TE/Prabhupada 0433 - మనం చెప్పుతాము మీకు అక్రమ లైంగిక సంబoధము ఉండకూడదు

Revision as of 19:28, 8 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Morning Walk -- May 13, 1975, Perth


గణేశ: శ్రీల ప్రభుపాద, శ్రీ ఈశోపనిషత్తులో, ఒకరు అవిద్య విధానమును నేర్చుకోవాలి అని చెప్పబడినది,

ఆత్మ-సాక్షాత్కార పద్ధతితో పాటు.

ప్రభుపాద: ...

గణేశ: ఈశోపనిషత్తులో , ప్రవృత్తితో నివృత్తితో అది ఎలా ఉంది?

ప్రభుపాద: ఆ పవృత్తి, నివృత్తి అంటే ఏమిటి?

అమోఘ: ఆయన చెప్పుతున్నారు, ఈశోపనిషత్తులో, అది చెప్పుతుంది మీరు తప్పక అవిద్య పద్ధతితో పాటు ఆత్మ-సాక్షాత్కార పద్ధతిని కూడా తెలుసుకోండి.

ప్రభుపాద: అవిద్య, అవును. అది పవృత్తి మరియు నివృత్తి పవృత్తి అంటే ఇంద్రియతృప్తి అని అర్థం. నివృత్తి అంటే స్వయముగా తిరస్కరించుట అని అర్థం. మనం చెప్పినప్పుడు "మీకు అక్రమ లైంగిక సంబoధము ఉండకూడదు," వారి అనుకూలత అక్రమ లైంగిక సంబoధము, కాబట్టి ఇది విప్లవాత్మకమైనది. వారు భౌతిక వ్యక్తులు. వారు ఉత్తమ సామర్థ్యం కొద్ది మైథున సుఖము ఆనందించాలని కోరుకుంటారు స్వలింగ సంపర్కము, ఈ మైథున సుఖము, ఆ మైథున సుఖము, నగ్నంగా నృత్యం చేయటము, అన్ని లైంగికంగా ఆసక్తి కలిగి ఉoడటము, pravṛtti. మనము చెప్పుతాము, "వీటిని ఆపండి" నివృత్తి. వారు ఇష్టపడరు ఎందుకంటే అసురులు. పవృత్తిjagat. ఇది చాలా అవసరము అని వారికీ తెలియదు. వారికి ఇది తెలియదు. ఇది చాలా అవసరము.Tapasā brahmacaryena ( SB 6.1.13) తపస్య అంటే బ్రహ్మచర్య. స్వాములు అని పిలవబడే , వారు ఈ యోగా అభ్యాసం అని పిలవబడే దాని కోసం వస్తున్నారు ... కాని వారికి వారే మైథున సుఖము యొక్క బాధితులు. ఇది జరుగుతోంది. వాస్తవమునకు, అది ఒక బూటకము - వారు స్వామిగా మారి ఏదో యోగ పద్ధతిని భోదిస్తున్నారు - ఎందుకనగా ఇది ఎవరైనా మొదట నిలిపివేయవలసి ఉందని వారికీ తెలియదు. Brahmacaryena. అందువల్ల ఈ మోసము చేయుట ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది, మనము నేరుగా వారికి వ్యతిరేకముగా మాట్లాడుతున్నాము. Murkhayopadeśo hi prakopāya na śāntaye. మీరు మూర్ఖులకు ఉపదేశము చేస్తే, ఆయన కేవలము కోపంతో ఉంటాడు. ఆయన దాని ప్రయోజనమును తీసుకోడు. ఇది మన పరిస్థితి. ప్రొఫెసర్లు, తత్వవేత్తలు అని పిలవబడేవారు, వారు అందరు ప్రవృత్తి-మార్గములో ఉన్నారు. కాబట్టి వారు ఎవరినో తీసుకొని వస్తున్నారు, "మా వ్యాఖ్యానం ఇలా ఉన్నది." ప్రవృత్తి -మార్గము. ఎందుకనగా, వారు శాస్త్రము నుండి కొంత మద్దతును కనుగొంటే, "మనము సురక్షితము" అని వారు అనుకుంటారు. ఇది జరుగుతోంది. Pravṛttim ca nivṛttim janā na vidur āsurāḥ. మొత్తం ప్రపంచం అసురులతో ఉన్నది, హిరణ్యకశిపుని వంశమునకు చెందినవారు, ఇది చాలా కష్టము. కాని మనం వారికి అవకాశం కల్పిస్తే హరే కృష్ణ మంత్రమును క్రమముగా వారు అర్థం చేసుకుంటారు. (దీర్ఘ విరామం) మన కష్టము: స్వాములు, పూజారులు, పోప్స్, అని పిలువబడే వారు, వారు కూడా pravṛtti-mārga లో ఉన్నారు. వీరందరు, పూజారులు, వారు అక్రమ లైంగిక సంబంధము కలిగి ఉన్నారు. Pravṛtti-Marga. కాబట్టి వారు చెప్పుతున్నారు, "అవును, మీరు పురుషునితో స్వలింగ సంపర్కం కలిగి ఉండవచ్చు." వారు పురుషునితో పురుషునికి వివాహం చేస్తున్నారు. నీకు తెలుసా? వారు బహిరంగముగా చర్చిలో పురుషునితో పురుషునికి వివాహ వేడుకను జరిపిస్తున్నారు. ఏ తరగతి వ్యక్తులు వారు ? మరియు వారు పూజారులు. చూడండి. ఇటువంటి దిగజారిన వ్యక్తులు, త్రాగేవారు ... వారి త్రాగే వ్యాధిని నివారించడానికి వారికి ఆస్పత్రి ఉన్నది. అమెరికాలో ఒక ఆసుపత్రిలో ఐదువేల మంది రోగులు, అందరూ తాగుబోతులు, మరియు వారు పూజారి. మీరే చూడండి. పొడవాటి బట్టలు ధరించడము, దానిని ఓవర్కోట్ అంటారు

శృతకీర్తి: క్లోక్. అమోఘ: హబీట్?

ప్రభుపాద: క్లోక్ మరియు క్రాస్, వారు అయ్యారు. భారతదేశంలో, కేవలం ఒక జంధ్యము ధరించడము, ఒక బ్రాహ్మణుడు అయిపోతాడు . రెండు-పైసల దారము. అంతే.

పరమహంస: రైల్వే స్టేషన్ వద్ద కూలీలు కూడా.

ప్రభుపాద: కేవలం ఒక దండం కలిగి ఉంటే, ఒక సన్యాసి అయిపోతారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంది. ముసల్మాన్, పొడవైన గడ్డంతో, ఆయన ముసల్మాన్ . Mussuleḥ iman. Musseleḥ అంటే పూర్తిగా, ఇమాన్ అంటే నిజాయితీ. అది ముసల్మాన్ యొక్క అర్థం. పూర్తిగా నిజాయితీగా, పూర్తిగా అంకితమైన.