TE/Prabhupada 0463 - మీ మనసుకు కృష్ణుడి గురించి ఆలోచిoచేటట్లు శిక్షణ ఇస్తే, మీరు సురక్షితంగా ఉంటారు

Revision as of 06:16, 25 September 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0463 - in all Languages Category:TE-Quotes - 1977 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on SB 7.9.8 -- Mayapur, February 28, 1977


ప్రద్యుమ్న: అనువాదం - "ప్రహ్లాద మహారాజు ప్రార్థించినారు: నాకు ఇది ఎలా సాధ్యమౌతుంది, అసురుల కుటుంబములో జన్మించిన వాడిని , భగవంతుని సంతృప్తిపరచడానికి సరైన ప్రార్థనలను అర్పించడానికి? ఇప్పటి వరకు, భగవంతుడు బ్రహ్మ సారధ్యములో, సాధువులు అందరూ తమ అద్భుతమైన ప్రవాహాల పలుకుల ద్వారా భగవంతుడిని సంతృప్తి పరచలేదు, అయితే అలాంటి వ్యక్తులు మంచి అర్హతను కలిగి ఉన్నపటికి సత్వ గుణములో ఉన్నా. అప్పుడు నా గురించి ఏమి చెప్పాలి? నేను అర్హత కలిగి లేను. "

ప్రభుపాద:

śrī prahlāda uvāca
brahmādayaḥ sura-gaṇā munaya 'tha siddhāḥ
sattvaikatāna-gatāyo vacasāṁ pravāhaiḥ
nārādhituṁ puru-guṇair adhunāpi pipruḥ
kiṁ toṣṭum arhati sa me harir ugra-jāteḥ
(SB 7.9.8)

కాబట్టి ugra-jāteḥ రాక్షసుల కుటుంబం అని అర్థం, ఉద్వేగము. ఉగ్ర. ఈ భౌతిక ప్రపంచములో మూడు లక్షణాలు ఉన్నాయి. అందువలన ఇది guṇa-mayī. Daivī hy eṣā guṇa-mayī ( BG 7.14) Guṇa-mayī అoటే అర్థం మూడు గుణాలు, మూడు రకాలైన ప్రకృతి స్వభావములు: సత్వ-గుణము, రజో గుణము తమో గుణము. మన మనస్సు ఎప్పుడూ నిలకడగా ఉండదు అందరికీ మనస్సు యొక్క స్వభావం తెలుసు, కొన్నిసార్లు ఒక విషయమును అంగీకరిస్తుంది, మళ్ళీ తిరస్కరిస్తుంది. Saṅkalpa-vikalpa. ఇది మనస్సు యొక్క లక్షణము, లేదా మనస్సు యొక్క స్వభావం. కొన్నిసార్లు మనస్సు సత్వ గుణములో ఉంటుంది, కొన్నిసార్లు రజో గుణములో, కొన్నిసార్లు తమో-గుణములో. ఈ విధముగా మనము వివిధ రకముల మనస్తత్వం పొందుతున్నాము. ఈ విధముగా, మరణ సమయంలో, ఏ మనస్తత్వం ఉంటుందో, ఈ శరీరాన్ని విడిచిపెడుతున్న సమయమున, వేరే శరీరానికి నన్ను తీసుకువెళుతుంది సత్వ-గుణము, రజో గుణము, తమో గుణము. ఇది ఆత్మ వేరే శరీరమునకు వెళ్ళు మార్గము. అందువల్ల మనం మన మనస్సుకు శిక్షణ ఇవ్వాలి మరో శరీరాన్ని పొందే వరకు. అది జీవించే కళ. మీరు మీ మనసును కేవలం కృష్ణుడి గురించి ఆలోచిoచేటట్లు శిక్షణ ఇస్తే, అప్పుడు మీరు సురక్షితంగా ఉంటారు. లేకపోతే ప్రమాదాల అవకాశం ఉంది. Yaṁ yaṁ vāpi smaran bhāvaṁ tyajaty ante kalevaram ( BG 8.6) ఈ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు, మనం మనస్సుకు శిక్షణ ఇవ్వకపోతే, కృష్ణుడి కమలపాదాల వద్ద స్థిరముగా ఉండుటకు,అప్పుడు అక్కడ ... (విరామం) ఒక ప్రత్యేక రకమైన శరీరమును మనము పొందుతాము.

కాబట్టి ప్రహ్లాద మహారాజు, అతడు మానసిక ఊహాగానాల స్థితికి చెందినవాడు కాకపోయిన ... ఆయన నిత్య సిద్ధ. ఆయనకు ఎటువoటి అవకాశము లేదు, ఎందుకంటే ఆయన ఎల్లప్పుడు కృష్ణుడు గురించి ఆలోచిస్తున్నాడు. (బిగ్గరగా విద్యుత్ శబ్దం) (ప్రక్కన అది ఏమిటి? Sa vai manaḥ ... (మళ్లీ శబ్దం) Sa vai manaḥ kṛṣṇa-padāravindayor ( SB 9.4.18) ఈ చాలా సులభమైన విషయమును సాధన చేయండి. కృష్ణుడు ఇక్కడ ఉన్నాడు. మనము ప్రతిరోజూ అర్చామూర్తిని చూస్తాము, కృష్ణుడి యొక్క కమల పాదములను చూస్తాము. ఆ విధముగా మీ మనసును స్థిరముగా ఉంచుకోండి; అప్పుడు మీరు సురక్షితంగా ఉoటారు. చాలా సులభమైన విషయము. అంబరీష మహారాజు, ఆయన కూడా ఒక గొప్ప భక్తుడు. ఆయన రాజు, చాలా బాధ్యత గల వ్యక్తి, రాజకీయాలు. కాని ఆయన ఎలా సాధన చేసాడు అంటే, ఆయన కృష్ణుడి యొక్క కమల పాదాలపై తన మనసును స్థిరముగా ఉంచుకున్నాడు. Sa vai manaḥ kṛṣṇa-padāravindayor vacāṁsi vaikuṇṭha-guṇānuvarṇane. ఈ అభ్యాసం. అర్థం లేనివి మాట్లాడకండి. (మళ్ళీ శబ్దం) (ప్రక్కన:) ఇబ్బంది ఏమిటి? తీసివేయoడి