TE/Prabhupada 0442 - క్రైస్తవ తత్వములో దేవుడుని ఇలా ప్రార్థిస్తారు, మాకు రోజువారి ఆహారాన్ని అందించు

Revision as of 09:26, 20 September 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0442 - in all Languages Category:TE-Quotes - 1968 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 2.8-12 -- Los Angeles, November 27, 1968



భక్తుడు: "కృష్ణుడు స్పష్టంగా చెబుతున్నాడు భవిష్యత్తులో కూడా భగవంతుని మరియు ఇతరులు వ్యక్తులు అని, అది ఉపనిషత్తులలో ధృవీకరించబడినట్లు, నిరంతరం కొనసాగుతుంది. కృష్ణుడి యొక్క ఈ వచనమే ప్రమానం. "

ప్రభుపాద: అవును, ఉపనిషత్తులు నిత్యో నిత్యానాం అని చెబుతున్నాయి. ఇప్పుడు, నిత్య అంటే శాశ్వతమైనది, మరియు దేవాదిదేవుడు సర్వోన్నత శాశ్వతుడు, మనము వ్యక్తిగత ఆత్మలము, మనము కూడా అనేక శాశ్వతముగా ఉన్నాము అందువలన అతను శాశ్వత యజమాని. Eko bahūnām... అతను ఎలా యజమాని అవుతాడు? Eko bahūnāṁ vidadhāti kāmān. ఆ ఒకడు,ఒక శాశ్వతమైన వ్యక్తి, అతను ఇతర శాశ్వత జీవుల యొక్క అన్ని అవసరాలను సరఫరా చేస్తున్నాడు. ఈ విషయాలు వేదాలలో స్పష్టంగా చెప్పబడ్డాయి. వాస్తవానికి మనము అనుభూతి చెందుతున్నాము. ఉదాహరణకు క్రైస్తవ తత్వములోవలె,ఒక వ్యక్తి చర్చికి వెళతాడు మరియు దేవుడుని ఇలా ప్రార్థిస్తాడు, క్రైస్తవ తత్వములో దేవుడుని ఇలా ప్రార్థిస్తారు, మాకు రోజువారి ఆహారాన్ని అందించు మాకు రోజువారి ఆహారాన్ని అందించు. ఎందుకు అతను దేవుణ్ణి అడుగుతున్నాడు? వాస్తవానికి, ఈ నాస్తిక తరగతి వ్యక్తులు ఇప్పుడు వారికీ ప్రచారము చేస్తున్నరు, "ఆహారం ఎక్కడ ఉంది? మీరు చర్చికి వెళ్తున్నారు. మీరు మా దగ్గరకు రండి. మేము మీకు ఆహారం ఇస్తాము. " ఈ వేదముల ఆలోచన అక్కడ కూడా ఉంది. వేదాలు ఇలా చెబుతున్నాయి, eko bahūnāṁ vidadhāti kāmān. ఆ శాశ్వత యజమాని, అతను అన్ని ఇతర వ్యక్తిగత శాశ్వత జీవులకు ఆహారాన్ని సరఫరాచేస్తూ, పోషిస్తున్నాడు. మరియు బైబిలు కూడ దానిని ఇలా సమ్మతిస్తోంది: "మీరు దేవుడు వద్దకు వెళ్లి మీ ఆహారం కొరకు అడుగండి." దేవుడు సరఫరాదారు మరియు పోషకుడు కాకపోతే, ఎందుకు ఈ ఉత్తర్వు ఉంది? అందువలన అతను యజమాని; అతను సంరక్షకుడు. ఇది భగవంతుని స్థితి అని వేదాలు స్పష్టంగా చెబుతున్నాయి. అతను దేవదిదేవుడు. మరియు ఈ విషయం తెలుసుకోవడం ద్వారా ఎవరైనా శాంతిని పొందుతారు. అది వేదముల ఉత్తర్వు.కొనసాగించు.

భక్తుడు: "కృష్ణుడి ఈ ప్రకటన ప్రామాణికమైనది, ఎందుకంటే కృష్ణుడు భ్రాంతికి గురికాడు కాబట్టి.ఒక వేళ వ్యక్తిత్వం...."

ప్రభుపాద: అవును. మాయావాది తత్వవేత్త కృష్ణుడు మాయలో వుండి ఈ ప్రతిపాదన చేసాడని చెబుతాడు, ఏంటంటే "కృష్ణుడు ఇలా చెబుతాడు 'ప్రతి ఒక్కరూ గతంలో వ్యక్తులము.' లేదు, గతంలో ప్రతిఒక్కరూ ఒకటే, ఏకమొత్తంగ, సజాతీయంగా వున్నవాళ్ళం మాయ కారణంగా, మనము వ్యక్తిగతులుగా మారాము." మాయావాదులు ఇలా చెప్పినట్లయితే, కృష్ణుడు బధ్ధజీవులలో ఒకడు అవుతాడు. అతను పరమ సత్యాన్ని బోధించలేడు... అతను తన ప్రామాణికత్వం కోల్పోతాడు. ఎందుకంటే బధ్ధజీవి మీకు వాస్తవాన్ని అందిoచలేడు. ఎవరైనా బద్ధ జీవి అయితే వారు మీకు పరమసత్యాన్ని వివరించలేరు. కృష్ణుడు బధ్ధజీవి కాదు.కాబట్టి ఆయన పరమసత్యంగా అంగీకరించబడ్డాడు. ఒకవేళ మాయావాద సిధ్ధాంతాన్ని అంగీకరించినట్లయితే , అప్పుడు కృష్ణుడి సిద్ధాంతాన్ని తిరస్కరించాల్సి ఉంటుంది. అలా కృష్ణున్ని తిరస్కరించినట్లయితే, దేవాదిదేవుడు శ్రీ కృష్ణభగవానుడు పుస్తకం, భగవద్గీత చదివే అవసరం లేదు. అతను మనకు వలె ఒక బధ్ధజీవి అయిఉంటే వాటిని చదవడం నిష్ఫలం, సమయం వృధా అయివుండేవి... ఎందుకంటే, ఒక బధ్ధజీవి నుండి మనము ఏ విధమైన సూచనను తీసుకోలేము. ఆధ్యాత్మిక గురువు విషయానికి వస్తే, మీరు ఆయనను బధ్ధజీవిగా భావించినా, కానీ అతను తన వైపు నుండి ఏమీ మాట్లాడడు. అతను కృష్ణుడి వైపు నుండి మాట్లాడతాడు. వేద ప్రమానం ఏమంటే ఎవరైనా భౌతిక పరిస్థితుల నుండి విముక్తి పొందకపోతే,అలా జరగక పోతే, అతను మనకు ఏ పరిపూర్ణ జ్ఞానం ఇవ్వలేడు. బధ్ధజీవి,అతను భౌతిక జ్ఞానపరంగా ఉన్నతుడైనా,విద్యావంతుడైనా అతను మనకు ఏ పరిపూర్ణ జ్ఞానాన్ని ఇవ్వలేడు. కేవలం భౌతిక చట్టాల పరిధికి అతీతుడైన వ్యక్తి మాత్రమే, అతను మనకు పరిపూర్ణ జ్ఞానాన్ని ఇవ్ళగలడు. అదేవిధంగా శంకరాచార్య, అతను కూడ నిరాకారవాది, కానీ అయన కృష్ణుడి అత్యున్నత ప్రామాణికాన్ని అంగీకరించారు. Sa bhagavān svayaṁ kṛṣṇa. "కృష్ణుడు భగవంతుడు, దేవాదిదేవుడు." ఆధునిక మాయావాద తత్వవేత్తలు, వారు శంకరాచార్యుని ఈ ప్రకటనను బహిర్గతం చేయరు. ప్రజలను మోసం చేసేందుకు. కానీ శంకరాచార్య యొక్క ప్రకటన ఉంది. మనము సాక్ష్యం చూపించగలం. అతను కృష్ణుడిని పరమ ప్రామాణికునిగా అంగీకరించాడు. అతను కృష్ణుడిని ప్రశంసించే లేదా పూజించే చాలా మంచి పద్యాలను రచించాడు. చివరిసారి అతను ఇలా చెప్పారు, bhaja govindaṁ bhaja govindaṁ bhaja govindaṁ mūḍha-mate. ఓ పరమ మూర్ఖులారా. , అయ్యో! మీరు కేవలం వ్యాకరణాన్ని అర్థం చేసుకోవడంలో నిమగ్నమై ఉన్నారు. అది వ్యర్థము, భజ గోవిందం. "గోవిందుని పూజించుము." భజ గోవిందం భజ ... ఇలా అతను మూడు సార్లు చెప్పాడు. గోవిందుని పూజించు. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం. ఎలాగంటే చైతన్య మహప్రభు మూడు సార్లు, harer nāma harer nāma harer nāma ( CC Adi 17.21) అని చెప్పినట్లు. మూడు సార్లు అంటే నొక్కి వక్కాణించడం అని అర్థం. మనం కొన్నిసార్లు ఇలా చెప్తాము, "మీరు దీన్ని చేయండి, దీన్ని చేయండి, దీన్ని చేయండి." అంటే దానిని నిరాకరించకూడదు అని అర్థం. పదేపదే చెప్పిన దానిని ఆచరించమని. అంటే ఒక విషయాన్ని మూడు సార్లు నొక్కి చెప్పినట్లయితే,అది తుది నిర్ణయం అని అర్థం. కాబట్టి శంకరాచార్య ఇలా చెప్పారు, bhaja govindaṁ bhaja govindaṁ bhaja govindaṁ mūḍha-mate. మూఢ, మూఢ అంటే నేను అనేక సార్లు వివరించాను. మూఢ అనగా మూర్ఖపు, గాడిద. మీరు మీ వ్యాకరణ సంబంధమైన అవగాహన మీద ఆధారపడి ఉన్నారు, dukṛn karan. డుకృన్, ఇవి వ్యాకరణ సంబంధమైన ఆది ఉపసర్గ, ప్రత్యయ, ప్రకరణలు. ఇలా మీరు ఈ మౌఖిక మూలంపై ఆధారపడుతున్నారు, మరియు అర్థం కనుగొనడం, వేరే విధంగా అర్థాన్ని మార్చిచేప్పడం. ఇదంతా అర్థం లేనిది. ఈ డుకృన్ కరణె, మీ వ్యాకరణ పాండిత్య పాటవాలు, మరణ సమయంలో మీమ్మల్ని రక్షించలేవు. ఓ మూర్ఖులారా, మీరు కేవలం గోవిందుని భజించండి, గోవిందుని భజించండి, గోవిందుని భజించండి. అదే శంకరాచార్యులవారి యొక్క ఆదేశం. ఎందుకంటే అతను ఒక భక్తుడవడమే కారణం. అతను గొప్ప భక్తుడు. కానీ అతను నాస్తికునిగా నటించాడు. ఎందుకంటే అతను నాస్తికులతో వ్యవహరించాల్సివుంది కాబట్టి. అతను తనను తాను నాస్తికుడిగా ప్రదర్శించుకొనకపోయిట్లయితే, నాస్తిక అనుచరులు అతని మాట వినరు. కాబట్టి సమయానుసారంగా ఆయన మాయావాద సిధ్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఆ మాయావాద తత్వము శాశ్వతంగా అంగీకరించబడేది కాదు. శాశ్వతమైన తత్వము భగవద్గీత. అది వైదిక శాసనము.