TE/Prabhupada 0431 - భగవంతుడు నిజానికి అన్ని జీవుల యొక్క పరిపూర్ణ స్నేహితుడు



Lecture on BG 2.11 -- Edinburgh, July 16, 1972


ఆనందం కోసం,మూడు విషయాలు ఉన్నాయి అర్థం చేసుకోవటానికి . ఇది భగవద్గీతలో చెప్పబడింది

bhoktāraṁ yajña-tapasāṁ
sarva-loka-maheśvaram
suhṛdaṁ sarva-bhūtānāṁ
jñātvā māṁ śāntim ṛcchati
(BG 5.29)

మీరు మూడు విషయాలు మాత్రమే అర్థం చేసుకోవాలి.అప్పుడు మీరు శాంతిగా ఉంటారు. అవి ఏమిటి? మొదటి విషయం దేవుడు అనుభవించేవాడు" అని, నేను అనుభవించేవాడిని కాను” కానీ ఇక్కడ,మన పొరపాటు, ప్రతిఒక్కరూ ఆలోచిస్తున్నారు, "నేను ఆనందిచే వాడిని." కానీ నిజానికి, మనము అనుభవించే వారిమి కాదు. ఉదాహరణకు, నేను దేవునిలో భాగము ఉదాహరణకు నా చేయి నా శరీరం యొక్క భాగం ఒక మంచి పండ్ల కేక్, మంచి రుచికరమైన కేక్ ను చేయి పట్టుకుంటే చేయి దాన్ని ఆస్వాదించ లేదు. చేయి దానిని తీసుకొని మరియు నోటిలో అది ఉంచుతుంది కడుపులోకి వెళ్లినప్పుడు, ఆ ఆహారం తినడం ద్వారా శక్తి సృష్టించబడుతుంది, దానిని చేయి ఆనందిస్తుంది. ఈ చేయి మాత్రమే కాదు - ఈ చేయి కూడా, కళ్ళు కూడా, కాళ్ళు కూడా. అదేవిధంగా, మనము నేరుగా దేనిని ఆనందించలేము. మనము దేవుని ఆనందం కోసం ప్రతిదీ ఉంచి తరువాత మనము తీసుకుంటే ఆ అనoదములో పాల్గొoటే, అది మన ఆరోగ్యకరమైన జీవితం ఇది తత్వము. మనము దేనిని తీసుకోము. Bhagavat-prasādam. Bhagavat-prasādam. మన తత్వము మనం మంచి ఆహారన్ని సిద్ధం చేసి మనము కృష్ణుడికి అర్పిస్తాము, అతను తిన్న తరువాత, మనము అది తీసుకుంటాము. అది మన తత్వము. కృష్ణుడికి అర్పించనిది మనము ఏదీ తీసుకోము. కాబట్టి మనము మహోన్నతముగా అనుభవించేది దేవుడు అని అంటున్నాము మనము అనుభవించే వారిమి కాదు.మనము అందరము సేవకులుగా ఉంటాము కాబట్టి bhoktāraṁ yajña-tapasāṁ sarva-loka-maheśvaram ( BG 5.29) దేవుడు అన్నింటికి యజమాని. అది వాస్తవము. ఇప్పుడు గొప్ప మహాసముద్రం తీసుకుందాం. మీరు యజమానిగా ఉన్నారా? మనము ఈ భూమికి లేదా ఈ సముద్రానికి యజమానిని అని చెప్తున్నాము. కానీ వాస్తవానికి, నా జన్మకు ముందు, అక్కడ సముద్రం ఉంది, అక్కడ భూమి ఉంది, నామరణం తరువాత, అక్కడ సముద్రం ఉంటుంది, అక్కడ భూమి ఉంటుంది. నేను యజమనిని అయింది ఎప్పుడు ? ఉదాహరణకు ఈ హాల్లో వలె. మనము ఈ హల్లోకి వచ్చే ముందు, హాల్ ఉన్నది, మనము ఈ హాల్ నుండి బయటకు వెళ్లినప్పుడు, హాల్ ఉంటుంది. అప్పుడు మనము యజమని అయింది ఎప్పుడు? ఒక గంట లేదా అరగంట ఇక్కడ కూర్చుని మనము తప్పుగా వాదించినట్లయితే, మనము యజమాని అయ్యాము అది తప్పుడు అభిప్రాయము. మనము యజమాని లేదా ఆనందించే వారిమి కాదు అని మనము అర్థం చేసుకోవాలి. Bhoktāraṁ yajña... దేవుడు ఆనందిచేవాడు. దేవుడు యజమాని. Sarva-loka-maheśvaram. మరియు suhṛdaṁ sarva-bhūtānām ( BG 5.29) అతను ప్రతి ఒక్కరికి మంచి స్నేహితుడు. అతను కేవలం మానవ సమాజం యొక్క స్నేహితుడు మాత్రమే కాదు. అతను జంతు సమాజం యొక్క స్నేహితుడు కూడా. ఎందుకంటే ప్రతి జీవి దేవుడి కుమారుడు. మనం మనుషులతో ఒక విధముగా జంతువులతో మరొక విధముగా ఎలా వ్యవహరిస్తాము? లేదు దేవుడు నిజానికి అన్ని జీవుల యొక్క పరిపూర్ణ స్నేహితుడు. ఈ మూడు విషయాలను మనము అర్థం చేసుకుంటే, వెంటనే మనము శాంతిని పొందుతాము.

bhoktāraṁ yajña-tapasāṁ
sarva-loka-maheśvaram
suhṛdaṁ sarva-bhūtānāṁ
jñātvā māṁ śāntim ṛcchati
(BG 5.29)

ఇది శాంతి యొక్క పద్ధతి. మీరు స్థాపించలేరు... మీరు "నేను దేవుడు ఏకైక కుమారుడిని, మరియు జంతువుకు, ఆత్మ లేదు, మనము చంపుదాము, "ఇది చాల మంచి తత్వము కాదు. ఎందుకు కాదు? ఆత్మ కలిగి ఉండటానికి లక్షణాలు ఏమిటి? ఆత్మ కలిగి ఉన్నది అనే దానికి లక్షణాలు, అవే నాలుగు సూత్రాలు: తినడం, నిద్రపోవటం, సంభోగము చేయడము, రక్షించుకోవటము. ఈ నాలుగు విషయలలో జంతువులు కూడా బిజీగా ఉన్నాయి; మనము కూడా ఈ నాలుగు విషయలలో బిజీగా ఉన్నాము. అప్పుడు జంతువుకు నాకు మధ్య తేడా ఏమిటి?

అందువల్ల వేదముల సాహిత్యం యొక్క తత్వములో ప్రతి ఒక్క దానికి స్పష్టమైన భావన ఉంది, ముఖ్యముగా అవి భగవద్గీతలో ఇది సంగ్రహంగా ఉంది. మా ఏకైక అభ్యర్ధన ఏమిటంటే మీరు దేవుడి చైతన్యము కలిగి ఉండండి. ఇది అవకాశము. ఈ మానవ జీవితము మాత్రమే దేవుడిని అర్థం చేసుకోవడానికి మనకున్న ఏకైక అవకాశము, నేను ఏమిటి, దేవుడుతో నాకున్న సంబంధం ఏమిటి. జంతువులు - మనము ఈ సమావేశములో పిల్లులను మరియు కుక్కలను ఆహ్వానించలేదు. అది సాధ్యం కాదు. మనం మానవులను ఆహ్వానించాము. ఎందుకంటే వారు అర్థము చేసుకోగలరు మానవుడికి ప్రత్యేకహక్కు, అర్థం చేసుకునే ప్రత్యేకహక్కు ఉన్నది Durlabhaṁ mānuṣaṁ janma. అందువల్ల దీనిని దుర్లభ అని పిలుస్తారు, చాలా అరుదుగా మనకు ఈ మానవ రూపం వచ్చింది. మనము ఈ రూపాన్ని అర్థం చేసుకోవడనికి ఈ జన్మలో ప్రయత్నించకపోతే "దేవుడు అంటే ఏమిటి, నేను ఏమిటి, మన సంబంధం ఏమిటి, "అప్పుడు మనము ఆత్మహత్య చేసుకుంటున్నాము. ఈ జీవితం తరువాత, నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టిన వెంటనే, నేను మరొక శరీరాన్ని అంగీకరించాలి. నేను ఏ విధమైన శరీరాన్ని అంగీకరిస్తానో అది మనకు తెలియదు. ఇది నా చేతిలో లేదు. మీరు "తదుపరి జీవితములో నన్ను ఒక రాజుని చేయండి అని" ఆదేశించలేరు. అది సాధ్యం కాదు. మీరు వాస్తవమునకు రాజుగా ఉండటానికి అర్హులైతే, ప్రకృతి మీకు రాజ భవనంలో ఒక శరీరాన్ని ఇస్తుంది. మీరు చేయలేరు. అందువలన, మనం తదుపరి, మెరుగైన శరీరాన్ని పొందేందుకు కృషి చేయాలి. అది కూడ భగవద్గీతలో వివరించబడింది:

yānti deva-vratā devān
pitṟn yānti pitṛ-vratāḥ
bhūtāni yānti bhūtejyā
yānti mad-yājino 'pi mām
(BG 9.25)

మనం తరువాతి శరీరానికి ఈ జీవితంలో మనము సిద్ధం అయితే, భగవద్ ధామమునకు తిరిగి వెళ్ళటానికి, భగవంతుని దగ్గరకు తిరిగి వెళ్ళటానికి మీరు ఎందుకు సిద్ధం కారు. ఇది కృష్ణ చైతన్య ఉద్యమం. ప్రతి ఒక్కరికి తాను ఎలా సిద్ధం అవ్వాలో మనం బోధిస్తున్నాము ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత, అతను నేరుగా దేవుడి దగ్గరకు వెళ్ళవచ్చు. తిరిగి ఇంటికి, భగవంతుని దగ్గరకు తిరిగి వెళ్ళటము. ఇది భగవద్గీతలో చెప్పబడింది. Tyaktvā dehaṁ punar janma naiti mām eti kaunteya ( BG 4.9) Tyaktvā deham, ఇది ఇచ్చివేసిన తరువాత ... (విరమం) ... మనము ఇచ్చి వేయవలసి ఉంటుంది. నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టాలని అనుకోను, కానీ నేను తప్పక వదిలివేయాలి. ఇది ప్రకృతి చట్టము. "మరణము వలె ఖచ్చితముగా." మనం మరణానికి ముందే మనం సిద్ధం అవ్వాలి. మనము అలా చేయకపోతే, మనం మనల్ని చంపుకుoటున్నాము, ఆత్మహత్య చేసుకుంటున్నాము. ఈ కృష్ణ చైతన్య ఉద్యమము మానవ సమాజమును రక్షించటానికి బాగా దెబ్బతినకుండా ఉండుటకు తప్పుడు శరీర భావన వలన సరళమైన పద్ధతి పదహారు పదాలను కీర్తన చేయడము లేదా మీరు తత్వవేత్త అయితే, మీరు శాస్త్రవేత్త అయితే, మీరు ప్రతిదీ శాస్త్రీయంగా తెలుసుకోవాలంటే, తత్వపరముగా, మా దగ్గర ఈ పెద్ద పెద్ద పుస్తకలు ఉన్నాయి. మీరు పుస్తకలను చదువుకోవచ్చు లేదా మాతో హరే కృష్ణ మంత్రం కీర్తనలో కలవవచ్చు.

చాలా ధన్యవాదలు