TE/Prabhupada 0411 - వారు ఒక నాగరికత,అందమైన నాగరికత సృష్టించారు: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0411 - in all Languages Category:TE-Quotes - 1975 Category:TE-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 6: Line 6:
[[Category:TE-Quotes - in Mexico]]
[[Category:TE-Quotes - in Mexico]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0410 - Nos amis ont déjà commencé la traduction|0410|FR/Prabhupada 0412 - Krishna désire que ce Mouvement pour la Conscience de Krishna se répande|0412}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0410 - మన స్నేహితులు, వారు ఇప్పటికే అనువాదం ప్రారంభించారు|0410|TE/Prabhupada 0412 - ఈ కృష్ణ చైతన్య ఉద్యమం విస్తరించబడాలని కృష్ణుడు కోరుకుంటున్నాడు|0412}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 17: Line 17:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|kgFA6WsXAGQ|వారు ఒక నాగరికత,అందమైన నాగరికత సృష్టించారు.  <br/>- Prabhupāda 0411}}
{{youtube_right|f4mnv_dCti0|వారు ఒక నాగరికత,అందమైన నాగరికత సృష్టించారు.  <br/>- Prabhupāda 0411}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 19:24, 8 October 2018



Departure Lecture -- Mexico City, February 18, 1975


మనము మన ఇల్లును తండ్రిని వదిలి, ఈ పతిత భౌతిక ప్రపంచంలోకి వచ్చి, చాలా బాధలు పడుతున్నాము. (హృదయనoద చే అనువదించబడింది.) ఇది చాలా ధనవంతుని యొక్క కొడుకు స్వతంత్ర్యం కోసం ఇంటిని విడిచిపెట్టినట్లుగా ఉన్నది, అనవసరంగా ఇబ్బంది తీసుకొని, గమ్యం లేకుండా ప్రపంచవ్యాప్తంగా సంచరిస్తాడు. (స్పానిష్ అనువాదము) ధనవంతుని కొడుకుకి ఏమీ కష్టం ఉండదు. ను (స్పానిష్ అనువాదము) అయినప్పటికీ, పాశ్చాత్య దేశాలలో ఇప్పుడు మనకు ఇలాంటి ఉదాహరణలు ఉన్నాయి, అనేక మంది ధనవంతుల కొడుకులు హిప్పీలు అవుతున్నారు, ఇంటిని విడిచిపెట్టి, అనవసరంగా ఇబ్బంది తీసుకుంటున్నారు. (స్పానిష్ అనువాదము) మన పరిస్థితి సరిగ్గా అదే విధంగా ఉంది. మనం కూడా అనవసరంగా అలానే, ఈ భౌతిక ప్రపంచం లోపల ఉన్న జీవులందరమూ. (స్పానిష్ అనువాదము) మనం కూడా స్వచ్ఛందంగా ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చాము. ఇంద్రియానందం కొరకు, (స్పానిష్ అనువాదము) ఇంద్రియాల ఆనందంలో మనము మన తండ్రిని దేవాదిదేవుని మర్చిపోయాము. (స్పానిష్ అనువాదము) భౌతిక ప్రకృతి యొక్క స్వభావం, కర్తవ్యము కేవలం మనకు జీవితంలో బాధాకరమైన పరిస్థితి ఇవ్వడం. (స్పానిష్ అనువాదము)

kṛṣṇa bhuliya jīva bhoga vāñchā kare
pāśate māyā tāre jāpaṭiyā dhare

దీని అర్థం జీవుడు, కృష్ణుడు లేకుండా జీవితాన్ని ఆస్వాదించాలని కోరుకుంటాడు, వెంటనే అతను మాయ యొక్క ఆధీనంలోకి వస్తాడు. (స్పానిష్ అనువాదము) ఇది మన పరిస్థితి. మనము మాయ యొక్క నియంత్రణలో ఉన్నాము, భగవద్గీత యథాతథంలో చెప్పినట్లుగా, మనం కూడ ఈ పరిస్థితి నుండి బయటికి రావచ్చు. Mām eva ya prapadyante maya m etāṁ taranti: నన్ను ఎవరైతే శరణు పొందుతారో వారు మాయ యొక్క నియంత్రణలో ఉండరు. (స్పానిష్ అనువాదము) అందువల్ల మనము ప్రపంచంలోని అన్ని దేశాలలో కృష్ణ చైతన్యాన్ని లేదా భగవంతుని చైతన్యమును ప్రచారం చేయాలి. వారికి కృష్ణుడికి ఎలా శరణు పొందాలనేది నేర్పించాలి, అందువలన మాయ యొక్క బారి నుండి బయటపడండి. (స్పానిష్ అనువాదము) దీనికంటే మనకు వేరే కోరిక లేదు, వేరే ఆశయం ఏదీ లేదు. (స్పానిష్ అనువాదము) దేవుడు ఇక్కడ ఉన్నాడు, మీరు అతనిని శరణాగతి పొందండి అని మనము స్పష్టంగా చెప్పాము. మీరు ఎల్లప్పుడూ అతనిని గురించి ఆలోచించండి, మీ ఆరాధనలను అందించండి. అప్పుడు మీ జీవితం విజయవంతమవుతుంది . (స్పానిష్ అనువాదము) కానీ సాధారణంగా ప్రజలు, వారు పిచ్చివాళ్ల లాగా ప్రవర్తిస్తారు. (స్పానిష్ అనువాదము) కేవలం ఇంద్రియ తృప్తి కోసం, వారు పగలు రాత్రి చాలా తీవ్రంగా పని చేస్తున్నారు. భక్తులు వారి దురవస్థను చూసి చాలా బాధ పడతారు . (స్పానిష్ అనువాదము)

ప్రహ్లాద మహారాజు చెబుతారు, "నేను ఈ వ్యక్తులను చూసి చాలా విచరిస్తున్నాను." ఎవరు వాళ్ళు? Tato vimukha-cetasa māyā-sukhāya bharam udvahato vimūḍhān ( SB 7.9.43) ఈ మూర్ఖులు, విమూఢాన్, వారు ఒక నాగరికత,అందమైన నాగరికత సృష్టించారు. అది ఏమిటి? ముఖ్యంగా మీ దేశంలో వలె, వీధులను శుభ్రం చేయుట కోసం ఒక వాహనం. చేసే పని వీధులను శుభ్రం చేయుట , దాని కోసం వారు ఒక వాహనం తయరు చేశారు: "గర్, గర్ , గర్ , గర్ , గర్ , గర్...." అని శబ్దం చేస్తూంది (స్పానిష్ అనువాదము) వీధులను శుభ్రం చేసే పని చేయితో చేయవచ్చు. చాలామంది వ్యక్తులు ఉన్నారు. కానీ వారు వీధులలో పని చేయకుండా తిరుగుతున్నారు, వీధులను శుభ్రం చేయుటకు భారీ వాహనం అవసరమవుతుంది. (స్పానిష్ అనువాదము) ఇది భారీ ధ్వని చేస్తుంది ఇది చాలా ప్రమాదకరమైనది కూడా, కానీ వారు "ఇది నాగరికత పురోగతి" అని ఆలోచిస్తున్నారు. (స్పానిష్ అనువాదము) అందువలన ప్రహ్లాద మహారాజు, మాయా-సుఖయా అన్నారు. కేవలం వీధులను శుభ్రం చేసే పని నుండి ఉపశమనం పొందడానికి - వారు ఇతర సమస్యలు తెచ్చారు - ఉపశమనం ఏమి లేదు, కానీ వారు ఆలోచిస్తూ ఉంటారు, "ఇప్పుడు మనము వీధులను శుభ్రం చేసే పని చేయనవసరము లేదు, ఇది గొప్ప ఉపశమనం అని భావిస్తున్నారు". (స్పానిష్ అనువాదము) అదేవిధంగా, ఒక సాధారణ రేజర్, షేవింగ్ కోసం ఉపయోగించవచ్చు, కానీ వారు చాలా యంత్రాలు తెచ్చారు. (స్పానిష్ అనువాదము) యంత్రాలు తయారు చేయుటకు, చాలా కర్మాగారాలు. (స్పానిష్ అనువాదము) ఈ విధంగా, మనము అధ్యయనం చేస్తే, వస్తువు తర్వాత వస్తువులెన్నో, ఈ రకమైన నాగరికత రాక్షసుల నాగరికత అంటారు. (స్పానిష్ అనువాదము) ఉగ్ర-కర్మ. ఉగ్ర-కర్మ అంటే క్రూరమైన కార్యక్రమాలు. (స్పానిష్ అనువాదము)

భౌతిక సౌకర్యాల కోసం ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ వాస్తవానికి వారు ఇవి సుఖాలా లేదా దుర్భర పరిస్థితులా అనేది చూడాలి . (స్పానిష్ అనువాదము) అందువల్ల మానవజన్మ మానవ జీవితం మన కృష్ణ చైతన్యమును అభివృద్ధి చేయడానికి ఉద్దేశించబడింది. (స్పానిష్ అనువాదము) ఇది వున్నది అనవసరంగా వృధా చేసుకోవడానికి కాదు. (స్పానిష్ అనువాదము) ఎందుకంటే మనకు మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. (స్పానిష్ అనువాదము) మనము తరువాతి జీవితం కోసం మనము సిద్ధంగా లేకపోతే, అప్పుడు ఏ సమయంలో యైనా మనము మరణిస్తాము, అప్పుడు భౌతిక ప్రకృతి అందించే శరీరాన్ని మనము అంగీకరించాలి. (స్పానిష్ అనువాదము) అందువలన నేను కోరుతున్నాను రండి మీరందరు ఈ కృష్ణ చైతన్య ఉద్యమంలో చేరండి, ఎంతో జాగ్రత్తగా ఉండండి, మాయ కృష్ణుడి చేతిలో నుండి మిమ్మల్ని లాక్కొనిపోవచ్చు. (స్పానిష్ అనువాదము) క్రమబద్ధమైన సూత్రాలను అనుసరించడం ద్వార మనం మన స్థితిని స్థిరంగా ఉంచుకోవచ్చు, కీర్తన, జపము చేయడము, కనీసం పదహారు మాలలు. అప్పుడు మనము సురక్షితంగా ఉంటాము. (స్పానిష్ అనువాదము) మీరు జీవితం యొక్క పరిపూర్ణత్వము గురించి కొంత సమాచారాన్ని పొందారు. దీన్ని దుర్వినియోగం చేయవద్దు. చాల స్థిరంగా ఉండడానికి ప్రయత్నించండి, మీ జీవితం విజయవంతమవుతుంది. (స్పానిష్ అనువాదము) ఈ ఉద్యమం సౌకర్యవంతమైన జీవితాన్ని ఆపదు, కానీ అది నియంత్రిస్తుంది. (స్పానిష్ అనువాదము) మనం కీర్తన పదహరు మాలలు జపము, క్రమబద్ధమైన సూత్రలను అనుసరిస్తే, అది మన సురక్షిత స్థానము. (స్పానిష్ అనువాదము) ఈ ఆదేశాన్ని అనుసరిస్తారని నేను భావిస్తున్నాను. అది నా కోరిక. చాలా ధన్యవాదాలు. (స్పానిష్ అనువాదము) భక్తులు: జయ! జయ