TE/Prabhupada 0430 - భగవంతుని ప్రతి ఒక్క పేరు భగవంతుడు అంత శక్తివంతమని శ్రీ చైతన్య మహాప్రభు చెప్తారు: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0430 - in all Languages Category:TE-Quotes - 1972 Category:TE-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 6: Line 6:
[[Category:TE-Quotes - in United Kingdom]]
[[Category:TE-Quotes - in United Kingdom]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0429 - Krishna est le nom de Dieu. Krishna désigne l’Infiniment Fascinant, l’Absolument Bon|0429|FR/Prabhupada 0431 - Dieu est en fait l’Ami parfait de tous les êtres|0431}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0429 - కృష్ణుడు భగవంతుని పేరు. కృష్ణుడు అంటే అందరికీ ఆకర్షణీయమైనవాడు, అంతా మంచి వాడు|0429|TE/Prabhupada 0431 - భగవంతుడు నిజానికి అన్ని జీవుల యొక్క పరిపూర్ణ స్నేహితుడు|0431}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 17: Line 17:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|l4e2CG-q4Iw|భగవంతుని ప్రతి ఒక్క పేరు భగవంతుడు అంత శక్తివంతమని శ్రీ చైతన్య మహాప్రభు చెప్తారు  <br/>- Prabhupāda 0430}}
{{youtube_right|I7u-EpHf23w|భగవంతుని ప్రతి ఒక్క పేరు భగవంతుడు అంత శక్తివంతమని శ్రీ చైతన్య మహాప్రభు చెప్తారు  <br/>- Prabhupāda 0430}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 19:27, 8 October 2018



Lecture on BG 2.11 -- Edinburgh, July 16, 1972


nāmnām akāri bahudhā nija-sarva-śaktis
tatrārpitā niyamitaḥ smaraṇe na kālaḥ
etādṛśī tava kṛpā bhagavan mamāpi
durdaivam īdṛśam ihājani nānurāgaḥ
(CC Antya 20.16)

భగవంతుని ప్రతి ఒక్క పేరు భగవంతుడు అంత శక్తివంతమని శ్రీ చైతన్య మహాప్రభు చెప్తారు దేవుడు సంపూర్ణము . అందువలన అతని నామము, రూపము మరియు లీలలు మధ్య ఎటువంటి భేదము లేదు. భగవంతుడు నుండి అది భిన్నమైనది కాదు ఇది సంపూర్ణ జ్ఞానము అద్వయ జ్ఞానము మీరు కనుక భగవంతుని నామము ధ్యానించి నట్లయితే మీరు భగవంతునితో ప్రత్యక్షముగా ఉంటారు. ఎందుకంటే నామము భగవంతుని కంటే భిన్నము కాదు.అర్ధము చేసుకొనుటకు ప్రయత్నించండి అదే విధంగా, మీరు అగ్నిని తాకినట్లయితే, అది పనిచేస్తుంది. అగ్ని యొక్క లక్షణము మీకు తెలియదు, లేదా తెలియకపోతే దానికి పట్టింపు లేదు మీరు అగ్నిని తాకితే అది పనిచేస్తుంది. అదేవిధంగా మనం భగవంతుని నామం జపిస్తే అది పనిచేస్తుంది. ఉదాహరణకు మీరు అగ్నిలో ఇనుప కడ్డీని ఉంచినట్లుగా అది వెచ్చగా ,వెచ్చగా అవుతూ ,క్రమంగా అది ఎర్రటి వేడిగా మారుతుంది అగ్నితో సంబంధము ద్వారా ఇనుపకడ్డీ అగ్ని అవుతుంది .ఇనుపకడ్డీ అగ్ని కాదు. కానీ అగ్నితో సంబంధం ద్వారా, అది అగ్ని వలె అయింది బాగా వేడిగా ఉన్నప్పుడు ,ఎక్కడైనా తాకండి ఇనుపకడ్డీ కాలుస్తుంది. అదే విధంగా మీరు ఎల్లప్పుడూ దేవుని తో స్నేహితంగా ఉండినట్లయితే, క్రమంగా మీరు భక్తులు అవుతారు. మీరు భగవంతుడు కాలేరు,కానీ మీరు దైవీకంగా అవుతారు మీరు దైవికంగా మారినప్పుడు ,మీ దైవిక లక్షణాలు అన్నీ ఆవిష్కరింప బడతాయి . ఇది శాస్త్రం .అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి .మనం భగవంతునిలో భాగము మరియు అంశ మీరు భగవంతుని తెలుసుకోవచ్చు భగవంతుడు ఎవరు, మీరే తెలుసుకోవచ్చు. ఎందుకంటే నేను ఒక భాగాన్ని , ఎలా అంటే ఒక బియ్యపు సంచిలో నుండి కొన్ని బియ్యపు గింజలు తీస్తే మీరు చూస్తారు ,ఎటువంటి నాణ్యమైన బియ్యము సంచిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా ,భగవంతుడు గొప్పవాడు. అది సరియైనది కానీ మనము మన గురించి తెలుసుకున్నట్లయితే మనము భగవంతుని అర్థం చేసుకోవచ్చు. ఎలా అయితే మీరు సముద్రం నుండి ఒక నీటి బొట్టు తీసినట్లయితే మీరు సముద్రం యొక్క రసాయన మిశ్రమం  ఏమిటో అర్థం చేసుకోవచ్చు. మీరు అర్థం చేసుకోవచ్చు. అందువల్ల అది ధ్యానం అని పిలువబడుతుంది . మనల్ని మనం తెలుసుకోవటం “ నేను ఏమిటి?”. ఒక వ్యక్తి తనను తాను నిజాయితీగా అధ్యయనం చేసినట్లయితే అతడు కూడా భగవంతుని అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు తీసుకోండి ,ఉదాహరణకు ,”నేను ఏమిటి?” మీరు కూడా  మీ మీద ధ్యానం చేస్తే ,మీరు ఒక వ్యక్తి అని అర్థం చేసుకోవచ్చు ప్రత్యేక వ్యక్తి అంటే మీకు మీ సొంత అభిప్రాయం ఉంది ,నాకు నా సొంత అభిప్రాయం ఉంది. అందువలన కొన్ని సార్లు మనం విభేదిస్తాము ఎందువలన అంటే మీరు ఒక ప్రత్యేక వ్యక్తి నేను ఒక ప్రత్యేక వ్యక్తి కాబట్టి ఎలాగైతే మనమందరం వ్యక్తులమో ,మనం భగవంతుని భాగం , అంశం అయినందున భగవంతుడు కూడా వ్యక్తి అయి ఉండవలెను ఇది అధ్యయనం. నేను ఒక వ్యక్తిని, భగవంతుడు కూడా వ్యక్తి .భగవంతుడు నిరాకారుడు కాదు మనం భగవంతుని నిజమైన తండ్రిగా తీసుకుంటే ,పరమపిత క్రైస్తవ మత నమ్మకం. అన్ని  ఇతర మతాలు నమ్ముతాయి .మనం కూడా భగవద్గీతను నమ్ముతాము  ఎందుకంటే కృష్ణుడు చెప్తారు  "Aham  bhija pradhah  Pitha "( BG 14.4) నేను అన్ని జీవుల యొక్క నిజమైన తండ్రిని అందువలన ,భగవంతుడు అన్ని జీవులకు తండ్రి అయినట్లయితే ,మనము వ్యక్తి ఎట్లు భగవంతుడు నిరాకారుడు అవగలడు భగవంతుడు కూడా వ్యక్తి. దీనిని తత్త్వము అని పిలుస్తారు దీనిని తర్కం అని పిలుస్తారు

ఇప్పుడు ఇక్కడ ఈ ప్రపంచంలో ,మనం ఎవరినైనా ప్రేమించాలని మనకు అనుభవం ఉన్నాది ఎవరైనా. జంతు సామ్రాజ్యం లో కూడా . సింహం కూడా తన పిల్లలను ప్రేమిస్తుంది. ప్రేమ ఉంది .అది ప్రేమ అని అంటారు కావున ,ఈ ప్రేమ వ్యవహారం భగవంతునిలో కూడా ఉంది ఇంక మనము భగవంతుని తో సంబంధం కలిగినప్పుడు మన వ్యవహారాలు కేవలం ప్రేమ ఆధారంగానే ఉంటాయి నేను కృష్ణుని ప్రేమిస్తున్నాను ,లేదా భగవంతుడు కృష్ణుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఇది ఇంద్రియాల మను మార్పిడి. ఈ విధంగా, భగవంతుని యొక్క, మీరు వేదముల సాహిత్యం చదువుకున్నా అది మనకు సహాయం చేస్తుంది మీరు భగవంతుని గురించి లోతుగా తెలుసుకున్న వారైతే ,మీరు భగవంతుని అర్థం   చేసుకొనగలరు  ఎందువలన అంటే ,నేను భగవంతుని యొక్క నమూనా. సూక్ష్మ పదార్థమును ఎలాగైతే బంగారపు కణము కూడా బంగారముగా ఉన్నట్లుగా సముద్రపు నీటి చుక్క కూడా ఉప్పగా ఉంటుంది సముద్రము కూడా ఉప్పగా ఉంటుంది మీరు అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా ,మన వ్యక్తిత్వమును అర్థం చేసుకోవటం ద్వారా ,మన ప్రవృత్తిని అధ్యయనం చేయడం ద్వారా భగవంతుడు ఏమిటో అర్థం చేసుకోగలము ఇది ఒకవైపు ఇక్కడ భగవంతుడు వ్యక్తిగతంగా తనను తాను కృష్ణుడిగా చూపిస్తున్నారు అతను చెప్తారు" yada yada hy dharmasya "...( విరామం)  శుద్ధ భక్తులను రక్షించుటకు మరియు రాక్షసులను చంపడానికి నేను అవతరిస్తాను కానీ గుర్తు పెట్టుకోండి ,భగవంతుడు సంపూర్ణంగా ఉన్నాడు భక్తులకు ముక్తిని ఇచ్చినా, రాక్షసులను చంపినా ,రెండూ ఒకే విషయం ఎందువలన అంటే  వేద సాహిత్యంలో మనం తెలుసుకుంటాం ఎవరైతే రాక్షసులు భగవంతునిచే చంపబడ్డాతారో వారు కూడా అదే రక్షణ ,ముక్తి స్థానమునకు వెళతారు ఎందుకంటే అతడు భగవంతునిచే చంపబడ్డాడు .అతడు భగవంతుని చేత తాకబడిన వాడు ఇది గొప్ప శాస్త్రం ఇది మూఢనమ్మకం కాదు ఇది జ్ఞానము మరియు ప్రామాణిక వేదముల సాహిత్యం ఆధారంగా ఉంది మా ఏకైక అభ్యర్థన ఏమిటంటే ఈ ఉద్యమాన్ని మీరు ముఖ్యముగా తీసుకుంటే మీరు సంతోషంగా ఉంటారు