TE/Prabhupada 0486 - భౌతిక ప్రపంచంలో శక్తి మైథున సుఖము, మరియు ఆధ్యాత్మిక ప్రపంచంలో శక్తి ప్రేమ: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0486 - in all Languages Category:TE-Quotes - 1968 Category:TE-Quotes -...")
 
(Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
 
Line 7: Line 7:
[[Category:TE-Quotes - in USA, Seattle]]
[[Category:TE-Quotes - in USA, Seattle]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0485 - Chaque divertissement de Krishna est digne d’adoration pour le dévot|0485|FR/Prabhupada 0487 - Qu’il s’agisse de la Bible, du Coran ou de la Bhagavad-gita, - Nous devons juger par les fruits|0487}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0485 - కృష్ణుడు ఏ లీల చేసినా భక్తులు దానిని ఉత్సవ రూపంలో జరుపుకుంటారు|0485|TE/Prabhupada 0487 - ఇది బైబిల్ లేదా ఖురాన్ లేదా భగవద్గీత అని పట్టింపు లేదు. మనము ఫలితము ఏమిటో చూడాలి|0487}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 18: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|nkYAOEjF1H4|భౌతిక ప్రపంచంలో శక్తి మైథున సుఖము, మరియు ఆధ్యాత్మిక ప్రపంచంలో శక్తి ప్రేమ  <br/>- Prabhupāda 0486}}
{{youtube_right|HvW9heoPUXA|భౌతిక ప్రపంచంలో శక్తి మైథున సుఖము, మరియు ఆధ్యాత్మిక ప్రపంచంలో శక్తి ప్రేమ  <br/>- Prabhupāda 0486}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 19:37, 8 October 2018



Lecture -- Seattle, October 18, 1968


అతిథి: మనము యోగమాయను ఎలా గుర్తించగలము?

ప్రభుపాద: మీ ప్రశ్న ఏమిటి అని నాకు తెలియదు.

తమలా కృష్ణ: మనం ఎలా తెలుసుకోవచ్చు యోగ మాయను ఎలా గుర్తించగలము అని తెలుసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు.

ప్రభుపాద: యోగమాయ? యోగమాయ అంటే మిమ్మల్ని కలిపేది. యోగ అంటే సంబంధము. మీరు కృష్ణ చైతన్యములో క్రమంగా పురోగతి చెందుతున్నప్పుడు, అది యోగమాయ యొక్క పని మీరు క్రమంగా కృష్ణుడిని మర్చిపోతున్నప్పుడు, ఇది మహామాయ యొక్క పని. మాయ మీ మీద పని చేస్తున్నది. ఒకటి మిమ్మల్ని లాగుతుంది, ఒకటి మిమ్మల్ని వ్యతిరేక మార్గమున నెడుతుంది. యోగమాయ. ఈ, ఉదాహరణ వలె, మీరు ఎల్లప్పుడూ ప్రభుత్వ చట్టాల ఆధీనములో ఉంటారు. మీరు తిరస్కరించలేరు. మీరు చెప్పినట్లయితే, "నేను ప్రభుత్వ చట్టాలను అనుసరించను", అది సాధ్యం కాదు. కాని మీరు ఒక క్రిమినల్ అయినప్పుడు, మీరు పోలీసు చట్టాల పరిధిలో ఉoటారు, మీరు మంచిమనిషిగా ఉన్నప్పుడు, మీరు పౌర చట్టాల పరిధిలో ఉంటారు. చట్టాలు ఉన్నాయి. ఏ పరిస్థితిలో అయినా, మీరు ప్రభుత్వ చట్టాలకు విధేయులై ఉండాలి. మీరు మంచి పౌరుడిగా ఉంటే, మీరు ఎల్లప్పుడూ పౌర చట్టం ద్వారా రక్షించబడతారు. కాని మీరు ప్రభుత్వానికి వ్యతిరేకముగా ఉన్న వెంటనే, క్రిమినల్ చట్టం మీ మీద పని చేస్తుంది. కాబట్టి చట్టం యొక్క క్రిమినల్ కార్యక్రమాలు మహామాయ, త్రివిధ బాధలు, ఎల్లప్పుడూ. ఎల్లప్పుడూ ఏదో ఒక విధమైన కష్టాలలో పెట్టడము. కృష్ణుడి యొక్క పౌర విభాగము, ānandāmbudhi-vardhanam. మీరు కేవలం పెంచుకుంటూ వెళ్లుతారు, నేను చెప్పేది ఏమిటంటే ఆనందం యొక్క సముద్రపు లోతును. Ānandambudhi-vardhanam. ఇదే తేడా, యోగమాయ మరియు మహామాయ. యోగమాయ ... యోగమాయ, వాస్తవ యోగమాయ, కృష్ణుడి యొక్క అంతర్గత శక్తి. అది రాధారాణి. మహామాయ బాహ్య శక్తి, దుర్గ. ఈ దుర్గను గురించి బ్రహ్మ సంహితలో వివరించబడింది, sṛṣṭi-sthiti-pralaya-sādhana-śaktir ekā chāyeva yasya bhuvanāni bibharti durgā (Bs. 5.44). దుర్గ ఈ మొత్తం భౌతిక ప్రపంచం యొక్క పర్యవేక్షణ దేవత. అంతా తన నియంత్రణలోనే ఆమె కిందకు వస్తుoది. ప్రకృతి,ప్రకృతి శక్తి. శక్తి స్త్రీగా అంగీకరించబడుతుంది. ఈ భౌతికవాద వ్యక్తుల వలె, వారు కూడా కొంత శక్తి క్రింద పనిచేస్తున్నారు. ఆ శక్తి ఏమిటి? లైంగిక జీవితం. అంతే. వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు: ", రాత్రికి నేను మైథున జీవితాన్ని కలిగి ఉంటాను." అంతే. అది శక్తి. Yan maithunādi-gṛhamedhi-sukhaṁ hi tuccham ( SB 7.9.45) వారి జీవితం మైథున సుఖము ఆధారంగా ఉంది. అంతే. ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి పని చేస్తున్నారు, మైథున సుఖముతో ముగుస్తుంది. అంతే. ఇది భౌతిక జీవితం. కావున శక్తి. భౌతిక శక్తి అంటే మైథున సుఖము. కాబట్టి అది శక్తి ఫ్యాక్టరీలో పని చేస్తున్న వ్యక్తి, వారు మైథున సుఖమును ఆపివేస్తే, ఆయన పని చేయలేడు. ఆయన లైంగిక జీవితాన్ని ఆస్వాదించ లేకపోయినప్పుడు, ఆయన మత్తుపదార్థాన్ని తీసుకుంటాడు. ఇది భౌతిక జీవితం. కాబట్టి శక్తి అక్కడ ఉండాలి. భౌతిక ప్రపంచంలో ఇక్కడ శక్తి మైథున సుఖము, ఆధ్యాత్మిక ప్రపంచంలో శక్తి ప్రేమ. ఇక్కడ ప్రేమ మైథున సుఖముగా తప్పుగా సూచించబడింది. అది ప్రేమ కాదు; అది కామం. ప్రేమ కృష్ణుడితో మాత్రమే సాధ్యము. ఎవ్వరితో కాదు ఎక్కడ కూడా ప్రేమ సాధ్యము కాదు. ఇది ప్రేమ తప్పుగా సూచించబడింది. అది కామం. ప్రేమ మరియు కామము. ప్రేమ యోగమాయ, కామము మహామాయ. అంతే. అర్థము అయినదా?