TE/Prabhupada 0456 - శరీరాన్ని కదిలించే జీవి, ఇది ఉన్నతమైన శక్తి

Revision as of 19:32, 8 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on SB 7.9.6 -- Mayapur, February 26, 1977


భగవద్గీతలో ఇది చెప్పబడింది

bhūmir āpo 'nalo vāyuḥ
khaṁ mano buddhir eva ca...
bhinnā me prakṛtir aṣṭadhā
(BG 7.4)

ఈ భౌతిక వ్యక్తులు - శాస్త్రవేత్తలు, వైద్యులు ఇతర ఊహాకల్పన చేయువారు వారు ఈ మూలకాలు, వస్తువులతో పనిచేస్తారు, - భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, మనస్సుతో, మనస్తత్వము, లేదా, కొద్దిగా ఉన్నత స్థానము, తెలివితేటలు, కానీ ఇంక ఎక్కువ కాదు. వారు వారి విశ్వవిద్యాలయంలో, కళాశాలలు, విద్యాసంస్థలలో వ్యవహరిస్తున్నారు. వారు ఈ అంశాలతో పని చేస్తారు. భౌతికమైనవి వారికి ఆధ్యాత్మిక జ్ఞానం లేదు. కృష్ణుడు ఇలా చెప్పాడు... మనము భగవద్గీత నుండి సమాచారాన్ని పొందవచ్చు apareyam: ఈ ఎనిమిది మూలకాలు, అవి అధమ స్థాయిలో ఉన్నాయి. వారు ఈ అధమ స్థాయి ప్రకృతితో వ్యవహరిస్తున్నందున, వారి జ్ఞానం తక్కువగా ఉంటుంది. ఇది వాస్తవము. నేను నిందారోపణం చేయడం లేదు. లేదు ... వారికి సమాచారం లేదు. గొప్ప , గొప్ప ప్రొఫెసర్లు, వారు చెప్తారు అది ఈ శరీరం ముగిసినది శరీరం ముగిసినది అంటే pañcatva-prāpta అని అర్థం. మరొక శరీరం ఉందని వారికి తెలియదు, సూక్ష్మ శరీరం - మనస్సు, బుద్ధి, అహంకారం. వారికి తెలియదు. వారు ఆలోచిస్తున్నారు ఈ భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం అంతే అని... ఇది పూర్తయింది. నేను చూస్తున్నాను, మీరు శరీరాన్ని కాల్చివేసి లేదా శరీరాన్ని పాతిపెట్టి, పూర్తయింది, అంతా ముగిసినది. ఇతర విషయం ఎక్కడుంది? " కనుక వారికి జ్ఞానం లేదు. వారికి సూక్ష్మ శరీరం గురించి జ్ఞానం లేదు, భూమి, నీరు, ఏవైతే ఆత్మ తీసుకుపోతాయో , మరియు వారికి ఆత్మ గురించి ఏం తెలుసు?

అందువల్ల కృష్ణుడు భగవద్గీతలో సమాచారము ఇస్తాడు, apareyam: ఈ అంశాలను, మనస్సు, బుద్ధి, అహంకారం, కూడా bhinnā, అవి, " అవి నా భిన్న ప్రకృతి, వేరే శక్తి. మరియు, "apareyam," ఇది అధమస్థాయి. అక్కడ మరొకటి, ఉన్నత ప్రకృతి ఉంది." Apareyam itas tv viddhi me prakṛtiṁ parā. పరా అంటే "ఉన్నతమైనది." ఇప్పుడు, వారు అడగవచ్చు, "అది ఏమిటి? మనకు ఈ అంశాలు మాత్రమే తెలుసు. ఇంకొకటి, ఉన్నతమైన శక్తి ఏమిటి? " Jīva bhūtaḥ mahā-bāho, స్పష్టంగా చెప్పాడు: "అది జీవిస్తోంది ..." ఈ ఎనిమిది భౌతిక మూలకాలు లేదా ఐదు మూలకాల మినహా ఇతర ఉన్నతమైన శక్తి లేదు అని వారు ఆలోచిస్తున్నారు. అందువల్ల వారు అజ్ఞానంలో ఉన్నారు. ఇది మొదటిసారిగ వారు కొంత జ్ఞానం పొందుతున్నారు, భగవద్గీత యథాతథం ద్వారా, మరియు దాని నుండి ఇంకొకటి, ఉన్నతమైన శక్తి ఉన్నదని వారు తెలుసుకుంటారు, ఎవరు jīva-bhūtaḥ. శరీరాన్ని కదిలించే జీవి, ఇది ఉన్నతమైన శక్తి వారికి ఎటువంటి సమాచారం లేదు, ఆ ఉన్నతమైన శక్తిని అర్థం చేసుకునే ప్రయత్నమూ లేదు వారి విశ్వవిద్యాలయాలలో లేదా సంస్థలలో. అందువల్ల వారు mūḍha, mūḍhas. వారు వారి పరిజ్ఞానంతో చాలా గర్వంగా ఉండవచ్చు, కానీ వేదముల జ్ఞానం ప్రకారం వారు మూర్ఖులు మరియు ఒకవేళ ఎవరైనా అర్థం చేసుకోకపోతే ఉన్నత శక్తిని, prakṛti , ప్రకృతి, అప్పుడు దేవుణ్ణి ఎలా అర్థం చేసుకోగలరు? అది సాధ్యము కాదు. అప్పుడు మళ్ళీ, దేవుడు మరియు ఉన్నత శక్తి మధ్య వ్యవహారాలుంటాయి, అదియే భక్తి. ఇది చాలా కష్టము. Manuṣyāṇāṁ sahasreṣu kaścid yatati siddhaye ( BG 7.3) సిద్ధయే అంటే అర్థం ఉన్నతమైన శక్తిని అర్థం చేసుకోవడం. అది సిద్ధి. ఆ తరువాత, అతను కృష్ణుడిని అర్థం చేసుకోగలడు.

ఇది చాలా కష్టము, ముఖ్యంగా ఈ యుగంలో. Mandāḥ sumanda-matayo ( SB 1.1.10) వారు... మందః అంటే వారికి ఆసక్తి లేదు, లేదా వారు కొద్దిగా ఆసక్తి ఉన్న,వారు. వారు చాలా నెమ్మదిగా ఉన్నవారు. వారు ఇది ఉత్తమ జ్ఞానం అని అర్థం చేసుకోలేరు. మొదట అందరికి ఇది తెలిసి ఉండాలి, అథాతో బ్రహ్మ జిజ్ఞాస, అది ఉన్నత జ్ఞానం. అది అవసరం. కానీ అందరూ నిర్లక్ష్యం చేస్తున్నారు. అక్కడ పనికిమాలిన విచారణ చేయలేదు ఏదైతే ఈ శరీరాన్ని కదిలిస్తున్నదో ఏమిటది? అక్కడ విచరణ లేదు. వారు యాంత్రికంగా ఆలోచిస్తారు, ఈ భౌతికం యొక్క కలయికతో అని... వారు ఇప్పటికీ ఈ అంశంపై కొనసాగుతున్నారు, మీరు సవాలు చేసినప్పుడు, మీరు ఈ రసయనాన్ని తీసుకొని జీవ శక్తిని సిద్ధం చేస్తారా, వారు చెప్పేది, "నేను చేయలేను." మరియు ఇది ఏమిటి? మీరు చేయలేక పోతే, ఎందుకు మీరు అర్ధంలేనివి మట్లాడటం, ఆ "భౌతికము లేదా రసాయనాల కలయిక జీవితాన్ని ఇస్తుందా? మీరు రసాయనాలను తీసుకోవాలి... కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో మన డాక్టర్ స్వరూప దామోదర, ఒక గొప్ప ప్రొఫెసర్ వచ్చారు రసాయన పరిణామంపై ఉపన్యాసము ఇచ్చారు, అతను వెంటనే సవాలు చేసాడు దాన్ని నేను మీకు రసాయనాలను ఇస్తే, మీరు జీవితాన్ని ఉత్పత్తి చేయగలరా? అతను చెప్పాడు,"అది నేను చేయలేను." (నవ్వులు) ఇది వారి పరిస్థితి. వారు నిరూపించలేరు. వారు ఇది చేయలేరు