TE/Prabhupada 0432 - మీరు చదువుతున్నంత కాలం, సూర్యుడు మీ జీవితాన్ని తీసుకోలేడు
Lecture on SB 2.3.17 -- Los Angeles, June 12, 1972
Pāvakaḥ. Dahati pāvakaḥ ( BG 2.23) అధునిక శాస్త్రవేత్తలు, వారు సూర్య లోకములో, సూర్యగోళంలో ప్రాణము లేదా జీవులు లేరని వారు చెబుతారు. కానీ ఇది వాస్తవము కాదు. సూర్యగోళము అంటే ఏమిటి? అది ఒక మండుతున్న లోకము, అంతే. కానీ ఆత్మ అగ్నిలో నివసించవచ్చు, అతను ఒక మండుతున్న శరీరమును పొందుతాడు. ఇక్కడ ఉన్నట్లు, ఈ లోకము మీద, భూమిపై, ఈ భూసంబంధమైన శరీరము మనకు ఉన్నది. ఇది చాలా అందముగా ఉండవచ్చు, కానీ అది భూమి. కేవలం ప్రకృతి నడపటము వలన. మనము వస్తున్నట్లుగానే ... కరంధర నాకు చూపించాడు. ప్లాస్టిక్, కొన్ని చెట్లు. వారు చెట్టును సరిగ్గా పోలి ఉండే ప్లాస్టిక్ చెట్లను తయారు చేసారు. కానీ అది చెట్టు కాదు. అదేవిధముగా, ఈ శరీరము, ప్లాస్టిక్ శరీరం ఎంత ఉపయోగమో, అంతే ఉపయోగము దీనికి విలువ లేదు. కావున త్వక్త్వా దేహం. ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత కృష్ణుడు చెప్పుతున్నాడు ... కానీ ఈ శరీరము ప్లాస్టిక్ శరీరము. ఉదాహరణకు మీకు కాటన్ చొక్కా లేదా ప్లాస్టిక్ చొక్కా లేదా చాలా ఉన్నట్లుగానే. మీరు దానిని వదిలి వేయవచ్చు. అంటే మీరు చనిపోయారు అని కాదు. ఇది కూడా భగవద్గీతలో వివరించబడినది: vāsāṁsi jīrṇāni yathā vihāya ( BG 2.22) ఒక కొత్త వస్త్రము కొరకు పాత వస్త్రాన్ని వ్యక్తులు వదలివేస్తారు, అదేవిధముగా, మరణము అంటే ఈ ప్లాస్టిక్ శరీరాన్ని విడిచిపెట్టి, మరొక ప్లాస్టిక్ శరీరాన్ని తీసుకోవటము.
అది మరణం. మళ్ళీ, ఆ ప్లాస్టిక్ శరీరము కింద, మీరు పని చేయాలి మీకు ఒక చక్కని శరీరము వస్తే, అప్పుడు మీరు చక్కగా పని చేయవచ్చు. మీకు ఒక కుక్క శరీరము వస్తే, మీరు కుక్కలా పని చేయలి. శరీరము ప్రకారము. కావున tyaktvā deham. కృష్ణుడు చెప్తున్నాడు "నన్ను వాస్తవముగా అర్థం చేసుకున్న వారు ఎవరైన ..." మీరు ఎలా అర్థం చేసుకోగలరు? మీరు అతని గురిoచి విన్నప్పుడు, అప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. అప్పుడు మీరు గ్రహించవచ్చు. శ్రవణము చాలా కష్టమైన పని కాదు. కానీ మీరు సాక్షత్కారము పొందిన వ్యక్తి నుండి వినండి. అంటే ... Satāṁ prasaṅgān mama vīrya-saṁvidaḥ. మీరు ఒక ప్రొఫెషనల్ వ్యక్తి నుండి విన్నట్లయితే, అది ప్రభావవంతముగా ఉండదు. భక్తుడు నుండి, భక్తుడు యొక్క పెదవుల నుండి, సాధువు నుండి మాత్రమే వినండి. ఉదాహరణకు శుకదేవ గోస్వామి, మహారాజు పరీక్షిత్తు తో మట్లాడిన విధముగానే. ... లేదా మీ నుంచి మీరే విన్నప్పటికీ, మీరు పుస్తకాలను చదవండి, మీరు మీ జీవితాన్ని కాపాడుకుంటారు. మీరు కేవలం కృష్ణ పుస్తకాన్ని చదివినట్లైతే, లేదా భగవద్గీత, లేదా చైతన్య మహాప్రభు ఉపదేశములను చదివితే, అప్పుడు తెలుసుకుంటారు ... మీరు చదివుతున్నoత కాలం, సూర్యుడు మీ జీవితాన్ని తీసుకోలేడు. సూర్యుడికి మీ జీవితాన్ని తీసుకోవటానికి సాధ్యం కాదు.
మీరు నిరంతరము చదివినట్లయితే, సూర్యునికి మీ జీవితాన్ని తీసుకునే అవకాశం ఎక్కడ ఉంది? అంటే మీరు శాశ్వతముగా మారారు. ప్రజలు మరణము లేకుండా ఉండటానికి చాలా ఆత్రుతగా ఉన్నారు. ఎవరూ చనిపోవాలని కోరుకోరు. అందరికీ "నేను చనిపోతాను" అని తెలుసు. కానీ వెంటనే ఏదైనా ప్రమాదం ఉంటే, అగ్ని, వెంటనే మీరు ఈ గది నుండి దూరముగా వెళ్ళిపోతారు. ఎందుకు? నేను చనిపోవాలని అనుకోను. నేను చనిపోవాలని అనుకోను. ఏమైనప్పటికీ నాకు తెలుసు, నేను చనిపోవాలని. అయినా, నేను ఎందుకు వెళ్తాను? అది నాకు తెలుసు... అక్కడ అగ్నిని ఉండనివ్వండి. నేను ఈ రోజో లేదా రేపో చనిపోవాలి. నన్ను చనిపోనివ్వండి. లేదు. నేను చనిపోవాలని అనుకోను. అందువల్ల నేను వెళ్ళిపోతాను. ఇది మనస్తత్వము. ప్రతి ఒక్కరు శాశ్వతముగా జీవించాలనుకుంటున్నారు. అది వాస్తవము. మీరు శాశ్వతముగా జీవించాలనుకుంటే, అప్పుడు మీరు కృష్ణ చైతన్యమును తీసుకోవాలి. కృష్ణ చైతన్య ఉద్యమం చాలా ముఖ్యమైనది మరియు బాగుంటుoది. అందరూ బ్రతకాలని కోరుకుంటున్నారు. కానీ వాస్తవానికి, మీరు జీవించాలనుకుంటే, అప్పుడు మీరు కృష్ణ చైతన్యమును తీసుకోవాలి. ఈ శ్లోకము అది నిర్ధారిస్తుంది. Āyur harati vai puṁsām udyann astaṁ ca yann asau. సూర్యుడు ఉదయాన్నే ఉదయిస్తాడు. అది ఉదయిస్తున్నప్పుడు, క్రమముగా అది మీ జీవితాన్ని తీసుకుంటోంది. అంతే.
అది దాని కర్తవ్యము. కానీ మీరు సూర్యుడిని ఓడించాలనుకుంటే ... సూర్యుడు చాలా శక్తివంతమైవాడు. పోరాడటము చాలా కష్టము. కానీ మీరు సూర్యునితో పోరాడవచ్చు. ఎలా? కేవలం కృష్ణ కథ, కృష్ణుడి పదాలు చదవడం ద్వారా. Uttama-śloka-vārtayā. Vārtayā. Uttama-śloka, Kṛṣṇa. కావున ఇది సరళమైన పద్ధతి. మీ సమయాన్ని వృధా చేయకండి అర్థము లేనివి మాట్లాడటము ద్వారా. అందువల్ల రూప గోస్వామి సలహా ఇచ్చారు,
- atyāhāraḥ prayāsaś ca
- prajalpo niyamāgrahaḥ
- jana-saṅgaś ca laulyaṁ ca
- ṣaḍbhir bhaktir vinaśyati
- (NOI 2)
మన భక్తి జీవితము ముగిసి పోవచ్చు, అనగా అస్తవ్యస్తత ఏర్పడవచ్చు ... భక్తి జీవితములో ఉన్నవారు, కృష్ణ చైతన్యము కలిగిన వారు, వారు అదృష్టవంతులు. ఈ సంపదను ఆరు విషయాలు నాశనం చేస్తాయి. జగ్రత్తగా ఉండండి. అది ఏమిటి? Atyāhāra. Atyāhāra అంటే అవసరము కంటే ఎక్కువగా తినడం, లేదా అవసరము కంటే ఎక్కువగా సేకరించడము. Āhāra. Āhāra అనగా సేకరించడము అంతే. మనము కొంత డబ్బు వసూలు చేయాల్సిన అవసరం ఉంది, కానీ మనము కావలసిన దాని కoటే ఎక్కువ సేకరించకూడదు. అది మనము చేయకూడదు. ఎందుకంటే నేను మరింత డబ్బు సంపాదించినట్లయితే, అప్పుడు వెంటనే మాయ ... ఎందుకు మీరు నాకు ఖర్చు చేయడము లేదు? అవును. అవసరము కంటే ఎక్కువ సేకరించవద్దు ... మీ అవసరం ఏమిటి, దాని కోసము సేకరించoడి. లేదా అదేవిధముగా, అహార అంటే తినడం. అవసరం కంటే ఎక్కువ తినవద్దు. వాస్తవమునకు, మనము ఏమి చేయని స్థాయికి రావాలి, తినడం, నిద్రపోవడము, సంభోగము చేయడము, రక్షించుకోవటము. మనకు ఈ శరీరము ఉన్నందువలన అది మనకు సాధ్యం కాదు. కానీ కనీసము