TE/Prabhupada 0445 - ప్రతి ఒక్కరిని నారాయణునితో సమానంగా భావించడం ఒక మోజుగా తయారయింది: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0445 - in all Languages Category:TE-Quotes - 1977 Category:TE-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 7: Line 7:
[[Category:TE-Quotes - in India, Mayapur]]
[[Category:TE-Quotes - in India, Mayapur]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0444 - Les gopis ne sont pas des âmes conditionnées; elles sont des âmes libérées|0444|FR/Prabhupada 0446 - N’essayer pas de séparer Laksmi de Narayana|0446}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0444 - గోపికలు బధ్ధజీవులు కారు. వారు ముక్తాత్ములు|0444|TE/Prabhupada 0446 - నారాయణుడి నుండి లక్ష్మిని వేరు చేయటానికి ప్రయత్నించవద్దు|0446}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 18: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|nFEneWj1i14|ప్రతి ఒక్కరిని నారాయణునితో సమానంగా భావించడం ఒక మోజుగా తయారయింది  <br/>- Prabhupāda 0445}}
{{youtube_right|4vYuBa-tLvI|ప్రతి ఒక్కరిని నారాయణునితో సమానంగా భావించడం ఒక మోజుగా తయారయింది  <br/>- Prabhupāda 0445}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->


Line 32: Line 32:


ప్రద్యుమ్న: అనువాదం - "భాగ్యదేవత, శ్రీ లక్ష్మీ దేవి, భగవంతుడు నరసింహావతారంలో హిరణ్యకశిపు సంహారం చేసిన తర్వాత, దేవతలందరూ ఆమెను భగవంతున్ని సమీపించమని కోరినప్పుడు,భయం కారణంగా ఆమె ఆయనను సమీపించ లేకపోయింది. ఎందుకంటే భగవంతుని యొక్క అటువంటి అద్భుతమైన అసాధారణ రూపాన్ని ఆమె ఎప్పుడూ చూడలేదు, అందుచేత ఆమె ఆయనను సమీపించలేక పోయింది. "  
ప్రద్యుమ్న: అనువాదం - "భాగ్యదేవత, శ్రీ లక్ష్మీ దేవి, భగవంతుడు నరసింహావతారంలో హిరణ్యకశిపు సంహారం చేసిన తర్వాత, దేవతలందరూ ఆమెను భగవంతున్ని సమీపించమని కోరినప్పుడు,భయం కారణంగా ఆమె ఆయనను సమీపించ లేకపోయింది. ఎందుకంటే భగవంతుని యొక్క అటువంటి అద్భుతమైన అసాధారణ రూపాన్ని ఆమె ఎప్పుడూ చూడలేదు, అందుచేత ఆమె ఆయనను సమీపించలేక పోయింది. "  
ప్రభుపాద:  
ప్రభుపాద:  
:sākṣāt śrīḥ preṣitā devair
:sākṣāt śrīḥ preṣitā devair

Latest revision as of 19:30, 8 October 2018



Lecture on SB 7.9.2 -- Mayapur, February 12, 1977


ప్రద్యుమ్న: అనువాదం - "భాగ్యదేవత, శ్రీ లక్ష్మీ దేవి, భగవంతుడు నరసింహావతారంలో హిరణ్యకశిపు సంహారం చేసిన తర్వాత, దేవతలందరూ ఆమెను భగవంతున్ని సమీపించమని కోరినప్పుడు,భయం కారణంగా ఆమె ఆయనను సమీపించ లేకపోయింది. ఎందుకంటే భగవంతుని యొక్క అటువంటి అద్భుతమైన అసాధారణ రూపాన్ని ఆమె ఎప్పుడూ చూడలేదు, అందుచేత ఆమె ఆయనను సమీపించలేక పోయింది. "

ప్రభుపాద:

sākṣāt śrīḥ preṣitā devair
dṛṣṭvā taṁ mahad adbhutam
adṛṣṭāśruta-pūrvatvāt
sā nopeyāya śaṅkitā
(SB 7.9.2)

శ్రీదేవి, లక్ష్మి, ఆమె ఎల్లప్పుడూ నారాయణునితో, భగవంతునితో కలిసి ఉంటుంది. లక్ష్మీ-నారాయణ. ఎక్కడైతే నారాయణుడు ఉంటాడో, అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. Aśvaryasya samāgrasya vīryasya yaśasaḥ śriyaḥ (Viṣṇu Purāṇa 6.5.47). శ్రియః. అంటే భగవంతుడు, దేవాదిదేవుడు, ఎల్లప్పుడూ ఆరు విభూతులను సంపూర్ణంగా కలిగివుంటాడు: ఐశ్వర్య, అంటే సంపద; సమగ్రశ్య, సంపూర్ణంగా కలిగివుంటాడు ... ఎవరూ ఆయనతో పోటీపడలేరు. ఇక్కడ ఈ భౌతిక ప్రపంచంలో పోటీవుంటుంది. నీవు ఒక వెయ్యి రూపాయలు కలిగి ఉండవచ్చు.నేను రెండు వేల రూపాయలు కలిగి వుండవచ్చు. మరొక వ్యక్తి మూడువేల రూపాయలు లేదా మూడు మిల్లియన్లు కలిగి ఉండవచ్చు. మనం ఎవ్వరూ చెప్పలేము, "నేను ప్రపంచంలోని సకల సంపదను కలిగి ఉన్నాను."అని లేదు. అది సాధ్యం కాదు. ఇక్కడ పోటీ వుంటుంది. సమ ఊర్ద్వ.. సమ అర్థం "సమానమైన", ఊర్ద్వ అంటే "ఎక్కువ." నారాయణునితో ఎవరూ సమానులు లేరు, నారాయణుని కంటే ఎవ్వరూ అధికులు లేరు. ఈ రోజుల్లో, దరిద్ర-నారాయణ అనేది ఒక మోజుగా మారింది. కాదు. దరిద్రుడు నారాయణుడు కాలేడు, నారాయణుడు కూడ ఎప్పటికీ దరిద్రుడు కాడు, ఎందుకంటే నారాయణుడు ఎప్పుడూ శ్రీదేవి,లక్ష్మీదేవితో కూడి ఉంటాడు. అతను ఎలా దరిద్రుడు అవుతాడు? ఇవన్నీ స్వకల్పిత అవివేక కల్పనలు, అపరాధాలు.

yas tu nārāyaṇaṁ devaṁ
brahmā-rudrādi-daivataiḥ
samatvena vikṣeta
sa pāṣaṇḍi bhaved dhruvam
(CC Madhya 18.116)

శాస్త్రాలు ఈ విధంగా చెబుతున్నాయి,యస్తు నారాయణ దేవమ్. నారాయణుడు, దేవాదిదేవుడు ... బ్రహ్మ-రుద్రాది దైవతైః. దరిద్రుని గురించి మట్లాడటం ఎందుకు, మీరు నారాయణున్ని అటువంటి గొప్ప, గొప్ప దేవతలతో కూడా సరిపోల్చలేరు. బ్రహ్మ వలె లేదా శివుడిని వలె , మీరు "నారాయణున్ని బ్రహ్మ లేదా శివుని తో సమానంగా తలిస్తే," samatvena vikṣeta sa pāṣaṇḍi bhaved dhruvam, వెంటనే అతను ఒక పాషంఢుడుగా పరిగణించబడతాడు. పాషంఢి అంటే చాలా హేయమైనవాడు. ఇది శాస్త్ర ప్రమాణం. Yas tu nārāyaṇaṁ devam brahmā-rudrādi-daivataiḥ samatvena.

ప్రతి ఒక్కరితో నారాయణున్ని సమానంగా భావించడం, ఇది ఒక మోజుగా తయారయింది. ఈ విధంగా,భారతదేశ సంస్కృతి విచ్ఛిన్నమైంది. నారాయణునికి ఎవరూ సమానులు లేరు. నారాయణుడు భగవద్గీతలో స్వయంగా ఈ విధంగా చెప్పాడు, mattaḥ parataraṁ nānyat kiñcid asti dhanañjaya ( BG 7.7) ఇక్కడ ఇంకొక పదం వాడబడుతుంది: అసమూర్ద్వ. ఎవరూ నారాయణునితో, విష్ణుతత్వాలతో సమానులు కాలేరు.అది జరగదు. Oṁ tad viṣṇoḥ paramaṁ padaṁ sadā paśyanti sūrayaḥ (Ṛg Veda 1.22.20). ఇది రుగ్వేద మంత్రం. విష్ణో పాద పరమ పాదమ్. భగవంతుడు అర్జునునిచే ఈవిధంగా సంబోధించబడినాడు , paraṁ brahma paraṁ dhāma pavitraṁ paramaṁ bhavān ( BG 10.12) పరమం భవాన్. ఈ పాషండి కల్పన ఆధ్యాత్మిక జీవితంలో ఒకరి పురోగతిని అంతంచేస్తుంది. మాయావాద. మాయావాద. అందుచేత చైతన్య మహాప్రభు మాయావాదులతో సాంగత్యాన్ని నిషేధించారు. Māyāvādī bhāṣya śunile haya sarva-naśa ( CC Madhya 6.169) మాయావాదులతో సంబంధం కలిగి ఉన్న ఎవరైన తన ఆధ్యాత్మికజీవితాన్ని నాశనం చేసుకున్నవారవుతారు. సర్వ-నాశ. Māyāvādī haya kṛṣṇe aparādhi. ఈ దుష్ట మాయావాదులతో కలవకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నారాయణుడు దరిద్రుడు అయ్యాడు అటువంటి సందర్భాలు లేవు. అది అసాధ్యం.

ఎందుకంటే నారాయణుడు ఎల్లప్పుడు సాక్షాత్తు లక్ష్మిదేవితో కూడి ఉంటాడు. శ్రీ, ముఖ్యంగా ఇక్కడ, శ్రీదేవి, లక్ష్మీదేవి, ఆమె నారాయణుని నిత్య సహచారిణి. ఆ శ్రీ విస్తరణ సాక్షాత్తు వైకుంఠంలో ఉంది. Lakṣmī-sahasra śata-sambrahma sevyamānaṁ.

cintāmaṇi prakara-sadmasu kalpa vṛkṣa
lakśāvṛteṣu surabhīr abhipālayantam
lakṣmī sahasra-śata sambrahma-sevyamānaṁ
govindam ādi-puruṣaṁ tam ahaṁ bhajāmi
(Bs. 5.29)

కేవలం ఒకేఒక లక్ష్మి కాదు.కానీ లక్ష్మీ సహస్ర శత. వారు భగవంతున్ని సేవిస్తున్నారు, సంబ్రమ సేవ్యమాన. మనము లక్ష్మిదేవిని ప్రార్థిస్తూ, సంబ్రమముతో, "తల్లి, నాకు కొంత డబ్బు ఇవ్వు. నాకు ఈ కొద్దిపాటి మేలు చేయ్యి, నేను సంతోషంగా ఉంటాను" అని అంటాము. అయినప్పటికీ, ఆమె, శ్రీదేవి ఒక్క దగ్గర నిలవదు, ఆమె మరొక పేరు చంచల. చంచల,ఆమె ఈ భౌతిక ప్రపంచంలో ఉంది. నేడు నేను లక్షాధికారిని కావచ్చు; రేపు నేను వీధిలో యాచకునిగా మారిపోవచ్చు. ఎందుకంటే ప్రతి వైభవం డబ్బు మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి డబ్బు, దానిని ఇక్కడ ఎవరూ స్థిరంగా కల్గివుండలేరు. అది సాధ్యం కాదు. ఆ చంచల స్వభావురాలైన లక్ష్మిదేవి కూడా, ఆమె సంబ్రమంతో,గౌరవంతో భగవంతున్ని ఆరాధిస్తూవుంది. ఇక్కడ మనం ఆలోచిస్తున్నాం, "లక్ష్మి మనకు దూరంగా వెళ్ళిపోవచ్చు," కానీ అక్కడ, శ్రీదేవి ఆలోచిస్తున్నది, "కృష్ణుడు నన్ను వదలి వెళ్ళిపోకూడదు"అని. అది తేడా. ఇక్కడ ఏ సమయంలోనైన లక్ష్మి మనకు దూరంగా వెళ్ళిపోవచ్చని మనము భయపడుతున్నాము, కృష్ణుడు తనని వదలి వెళ్తాడని ఆమె భయపడుతోంది. ఇదే వ్యత్యాసం. కాబట్టి అటువంటి కృష్ణుడు, అటువంటి నారాయణుడు, అతను ఎలా దరిద్రుడు అవుతాడు? ఇవన్నీ కల్పనలు