TE/Prabhupada 0350 - కృష్ణుడిని చూడటానికి ప్రజలను అర్హులని చేయటానికి మనము ప్రయత్నిస్తున్నాము

Revision as of 19:14, 8 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 7.2 -- Nairobi, October 28, 1975



బ్రహ్మనoద: వేదాల నుండి మనకు తెలుసు కృష్ణుడు అపరిమితమని, ప్రత్యేకంగా అయిన తన రాసా- లీలాను గోపీకలతో ప్రదర్శిస్తున్నప్పుడు. కృష్ణుడు అపరిమితం కానట్లయితే, అతను ఎందుకు చేయలేదు...?

భారతీయుడు: ప్రపంచమంతాట తాను ఎందుకు స్వయంగా వ్యక్తము కాలేదు తద్వారా జీవులు అందరు తిరిగి ఇంటికి వెళ్ళటానికి సమాన అవకాశము ఉండేది?

బ్రహ్మనoద: అన్ని జీవులకు సమాన అవకాశముండేటట్లు ఎందుకు అయిన ప్రపంచమంతా తనని తాను వ్యక్తమవ్వలేదు?

ప్రభుపాద: అవును, ఆయినను చూడడానికి మీకు కళ్ళు లేవు. అది మీ లోపం. కృష్ణుడు ప్రతిచోటా ఉన్నాడు. ఉదాహరణకు ఆకాశంలో సూర్యుడు ఉన్నాట్లు. మీరు ఇప్పుడు ఎందుకు చూడరు? అహ్? దీనికి సమాధానం ఇవ్వండి. సూర్యుడు ఆకాశంలో లేరని మీరు అనుకుంటున్నారా? మీరు సూర్యుడు అక్కడ లేరని అనుకుoటున్నారా? పైకప్పు మీదకు వెళ్లి సూర్యుడిని చూడండి. (నవ్వు) నీవు ఎందుకు నీవు ఒక ముర్ఖుడివిగా నిరూపించుకుoటావు, "లేదు, లేదు, సూర్యుడు ఉన్నాడు"? జ్ఞానవంతులైన వ్యక్తులు దీనిని అంగీకరించాలి? మీరు సూర్యుడిని చూడలేకపోతే సూర్యుడు లేడు అని కాదు? జ్ఞానము కలిగిన ఏ విద్వాంసుడైనా దీనిని ఆమోదిస్తాడా? రాత్రి మీరు సూర్యుడిని చూడలేరు, మీరు జ్ఞానవంతులైన మనుష్యులకు, ఎవరికైనా విషయములు తెలిసిన వ్యక్తికి చెప్పితే, , కాదు, లేదు, ఎటువంటి సూర్యుడు లేడు, కావున అయిన దానిని అంగీకరిస్తాడా? అయిన "సూర్యుడు ఉన్నాడు, నీవు ముర్ఖుడివి, నీవు చూడలేవు." అంతే. మీరు మీ ముర్కత్వము నుండి బయటపడండి. అప్పుడు మీరు చూస్తారు. Nāhaṁ prakāśaḥ sarvasya yoga-māyā-samāvṛtaḥ ( BG 7.25) కృష్ణుడు అన్నారు. అయిన దుష్టులకు బహిర్గతం కాడు, కానీ విషయములు తెలిసిన ఒక వ్యక్తి, అయిన చూస్తున్నాడు.

premāñjana-cchurita-bhakti-vilocanena
santaḥ sadaiva hṛdayeṣu vilokayanti
yaṁ śyāmasundaram acintya-guṇa...
(Bs. 5.38)

భక్తులు ఎప్పుడూ కృష్ణుడిని చూస్తారు. అయినకి, అయిన ఎల్లప్పుడూ ఉంటాడు. ముర్ఖులు, అయినని చూడలేరు. ఇది తేడా. మీరు మూర్ఖుడు కాకుండా ఉండాలి; అప్పుడు మీరు చూస్తారు. Īśvaraḥ sarva-bhūtānāṁ hṛd-deśe arjuna tiṣṭhati ( BG 18.6) ప్రతి ఒక్కరి హృదయములో కృష్ణుడు ఉంటాడు. కానీ మీకు తెలుసా? నువ్వు చూడగలవా? మీరు అతనితో మాట్లాడగలరా? అయిన మీ హృదయంలోనే ఉన్నాడు, అయిన ఉన్నాడు. కానీ అయిన ఎవరితో మాట్లాడతాడు? Teṣāṁ satata-yuktānāṁ bhajatāṁ prīti-pūrvakam, dadāmi buddhi-yogaṁ tam ( BG 10.10) తన సేవలో ఇరవై నాలుగు గంటలు పనిచేసే భక్తులతో అయిన మాట్లాడతాడు. ఇవి భగవద్గీతలో పేర్కొనబడ్డాయి. మీరు భగవద్-గీతను చదవారా? ప్రతి దానికి అర్హత అవసరం. ఈ కృష్ణ చైతన్య ఉద్యమం అంటే కృష్ణుడిని చూడటానికి ప్రజలను అర్హులని చేయటానికి మనము ప్రయత్నిస్తున్నాము. అర్హత లేకుండా, మీరు ఎలా చూడగలరు? దీనికి అర్హత అవసరం.