TE/Prabhupada 0493 - ఈ సూక్ష్మ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, స్థూల శరీరము పని చేస్తుంది

Revision as of 10:11, 10 April 2018 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0493 - in all Languages Category:TE-Quotes - 1974 Category:TE-Quotes - Le...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 2.14 -- Germany, June 21, 1974


మనం కొంచెం ఆలోచనతో అర్థం చేసుకోవచ్చు, ఈ జీవితంలో కూడా, ఈ శరీరంలో నేను... రాత్రి సమయంలో నేను మరొక శరీరాన్ని పొందుతాను నేను కల కంటాను. పులి ఉందని నేను కల కంటాను. నేను అడవికి వెళ్తాను, పులి ఉంది, నన్ను చంపటానికి అది వస్తుంది. అప్పుడు నేను ఏడుస్తున్నాను, వాస్తవానికి నేను ఏడుస్తున్నాను. లేదా, మరొక విధముగా, నేను ప్రియమైన వ్యక్తి వద్దకు వెళ్లాను, పురుషుడు మరియు స్త్రీ. మేము ఆలింగనం చేస్తున్నాము, కానీ శారీరక కర్మ జరుగుతుంది. లేకపోతే నేను ఎందుకు ఏడుస్తున్నాను? ఎందుకు వీర్యము విడుదల అయ్యింది? కాబట్టి నేను ఈ స్థూల శరీరాన్ని వదిలిపోతున్నానని ప్రజలకు తెలియదు, కానీ నేను సూక్ష్మ శరీరంలోకి ప్రవేశిస్తున్నాను. సూక్ష్మ శరీరం ఉంది, లోపల అన్న ప్రశ్న కాదు. మనము కట్టి వేయబడ్డాము. ఈ శరీరం చొక్కాతో, కోటుతో కట్టివేయబడినట్లుగా, కాబట్టి కోటు స్థూల శరీరము, చొక్కా సూక్ష్మ శరీరము. కాబట్టి ఈ సూక్ష్మ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, స్థూల శరీరము పని చేస్తుంది. మూర్ఖులైన వ్యక్తులు, వారు అర్థం చేసుకోలేరు, నేను కొన్ని శరీరంలో క్లుప్తంగా వున్నాను, సూక్ష్మ శరీరం అయినా స్థూల శరీరం అయినా. చాలా పాప భరితమైన వ్యక్తి, చాలా పాపి, అతడు స్థూల శరీరం పొందలేడు. అతడు సూక్ష్మశరీరం లోనే ఉంటాడు, దాన్ని దెయ్యం అని అంటారు. మీరు విన్నారు. మీలో కొందరు చూసి ఉండవచ్చు. దెయ్యము ఉంది. దెయ్యము అంటే అతడు పొందలేడు. అతడు చాలా పాపాత్ముడు అందువల్ల అతడు సూక్ష్మశరీరంలో ఉండాలని విధింపబడ్డాడు. అతడు స్థూలశరీరం పొందలేడు. అందువలన, వైదిక పద్ధతి ప్రకారం, శ్రాద్ధ సంస్కారం ఉంది. తండ్రి లేదా బంధువు స్థూల శరీరం సంపాదించకపోతే, ఈ సంస్కారం ద్వారా అతడు స్థూల శరీరాన్ని తీసుకొనుటకు అనుమతించబడ్డాడు. అది వైదిక పద్ధతి. అందువలన ఏమైనప్పటికీ, మనము అర్థం చేసుకోగలము "నేను కొన్ని సార్లు ఈ స్థూల శరీరంలో ఉన్నాను, మరియు నేను కొన్ని సార్లు ఈ సూక్ష్మ శరీరంలో ఉన్నాను. కాబట్టి నేను అక్కడ ఉన్నాను, స్థూల శరీరంలో లేదా సూక్ష్మ శరీరంలో. నేను శాశ్వతంగా ఉన్నాను. అనే సూక్ష్మ శరీరంతో పనిచేసేటప్పుడు, నేను స్థూల శరీరాన్ని నేను మర్చిపోతాను. ఈ స్థూల శరీరంతో నేను పని చేస్తే, ఈ సూక్ష్మ శరీరాన్ని నేను మర్చిపోతాను. కాబట్టి నేను స్థూల శరీరం లేదా సూక్ష్మ శరీరాన్ని నేను అంగీకరిస్తాను, నేను శాశ్వతము. నేను శాశ్వతము. ఇప్పుడు సమస్య ఈ స్థూల శరీరాన్ని సూక్ష్మ శరీరాన్ని ఎలా నివారించాలి. అది  సమస్య. మీ నిజ శరీరంలో మీరు ఉండటం అంటే, అర్ధం ఆధ్యాత్మిక శరీరం, ఈ స్థూల లేదా సూక్ష్మ శరీరానికి రాకూడదు. అది మీ శాశ్వతమైన జీవితం. అది.... మనం సాధించవలెను. ఈ మానవ జీవితము ప్రకృతి లేదా భగవంతుని యొక్క బహుమతి. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు మీరు వివిధ పరిస్థితులు, బాధ మరియు ఆనందాలు. ఒక రకమైన స్థూల మరియు సూక్ష్మ శరీరాన్ని అంగీకరించటానికి బలవంత పెడుతున్నాయి. అది మీ బాధలు ఆనందం యొక్క కారణం. మీరు ఈ స్థూల సూక్ష్మ శరీరం నుండి బయటకు వచ్చినట్లయితే, మీ వాస్తవ, ఆధ్యాత్మిక శరీరం, ఉన్నట్లయితే, అప్పుడు మీరు ఈ బాధలు ఆనందాల నుండి స్వేచ్ఛ గా వుంటారు. దీనిని ముక్తి అని పిలుస్తారు. ముక్తి. ఒక సంస్కృత పదం వుంది. ముక్తి అంటే స్వేచ్ఛ, స్థూల శరీరం వుండదు, సూక్ష్మ శరీరం వుండదు. కానీ మీరు మీ స్వంత ఆధ్యాత్మిక శరీరంలో ఉంటారు. దీనిని ముక్తి అని అంటారు. ముక్తి అంటే.... ఇది భాగవతంలో వివరించబడింది. ముక్తిర్ హిత్వా అన్యతా రూపం             స్వ-రూపేన వ్యవస్థితిః. దీనిని ముక్తి అని పిలుస్తారు. అన్యతా రూపం.