TE/Prabhupada 0455 - మీరు అనూహ్యమైన విషయలలో మీ నిస్సారమైన తర్కమును ఉపయోగించవద్దు



Lecture on SB 7.9.6 -- Mayapur, February 26, 1977


ప్రద్యుమ్న: అనువాదము - "భగవంతుడు నరసింహ స్వామి చేయి ప్రహ్లాద మహారాజు తలపై తాకడం ద్వారా, ప్రహ్లాదుడు పూర్తిగా సంపూర్ణముగా పవిత్రము చేయబడినట్లుగా, అన్ని భౌతిక కాలుష్యపు కోరికల నుండి పూర్తిగ విముక్తిని పొందాడు. అందువలన ఆయన వెంటనే ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నారు, పారవశ్యం యొక్క అన్ని లక్షణాలు ఆయన శరీరములో వ్యక్తమయ్యాయి. ఆయన హృదయము ప్రేమతో , ఆయన కళ్ళు కన్నీరుతో నిండినవి , అందువలన ఆయన పూర్తిగా తన హృదయాoతరములో భగవంతుడి యొక్క కమల పాదములను సాంతము ఉంచుకోనగలిగాడు. "

ప్రభుపాద: sa tat-kara-sparśa-dhutākhilāśubhaḥ sapady abhivyakta-parātma-darśanaḥ tat-pāda-padmaṁ hṛdi nivṛto dadhau hṛṣyat-tanuḥ klinna-hṛd-aśru-locanaḥ ( SB 7.9.6)

కావున ప్రహ్లాద మహారాజు, tat-kara-sparśa, నరసింహస్వామి యొక్క కమల చేతి స్పర్శ, గోర్లు ఉన్న అదే అరచేయి. Tava kara kamala-vare nakham adbhuta-sṛṅgam. అదే అరచేయి nakha adbhuta... Dalita-hiraṇyakaśipu-tanu-bhṛṅgam. వెంటనే, గోర్లు మాత్రమే ... భగవంతుడికి ఈ భారీ రాక్షసుడిని చంపడానికి ఏ ఆయుధం అవసరము లేదు, కేవలం గోర్లు. Tava kara-kamala. ఉదాహరణ చాలా బాగుంది: కమల. కమల అంటే తామర పువ్వు. భగవంతుడి యొక్క అరచేయి కేవలం కమల పువ్వు వలె ఉంటుంది. అందువలన కమల పువ్వు చాలా మృదువైనది, చాలా మనోహరమైనది, గోర్లు ఎలా వచ్చాయి? అందువలన అద్భుత. Tava kara-kamala, adbhuta. Nakham adbhuta-sṛṅgam కమల పుష్పంలో, కొన్ని భయంకరమైన గోర్లు, గుచ్చుకొనే గోర్లు పెరగడం సాధ్యం కాదు. ఇది విరుద్ధమైనది. కాబట్టి జయదేవుడు అద్భుత అన్నాడు: "ఇది అద్భుతమైనది, ఇది ఆశ్చర్యముగా ఉన్నాది." కావున భగవంతుడి యొక్క శక్తి, శక్తి పదునైన గోర్ల ప్రదర్శన, అవి అన్ని అనూహ్యమైనవి శ్రీ జీవ గోస్వామి వివరించారు, "మీరు అంగీకరించకపోతే, దేవదిదేవుడు యొక్క అనూహ్యమైన శక్తిని, మీకు అవగాహన ఉండదు. " అచింత్య. అచింత్య-శక్తీ. అచింత్య అంటే "అనూహ్యమైనది." మీరు ఏలా జరుగుతుందో ఊహించలేరు, ఎలా కమల పుష్పము లో, అలాoటి గట్టి గోరు లేదు , కాని వెంటనే, క్షణములో, అది హిరణ్యకశిపుని వoటి గొప్ప రాక్షసుడిని చంపేస్తుంది. అందువల్ల అది అచింత్య. మనకు అర్థము కాదు. అచింత్య. అందుచేత వేదముల సూచన అనేది acintyā khalu ye bhāvā na taṁś tarkeṇa yo jayet: మీరు అనూహ్యమైన విషయలలో మీ నిస్సారమైన తర్కమును ఉపయోగించవద్దు. కమల పుష్పం గోర్లను ఎలా పెంచుతుందో ఏ తర్కం లేదు. వారు "పురాణము" అని చెప్పుతారు. ఎందుకంటే వారు వారి నిస్సారమైన మనస్సుతో లోపల అర్థము చేసుకోలేరు , వారు అలాంటివి ఎలా జరుగుతాయో అర్థము చేసుకోలేరు. వారు "పురాణము" అని అంటారు. పురాణము కాదు. ఇది సత్యము. కాని మీకు లేదా మాకు ఇది అనూహ్యమైనది. ఇది సాధ్యం కాదు.

కావున, అదే చేయి ప్రహ్లాద మహారాజు తలపై ఉంచబడింది. Prahlādāhlāda-dāyine. ప్రహ్లాద మహారాజు భావించాడు, ", ఎంత ఆనందకరమైనది ఈ చేయి." భావించటము మాత్రమే కాదు, కాని వెంటనే తన భౌతిక అసంతృప్తి, వేదనలు, అదృశ్యమైనవి. ఇది ఆధ్యాత్మిక స్పర్శ యొక్క పద్ధతి. ఈ యుగములో మనము అదే సౌకర్యం కలిగి ఉన్నాము. ప్రహ్లాద మహారాజు, కమలపు చేతి యొక్క స్పర్శ ద్వారా వెంటనే ఆనందోత్సాహంగా మారినారు అనే కాదు... మనము ప్రహ్లాద మహారాజు లాగానే అదే ప్రయోజనమును పొందవచ్చు. ఇప్పుడు అది సాధ్యమే. కృష్ణుడు advaya-jñāna, ఈ యుగములో కృష్ణుడు ఆయన ధ్వని రూపంలో అవతరించారు: kali yuga nama rūpe kṛṣṇāvatāra ( CC Adi-lila 17.22) ఈ యుగములో ... ఈ యుగములో పతితులైన ఈ వ్యక్తులు, వారు ... వారికి ఏ అర్హత లేదు. Mandāḥ. ప్రతి ఒక్కరూ చెడ్డవారు. ఎవరికీ అర్హత లేదు. వారికి ఆధ్యాత్మిక జ్ఞానం లేదు. పట్టించుకోరు. మీ పాశ్చత్య దేశంలో వారు భౌతిక జ్ఞానంతో చాలా గర్వముగా ఉన్నారు, కాని వారికి ఆధ్యాత్మిక జ్ఞానం లేదు. బహుశా చరిత్రలో, చరిత్రలో మొదటి సారి, వారు ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క కొంత సమాచారమును పొందుతున్నారు.

భక్తులు: జయ.

ప్రభుపాద: లేకపోతే ఆధ్యాత్మిక జ్ఞానం లేదు. వారికి తెలియదు. అది సత్యము