TE/Prabhupada 0369 - వీరు, నా శిష్యులు నాలో భాగము

Revision as of 19:17, 8 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Room Conversation with Life Member, Mr. Malhotra -- December 22, 1976, Poona


మిస్టర్ మల్హోత్రా: గతంలో చాలామంది ఋషులు ఎలా ప్రకటించారు, వారు ఆహాo బ్రహ్మాస్మిని.

ప్రభుపాద: (హిందీ). మీరు బ్రాహ్మణ్. ఎందుకంటే మీరు పరబ్రహ్మణ్ యొక్క భాగము. నేను ఇప్పటికే చెప్పాను, ఆ ... బంగారం, గొప్ప బంగారం మరియు చిన్న కణం, అది బంగారమే. అదేవిధంగా, భగవన్ పరబ్రహ్మణ్, మనము అయినలో భాగం . అందువలన నేను బ్రాహ్మణ్. కానీ నేను పరబ్రహ్మణ్ కాదు. అర్జునుడి చేత కృష్ణుడు పరబ్రహ్మణుడుగా అంగీకరించబడ్డాడు: paraṁ brahma paraṁ dhāma pavitraṁ paramaṁ bhavān ( BG 10.12) Parabrahman. పరమ్, ఈ పదమును పరామత్మా, పరబ్రహ్మణుడు, పరమేశ్వర ఉపయోగించారు. ఎందుకు? ఇది తేడా. ఒకరు దేవాదిదేవుడు ఒకరు సేవకుడు. సేవక బ్రాహ్మణ్. మీరు బ్రాహ్మణ్, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఆ పరబ్రహ్మణ్ కాదు. మీరు పరబ్రహ్మణ్ అయితే, ఎందుకు మీరు పరబ్రహ్మణుడిగా మారడానికి సాధనను ఎందుకు చేస్తున్నారు? ఎందుకు? మీరు పరబ్రహ్మణ్ అయితే, మీరు ఎప్పుడూ పరబ్రహ్మణ్ గానే ఉంటారు. మీరు పరబ్రహ్మణుడిగా మారడానికి సాధన చేయాడానికి ఈ పరిస్థితిలో ఎందుకు పడిపోయారు? అది మూర్ఖత్వం. మీరు పరబ్రహ్మణ్ కాదు. మీరు బ్రాహ్మణ్ మీరు బంగారం, చిన్న కణం. కానీ మీరు చెప్పకుడదు "నేను బంగారo గని అని" అది మీరు చేయకుడాదు. Paraṁ brahma paraṁ dhāma pavitraṁ paramaṁ bhavān ( BG 10.12) గోపాళ కృష్ణ: అయిన వెళ్ళడానికి సమయం అయినదో అయిన తనిఖీ చేస్తున్నాడు. మీరు మాతో రాబోతున్నారా? చాలా మంచిది.

ప్రభుపాద: కొంచము నీటిని తీసుకురండి. వీరు, నా శిష్యులు నాలో భాగాము సంస్థ మొత్తం వారి సహకారంతో జరుగుతోంది. కానీ వారు వారి గురు మహారాజుతో సమానం అని చెప్పినట్లయితే అప్పుడు అది అపరాధము.

మిస్టర్ మల్హోత్రా: నా శిష్యుడు నాకన్నా ఉన్నాత స్థాయికి ఎదాగాలని కొన్నిసార్లు గురువు కోరుకుంటాడు.

ప్రభుపాద: అంటే అయిన అధమ స్థాయిలో ఉన్నాడు. మీరు మొదట దానినిని అంగీకరించాలి.

మిస్టర్ మల్హోత్రా: ప్రతి తండ్రి తన పిల్లలు ఎదగాలని చూస్తాడు.

ప్రభుపాద: అవును, ఆప్పటికీ తండ్రి తండ్రిగా ఉంటాడు మరియు పిల్లవాడు తండ్రి కాలేడు.

మిస్టర్ మల్హోత్రా: తండ్రి తండ్రిగా ఉంటాడు. కానీ అయిన పురోగతి సాధించవచ్చని భావిస్తాడు ...

ప్రభుపాద: లేదు, లేదు. తండ్రి కొడుకు సమాన అర్హత సాధించాలని కోరుకోవచ్చు, కానీ తండ్రి తండ్రే, పిల్ల వాడు పిల్లవాడే. ఇది శాశ్వతమైనది. అదేవిధంగా, దేవుడి భాగము చాలా శక్తివంతమైనది కావచ్చు, కానీ అది అయిన దేవుడ అయ్యాడు అని కాదు.

మిస్టర్ మల్హోత్రా: ఇతర సంప్రదాయాలు, గురువు శిష్యుడు, తరువాత శిష్యుడు గురువు అవ్వుతాడు,తరువాత శిష్యులను పొందుతాడు. గురువులు మారవచ్చు.

ప్రభుపాద: వారు మార్చకూడదు. గురువు యొక్క మార్పు ఉంటే, శిష్యుడు నిర్వహించవచ్చు, అతను చేయ కూడదు. కానీ నేను గురువుతో సమానంగా ఉన్నానని లేదా సమానం అయ్యానని చెప్పకూడదు. అది అలా కాదు.

మిస్టర్ మల్హోత్రా: నేను దీని గురించి ఆలోచిస్తున్నాను, స్వామిజీ, మీ గురు మహారాజు మీ ద్వారా ప్రచారము చేస్తున్నారు మీరు వారి ద్వారా ప్రచారము చేస్తున్నారు.

ప్రభుపాద: అవును.

మల్హోత్రా: తన శిష్యుల ద్వారా, శిష్యుడు గురువు.

ప్రభుపాద: అది సరే. Evaṁ paramparā prāptam ( BG 4.2) కానీ అది అవ్వదు, అయిన అయ్యాడు ... అయిన గురువు ప్రతినిధి అయి ఉండవచ్చు, దేవుడు ప్రతినిధిగా ఉంటాడు, కానీ అయిన దేవుడు అయ్యాడు అని అర్థం కాదు.

మల్హోత్రా: కానీ అయిన తన శిష్యులతో గురువు అవుతాడు.

ప్రభుపాద: ఆది సరే.

మిస్టర్ మల్హోత్రా: తన గురువుతో ఎప్పుడూ సమానము కాడు.

ప్రభుపాద: సమానం కాడు, ప్రతినిధి. సమానము కాడు. నేను ఈ వ్యక్తి యొక్క ప్రతినిధిని పంపాను, అయిన చాలా నిపుణుడు కావచ్చు, చాలా మంచి వ్యాపారము చేస్తూన్నాడు, అయినప్పటికీ నాకు సమానం కాలేడు. అయిన నా ప్రతినిధిగా వ్యవహరిస్తున్నాడు, అది మరో విషయము. కానీ అయిన వాస్తవ యజమాని అయ్యాడని కాదు.

మిస్టర్ మల్హోత్రా: మీ శిష్యులు , మీమల్ని గురువుగా తీసుకుంటారు.

ప్రభుపాద: కానీ వారు నాతో సమానంగా ఉన్నారని వారు ఎన్నడూ చెప్పరు. నేను అభివృద్ధి చెందాను నా గురువుకి గురువు అవ్వటానికి. ఎప్పుడూ చెప్పరు. ఈ అబ్బాయి లాగానే, అయిన ప్రణామములు చేస్తున్నాడు అయిన ప్రచారము చేయుటలో నా కన్నా నిపుణుడు అవ్వచ్చు, కానీ అతనికి తెలుసు "నేను సేవకుడిగా ఉన్నాను". లేకపోతే ఎలా అయిన ఎందుకు ప్రణామము చేస్తాడు? అయిన ఆలోచించవచ్చు, ", ఇప్పుడు నేను చాల జ్ఞానవంతుడిని అయ్యాను, నేను చాల ఉన్నతి సాధించాను. నేను ఎoదుకు అయినని గురువుగా అoగీకరిస్తాను? " కాదు. అది కొనసాగుతుంది నా మరణం తరువాత కూడా, నేను వెళ్ళిపోయిన తర్వాత, అయిన నా చిత్రంకు ప్రణామము చేస్తాడు.

మిస్టర్ మల్హోత్రా: కానీ ఆతని శిష్యులు , అయినను పూజిస్తారు ...

ప్రభుపాద: అది సరే, కాని అయిన తన గురువు యొక్క శిష్యుడుగానే ఉంటాడు. "ఇప్పుడు నేను గురువు అయ్యాను, నా గురువును నేను పట్టించుకోను" అని ఎన్నడూ చెప్పడు. అయిన ఎన్నడూ చెప్పడు. నేను చేస్తున్నట్లే, నేను ఇప్పటికీ నా గురువును పూజిస్తున్నాను. నేను ఎల్లప్పుడూ నా గురువుకి సేవకుడిగానే ఉంటాను. నేను గురువు అయినప్పటికీ, ఇప్పటికీ నేను నా గురువుకు సేవకుడిగా ఉoటాను.