TE/Prabhupada 0497 - ప్రతిఒక్కరూ చనిపోకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0497 - in all Languages Category:TE-Quotes - 1972 Category:TE-Quotes -...")
 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 7: Line 7:
[[Category:TE-Quotes - in India, Hyderabad]]
[[Category:TE-Quotes - in India, Hyderabad]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0496 - Sruti signifie que nous écoutons de la plus haute autorité|0496|FR/Prabhupada 0498 - Au moment où je quitte ce corps, c’en est finit de mes grattes-ciel et de mon business|0498}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0496 - శృతి అంటే అత్యధిక ప్రామాణికం నుండి శ్రవణము చేయడము అని అర్థం|0496|TE/Prabhupada 0498 - నేను ఈ శరీరాన్ని విడిచిపెట్టిన వెంటనే,నా ఆకాశహార్మ్యభవనం, కర్తవ్యము సమాప్తమైపోతాయి|0498}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 18: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|61I5vmh0KdY| ప్రతిఒక్కరూ చనిపోకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు  <br />- Prabhupāda 0497}}
{{youtube_right|eutQaWh9f1o| ప్రతిఒక్కరూ చనిపోకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు  <br />- Prabhupāda 0497}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:46, 1 October 2020



Lecture on BG 2.15 -- Hyderabad, November 21, 1972


ఇక్కడ, ఈ భౌతిక ప్రపంచంలో, మనము mṛtatvaలో ఉంచబడుతాము, జన్మ, మరణం, వృద్ధాప్యం వ్యాధి వలన బాధ పడుతున్నాము. కాని జన్మ, మరణం, వృద్ధాప్యం వ్యాధి లేని మరొక స్థితి కూడా ఉంది. కాబట్టి ఇది మనము ఏ స్థితిని కోరుకోవాలి - జననం, మరణం, వృద్ధాప్యం వ్యాధి, లేదా జననం లేని, మరణం లేని, వృద్ధాప్యం లేని, వ్యాధి లేని? దేనిని మనము ఇష్టపడాలి? మనం జన్మ లేని, మరణము లేని, వృద్ధాప్యము లేని, వ్యాధి లేని దానిని ఇష్ట పడవలెను. అందుకే అది amṛtatva అని పిలువబడుతుంది. కాబట్టి amṛtatvāya kalpate. మనం ...మన సొంత, స్వరూప స్థితిలో ఉన్నప్పుడు, మనము జననం, మరణం, వృద్ధాప్యం, వ్యాధికి గురికాము. కృష్ణుడు sac-cid-ānanda-vigraha (Bs 5.1), శాశ్వతమైన, ఆనందకరమైన, పరిజ్ఞానం, అదేవిధముగా, మనము కృష్ణుడిలో భాగంగా ఉన్నాము, మనం కూడా అదే లక్షణము కలిగి ఉన్నాము. ఆ జన్మ, మరణం, వృద్ధాప్యం వ్యాధి ఉండే స్థితిని తీసుకున్నాము, ఈ భౌతిక ప్రపంచంతో మన సహవాసం కారణంగా. ఇప్పుడు, ప్రతి ఒక్కరూ చనిపోకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు, ప్రతిఒక్కరూ ముసలివారు కాకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు ప్రతి ఒక్కరూ మరణిoచకుండా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. ఇది సహజమైనది. ఎందుకంటే, స్వభావము వలన, మనము ఈ విషయాలకు గురికాము, కాబట్టి మన ప్రయత్నం, మన పని, పోరాటాము, మరణము లేకుండా, జన్మ లేకుండా అనారోగ్యం లేకుండా ఎలా ఉండాలి . ఇది జీవితము కోసం పోరాటం.

ఇక్కడ, భగవద్గీతలో, మీకు ఒక మంచి సూత్రము ఇస్తుంది. Yaṁ hi na vyathayanty ete puruṣaṁ puruṣarṣabha. ఆత్మ యొక్క ఈ శరీర మార్పు, ద్వారా బాధింపబడని వారు, dhīras tatra na muhyati ( BG 2.13) ఎవరైతే అర్ధము చేసుకున్నారో ... నా తండ్రి మరణిoచాడు అనుకుందాం నేను స్పష్టంగా అర్థం చేసుకొని ఉంటే నా తండ్రి చనిపోలేదు. ఆయన శరీరం మార్చుకున్నారు. ఆయన మరొక శరీరాన్ని అంగీకరించారు. అది సత్యము.మనము నిద్రిస్తున్న స్థితిలో కలగంటున్న స్థితిలో, నా శరీరం మంచం మీద పడి ఉంది, కాని కలలో నేను మరొక శరీరాన్ని సృష్టించాను వెయ్యి మైళ్ళ దూరంలో వేరే ప్రదేశంలో వెళ్ళి, చెప్పుతాను. మీకు రోజువారీ అనుభవం ఉన్నది, అదేవిధముగా, స్థూల శరీరం నిలిపివేయబడింది, నేను, ఆత్మగా, నేను ఆగను. నేను పని చేస్తాను. నా మనస్సు నన్ను తీసుకు వెళ్ళుతుంది. నా మనసు చురుకుగా ఉంది, నా బుద్ధి చురుకుగా ఉంది. మనస్సు, బుద్ధి, అహంకారముతో తయారు చేయబడిన మరొక సూక్ష్మ శరీరం ఉందని ప్రజలకు తెలియదు. ఇది మరొక స్థూల శరీరానికి నన్ను తీసుకువెళ్ళుతుంది. దీనిని ఆత్మ శరీరమును మార్చడము అని అంటాము.

కాబట్టి ఆత్మ శాశ్వతమైనది, మరణం లేనిది, జన్మ లేనిదీ, ఎప్పుడు తాజాగా ఉంటుంది, nityaḥ śāśvato 'yaṁ purāṇaḥ. Nityaḥ śāśvataḥ ayaṁ purāṇaḥ. పురాణ అంటే చాలా పాతది. మనకు ఎoత వయస్సు ఉన్నదో మనకు తెలియదు, ఎందుకనగా మనము ఒక శరీరము నుండి మరొకదానికి వేరొక శరీరమునకు వెళ్ళుతున్నాము. మనము దీనిని ఎప్పుడు ప్రారంభించినామో మనకు తెలియదు. అందువల్ల, మనము వయసులో చాలా వృద్దులము, కాని, అదే సమయంలో, nityaḥ śāśvato 'yaṁ purāṇaḥ. చాలా పాతది అయినప్పటికీ ... ఉదాహరణకు కృష్ణుడు ఆది పురుషుడు వాస్తవిక వ్యక్తి అయినప్పటికీ, మీరు కృష్ణుడిని ఎల్లప్పుడూ పదహారు నుండి ఇరవై సంవత్సరాల వయస్సుగల యువకుడిగా చూస్తారు. మీరు కృష్ణుడి బొమ్మను వృద్దుడిగా ఎన్నడూ చూడరు. నవ-యవ్వన. కృష్ణుడు ఎల్లప్పుడూ నవ-యవ్వన. Advaitam acyutam anādim ananta-rūpam ādyaṁ purāṇa-puruṣaṁ nava-yauvanam (Bs. 5.33). Ādyam, మొదటి వ్యక్తి, పురాతనమైనవాడు; అదే సమయంలో, అతడు ఎల్లప్పుడూ నవ యవ్వనములో ఉంటారు. Ādyaṁ purāṇa-puruṣaṁ nava-yauvanam. కావున ఎవరికైతే తెలుస్తుందో, ఒక ఆత్మ ఒక శరీరము నుండి వేరొక శరీరమునకు ఎలా వెళ్ళుతుందో, dhīras tatra na muhyati, వివేకము ఉన్న వారు తెలివి ఉన్నవారు, వారు కలవరపడరు.

కృష్ణుడి యొక్క ఉద్దేశ్యం, ఈ అంశాలన్నీటిని అర్జునుడికి ప్రచారము చేయటము ... తన సోదరులందరినీ చంపేస్తూ, ఆయన ఎలా బ్రతికి ఉoడాలో అని చాలా కలవరపడుతున్నాడు. కాబట్టి కృష్ణుడు చెప్పాలనుకుంటున్నాడు, "మీ సోదరులు, మీ తాత, వారు చనిపోరు. వారు కేవలం శరీరమును మార్చుకుంటున్నారు. Vāsāṁsi jīrṇāni yathā vihāya ( BG 2.22) మనము మన దుస్తులను మార్చుకుoటున్నట్లు, అదే విధముగా మన శరీరాలను కూడా ఆ విధముగా మార్చుకుంటాము. విలపించటానికి ఏమీ లేదు. " ఇంకొక ప్రదేశంలో, భగవద్గీతలోచెప్పబడింది, brahma-bhūta ( BG 18.54) బ్రాహ్మణ్ ను అర్థం చేసుకున్నవాడు, ప్రసన్నాత్మ," ఆయన ఎల్లప్పుడూ ఆనందంతో ఉంటాడు. ఆయన ఈ భౌతిక పరిస్థితుల వలన కలవరపడడు. " ఇక్కడ పేర్కొనబడింది: yaṁ hi na vyathayanty ete. ఈ భిన్నమైన పరివర్తన, ప్రకృతి, శరీరం ప్రతిదాని యొక్క వివిధ మార్పులు, ఈ విషయాలు అన్నింటికి కలవరపడకూడదు. ఇవి బాహ్యము . మనము ఆత్మ. బాహ్య శరీరము, లేదా బాహ్య దుస్తులు. అది మారుతుంది. మనం బాగా అర్థం చేసుకుంటే, na vyathayanti, ఈ మార్పుల వల్ల మీరు కలవరపడరు, అప్పుడు saḥ amṛtatvāya kalpate, అప్పుడు ఆయన పురోగతి, ఆధ్యాత్మిక పురోగతి సాధిస్తున్నాడు. అంటే, ఆధ్యాత్మిక పురోగతి అంటే, ఆయన శాశ్వత జీవితము వైపు పురోగతి సాధిస్తున్నాడు. ఆధ్యాత్మిక జీవితం అంటే శాశ్వతమైన, ఆనందకరమైన జ్ఞానం. అది ఆధ్యాత్మిక జీవితం.