TE/Prabhupada 0295 - ఒక జీవ శక్తి ఇతర జీవులందరి యొక్క అన్ని అవసరాలను సరఫరా చేస్తుంది

Revision as of 15:25, 20 August 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0295 - in all Languages Category:TE-Quotes - 1968 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture -- Seattle, October 4, 1968


ఈ జీవితం, ఈ మానవ జీవితం ... మనము ఇప్పుడు కలిగి ఉన్నాము... ఇతర జీవితంలో మనం ఇంద్రియ ఆనందాన్ని పూర్తిగా ఆనందించాము. ఈ మానవ జీవితంలో మనం ఎలాంటి వాటిని ఆనందించ వచ్చు? ఇతర జీవితంలో ... వాస్తవానికి, డార్విన్ సిద్ధాంతం ప్రకారం, ఈ మానవ జీవితానికి ముందే కోతి జీవితం ఉంది. కోతి ... మీకు అనుభవం లేదు. భారతదేశం లో మాకు అనుభవం ఉన్నది. ప్రతి ఒక్క కోతికి కనీసం వంద ఆడ కోతులు ఉంటాయి. వంద, వంద. కనుక మనము ఏమి ఆనందిస్తున్నాము? ప్రతి ఒక్కరికి, వారికి పక్షము ఉన్నది, ప్రతి పక్షము, ఒక కోతికి కనీసం యాభై, అరవై, కనీసము ఇరవై ఐదు కంటే తక్కువ కాదు. ఒక పంది జీవితం, వాటికీ కూడా డజన్ల కొద్దీ ... డజన్ల కొద్దీ ఉన్నాయి వాటికి వ్యత్యాసం లేదు, "ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరి, ఎవరు నా బంధువు." మీరే చూడoడి? అవి ఆనందిస్తున్నాయి. మీరు మానవ జీవితం దాని కోరకు అని అనుకుంటున్నారా. - కోతులు పందులు, పిల్లులు కుక్కల వలె ? మానవ జీవితం యొక్క పరిపూర్ణము ఇదా, ఇంద్రియలను తృప్తిని తృప్తిపరుచుకోవడమా? కాదు మనము వివిధ రకాల జీవితాలాను ఆనందిoచాము. ఇప్పుడు? వేదాంతము చెప్పుతుంది athāto brahma jijñāsā. ఈ జీవితం బ్రహ్మాణ్ ను ప్రశ్నించడానికి మరియు అర్ధం చేసుకోవడానికి ఉంది. ఆ బ్రాహ్మణ్ ఏమిటి? Īśvaraḥ paramaḥ brahma or parama, īśvaraḥ paramaḥ kṛṣṇaḥ (Bs. 5.1). కృష్ణుడు పరా బ్రాహ్మణ్. బ్రాహ్మణ్, మనము అoదరము బ్రాహ్మణ్, కానీ అతడు పరా బ్రాహ్మణ్, మహోన్నతమైన బ్రాహ్మణ్. Īśvaraḥ paramaḥ kṛṣṇaḥ (Bs. 5.1). మీరు అoదరు అమెరికన్లు లాగా, కానీ మీ అధ్యక్షుడు జాన్సన్ మహోన్నతమైన అమెరికన్. అది సహజమైనది. ప్రతి ఒక్కరికి సర్వోన్నతమైన వాడు దేవుడు అని వేదాలు చెబుతున్నాయి. Nityo nityānāṁ cetanaś cetanānām (Kaṭha Upaniṣad 2.2.13). దేవుడు ఎవరు? అయిన అత్యంత ఖచ్చితమైన శాశ్వతమైనవాడు, అయిన అత్యంత పరిపూర్ణమైన జీవ శక్తి. అది దేవుడు.

Eko bahūnāṁ vidadhāti kāmān. Eko bahūnāṁ vidadhāti kāmān. అర్థం ఏమిటంటే ఒక జీవ శక్తి ఇతర జీవులు అoదరి యొక్క అన్ని అవసరాలను సరఫరా చేస్తుంది. ఒక కుటుంబం లో తండ్రి, భార్య, పిల్లల, సేవకుని యొక్క అవసరాలను సరఫరా చేస్తాడు, - ఒక చిన్న కుటుంబం. అదేవిధంగా, మీరు దానిని విస్తరించండి: ప్రభుత్వం లేదా రాష్ట్రం లేదా రాజు పౌరులు అందరి అవసరాలను సరఫరా చేస్తారు. కానీ ప్రతిదీ అసంపూర్తిగా ఉంది. అంతా అసంపూర్తిగా ఉంది. మీరు మీ కుటుంబానికి సరఫరా చేయవచ్చు, మీరు మీ సమాజానికి సరఫరా చేయవచ్చు, మీరు మీ దేశానికి సరఫరా చేయవచ్చు, కానీ మీరు అందరికీ సరఫరా చేయలేరు. కానీ లక్షలాది ట్రిలియన్ల జీవులు ఉన్నాయి. ఎవరు ఆహారం సరఫరా చేస్తున్నారు? ఎవరు మీ గది రంధ్రం లోపల వందలు వేల చీమలకు సరఫరా చేస్తున్నారు? ఎవరు ఆహారం సరఫరా చేస్తున్నారు? మీరు గ్రీన్ సరస్సుకి వెళ్ళినప్పుడు, వేలకొలది బాతులు ఉన్నాయి. ఎవరు వాటిని చూస్తున్నారు? కానీ అవి నివసిస్తున్నాయి. లక్షలాది పిచ్చుకలు, పక్షులు, జంతువులు, ఏనుగులు ఉన్నాయి. ఒకే సమయంలో అది వంద పౌండ్ల తింటుoది. ఎవరు ఆహారం సరఫరా చేస్తున్నారు? ఇక్కడ మాత్రమే కాదు, కానీ అనేక మిలియన్ల ట్రిలియన్ల లోకములు విశ్వాలు ప్రతిచోటా ఉన్నాయి. అది దేవుడు. Nityo nityānām eko bahūnāṁ vidadhāti kāmān. అందరూ అయిన మీద ఆధారపడి ఉన్నారు, అయిన అoదరి అవసరాలకు, అoదరి అవసరాలకు అందజేస్తున్నాడు. అంతా సంపూర్ణముగా ఉన్నది. కేవలము ఈ లోకము వలె , ప్రతిదీ పూర్తగా ఉంది.

Pūrṇam idaṁ pūrṇam adaḥ pūrṇāt pūrṇam udacyate pūrṇasya pūrṇam ādāya pūrṇam evāvaśiṣyate ( Iso Invocation)

ప్రతి లోకము అది పూర్తిగా ఉoడేటట్లు తయారు చేయబడినది నీరు ఉంది. సముద్రాలు మహాసముద్రాలలో నిలవ చేయబడినవి సూర్యరశ్మి ఆ నీటిని తీసుకుoటుoది. ఇక్కడ మాత్రమే కాదు, ఇతర లోకములలో కూడ, ఇదే పద్ధతి కొనసాగుతోంది. ఆది మేఘముగా రూపాంతరం చెందుతుంది, తరువాత భూమి మీద పంపిణి చేయబడుతుంది కూరగాయలు, పండ్లు మొక్కలు, ప్రతిదీ పెరుగుతాయి. ప్రతిదీ పూర్తి ఏర్పాటు చేయబడినది. మనము అర్థం చేసుకోవాలి, ప్రతిచోటా ఈ పూర్తి ఏర్పాటును చేసిన వారు ఎవరు. సూర్యుడు సరైన సమయములో ఉదయిస్తున్నాడు, చంద్రుడు సరైన సమయములో ఉదయిస్తున్నాడు, రుతువులు సరైన సమయంలో మారుతున్నాయి. మీరు ఎలా చెప్పగలరు? వేదాల్లో దేవుడు ఉన్నట్లు సాక్ష్యాలున్నాయి.