరూపించబడింది. ఎంతటి బౌతిక సౌకర్యములు లేదా ఆనందము అయిన సoతోషము అని పిలువబడేది మనము ఆశించే వాస్తవమైన సoతోషాన్ని ఇవ్వవు. అది సాధ్యం కాదు. అప్పుడు వేర్వేరు ఇతర పద్ధతిలు కూడా ఉన్నాయి. మన భౌతిక బద్ధ జీవితాము వలన మూడు రకాల దుఃఖాలు ఉన్నాయి: ఆద్యాత్మిక, ఆదిబౌతిక, ఆదిదైవిక. శరీరానికి మనస్సుకు సంబంధించినవి ఆద్యాత్మికము అంటారు. ఉదాహరణకు ఈ శరీరంలోని జీవక్రియ యొక్క వివిధ విధులు తికమకగా ఉన్నప్పుడు, మనకు జ్వరం వస్తుంది, మనకు కొంత నొప్పి, తలనొప్పి వస్తుంది - చాలా విషయాలు. ఈ దుఃఖములు శరీరమునకు సంబంధించినవి. వీటిని అద్యాత్మికము అంటారు ఈ ఆద్యాత్మిక బాధాకు మరొక భాగం మనస్సు వలన. నేను గొప్ప నష్టాన్ని ఎదుర్కొన్నాను అనుకుందాం. మనస్సు ఉన్నతమైన స్థితిలో లేదు. ఇది కూడా బాధ. శరీరం వ్యాధితో ఉన్నప్పుడు, లేదా కొoత మానసిక అసంతృప్తి, అప్పుడు భాధలు ఉoటాయి. అప్పుడు మళ్ళీ, ఆదిబౌతిక - ఇతర జీవుల ద్వారా వచ్చిన బాధలు. ఉదాహరణకు మనం మానవుల్లా ఉన్నాము, రోజువారీ మిలియన్ల కొద్దీ నిసహయములైన జంతువులను కబేళకు పంపిస్తున్నాం. అవి వ్యక్తం చేయలేవు, కానీ దీనిని ఆదిబౌతిక అని పిలుస్తారు, ఇతర జీవులు అందించే బాధలు. అదేవిధంగా, ఇతర జీవుల ద్వారా మనము బాధలు అనుభవించాల్సిన అవసరం ఉంది. దేవుడు చట్టం మీ వల్ల కాదు, నేను చెప్పేది ఏమిటంటే, మార్పు చేయలేరు. బౌతిక చట్టాలు, రాష్ట్ర చట్టాలు, మీరు మీరే తప్పించుకోవచ్చు, కానీ దేవుడు చట్టం నుండి మీరు తప్పించుకోలేరు. చాలా మంది సాక్షులు ఉన్నారు. సూర్యుడు మీకు సాక్షి, చంద్రుడు మీకు సాక్షి, పగలు మీకు సాక్షి, రాత్రి మీకు సాక్షి, ఆకాశం మీకు సాక్షి. మీరు భగవంతుని చట్టాలను ఎలా తప్పించుకోగలరు? ... కానీ ఈ భౌతిక ప్రకృతి ఎలా నిర్మించబడినది అంటే మనము బాధ పడాలి. ఆద్యాత్మిక అంటే శరీరానికి సంబంధించినవి, మనస్సుకు సంబంధించినవి, ఇతర జీవుల ద్వారా అందించబడిన బాధలు, వేరే బాధలు ఆదిదైవిక భాధలు. ఆదిదైవిక, ఎవరికైనా దెయ్యము పడితే, ఒక దెయ్యము అతన్ని మీద దాడి చేస్తే. దెయ్యమును చూడలేరు, కానీ అయిన మతిభ్రమతో భాధపడుతున్నారు అర్ధము లేనివి మాట్లాడు తున్నాడు లేదా కరువు ఉంది, భూకంపం ఉంది, యుద్ధం ఉంది, తెగులు ఉంది, చాలా విషయాలు.

బాధలు ఎల్లప్పుడూ ఉన్నాయి. కానీ మనము అతుకులు ద్వార సరిదిద్దడానికి ప్రయత్నిస్తున్నాం. బాధలు ఎల్లప్పుడూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ బాధలనుండి బయటపడటానికి ప్రయత్నిస్తున్నారు, అది నిజం. జీవితము కోసం మొత్తం పోరాటము బాధ నుండి బయటపడటం. కానీ వివిధ రకాలైన మార్గములు ఉన్నాయి. ఈ విధంగా బాధలనుండి బయటికి రావచ్చని కొందరు చెప్పుతారు, ఆ విధంగా మీరు బాధ నుండి బయటికి రావచ్చని కొంత మంది చెప్పుతారు. తద్వారా ఆధునిక శాస్త్రజ్ఞులు, తత్వవేత్తలు, అందించిన మార్గములు ఉన్నాయి, నాస్తికులచే లేదా ఆస్తికులచే, ఫలమును ఆశించే వారిచే, చాలా పద్ధతులు ఉన్నాయి. కానీ కృష్ణ చైతన్య ఉద్యమము ప్రకారం, మీరు అన్ని బాధలనుండి బయటపడవచ్చు మీరు మీ చైతన్యమును మార్చుకుంటే, ఆది అంతే ఇది కృష్ణ చైతన్యము. నేను మీకు అనేక సార్లు ఉదాహరణను ఇచ్చినాను ... మన బాధలు జ్ఞానము లేకపోవటము వలన అజ్ఞానం వలన ఉన్నతమైన ప్రామాణికుల సహకారంతో ఆ జ్ఞానమును పోoదచవచ్చు.