TE/Prabhupada 0496 - శృతి అంటే అత్యధిక ప్రామాణికం నుండి శ్రవణము చేయడము అని అర్థం



Lecture on BG 2.14 -- Germany, June 21, 1974


కాబట్టి ఈ కృష్ణ చైతన్య ఉద్యమం పరిపూర్ణంగా ప్రతిదీ తెలుసుకోవడము, అత్యున్నత ప్రామాణికం, కృష్ణుడి నుండి. ఇది పద్ధతి. Tad vijñānārthaṁ sa gurum eva abhigacchet (MU 1.2.12). మన అవగాహనకు మించిన విషయమును అర్థం చేసుకోవడానికి, మీరు అలాంటి ప్రామాణికము దగ్గరకు వెళ్ళాలి ఎవరైతే మీకు భోదిస్తారో. సరిగ్గా అదే విధానము: నా తండ్రి ఎవరు అని తెలుసుకోవడము నా ఆలోచనలకు అతీతముగా, నా కల్పనలకు అతీతముగా ఉంటుంది కానీ నా తల్లి యొక్క ప్రామాణిక ప్రకటనను నేను అంగీకరిస్తే, ఇది పరిపూర్ణ జ్ఞానం. కాబట్టి మూడు రకాలైన పద్ధతులు అర్థం చేసుకోవడానికి ఉన్నాయి లేదా విజ్ఞానములో పురోగమించటానికి ఉన్నాయి. ఒకటి ప్రత్యక్ష అవగాహన ఉంది, pratyakṣa. మరొకటి ప్రామాణికం, మరొకటి శృతి. శృతి అంటే మహోన్నతము నుండి వినడము. కాబట్టి మన పద్ధతి శృతి. శృతి అంటే అత్యధిక ప్రామాణికం నుండి శ్రవణము చేయడము అని అర్థం. ఇది మన పద్ధతి, ఇది చాలా సులభం. అత్యధిక ప్రామాణికం, ఆయన తప్పులు చేయక పోతే ... సాధారణ వ్యక్తులు, వారు తప్పులు చేస్తారు. వారికి అపరిపూర్ణత ఉంది. మొదటి అపరిపూర్ణత: సాధారణ మనిషి, వారు పొరపాటు చేస్తారు. ప్రపంచంలోని ఏ గొప్ప వ్యక్తి అయినా, మీరు చూసినట్లైతే , వారు తప్పులు చేస్తారు. వారు భ్రమకు గురి అవుతారు . వాస్తవము కాకపోయినా వారు ఏదో ఒకదాన్ని వాస్తవముగా అంగీకరిస్తారు. ఉదాహరణకు మనము ఈ శరీరాన్ని వాస్తవము అని అంగీకరించినట్లుగానే. దీనిని భ్రాంతి ఆని అంటారు. కానీ వాస్తవం కాదు. "నేను ఆత్మను." అది సత్యము. కాబట్టి దీనిని భ్రాంతి అంటారు. తరువాత, ఈ మాయా జ్ఞానంతో, అసంపూర్ణమైన జ్ఞానంతో మనము గురువు అవుతాము. అది మరొక మోసం. వారు చెప్తారు ఈ శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు అందరూ, బహుశా, "ఇది కావచ్చు." కాబట్టి మీ జ్ఞానం ఎక్కడ ఉంది? "ఇది కావచ్చు" "బహుశా." మీరు గురువు పదవిని ఎందుకు తీసుకుంటున్నారు? "భవిష్యత్తులో మేము అర్థం చేసుకుంటాము." ఈ భవిష్యత్తు ఏమిటి? మీరు పోస్ట్ డేటెడ్ చెక్ ను అంగీకరిస్తారా? భవిష్యత్తులో నేను కనుగొంటాను, అందువలన నేను శాస్త్రవేత్తని. ఈ శాస్త్రవేత్త ఏమిటి? ఏమైనప్పటికీ, మన ఇంద్రియాల యొక్క అపరిపూర్ణత ఉన్నది. కాంతి ఉన్నందున మనము ఒకరిని ఒకరము చూసుకుంటున్నాము కాంతి లేనట్లైతే, నాకు చూడడానికి శక్తి ఏమిటి? కానీ ఈ మూర్ఖులు వారు ఎల్లప్పుడూ లోపభూయిష్టంగా ఉన్నారని వారు అర్థం చేసుకోలేరు, అయినప్పటికీ, వారు జ్ఞానం యొక్క పుస్తకాలను రాస్తున్నారు. మీ జ్ఞానం ఏమిటి? పరిపూర్ణ వ్యక్తి నుండి జ్ఞానమును మనము తీసుకోవాలి.

కావున కృష్ణుడి నుండి, మహోన్నతమైన వ్యక్తి నుండి, సంపూర్ణమైన వ్యక్తి నుండి జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. ఆయన మీ నొప్పులు మరియు ఆనందమును ఆపాలని మీరు అనుకుంటే ఆయన సలహా ఇస్తున్నాడు, అప్పుడు మీరు ఏదైనా అమరికను చేయండి ఈ భౌతిక శరీరమును అంగీకరించకుండా, ఆయన సలహా ఇస్తున్నాడు, ఈ భౌతిక శరీరమును ఎలా నివారించాలి? ఇది వివరించబడింది. ఇది రెండవ అధ్యాయం. నాలుగవ అధ్యాయంలో కృష్ణుడు ఇలా చెప్పాడు, janma karma me divyaṁ yo jānāti tattvataḥ, tyaktvā dehaṁ punar janma naiti mām eti ( BG 4.9) మీరు కృష్ణుడి కార్యక్రమాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. చరిత్రలో, మహా భారతములో కృష్ణుడి యొక్క ఈ కార్యక్రమాలు ఉన్నాయి. మహా భారతం అనగా గొప్ప భారతదేశం, లేదా గొప్ప భరతదేశము, మహాభారత, చరిత్ర. ఆ చరిత్రలో ఈ భగవద్ గీత కూడా ఉంది. అందువలన ఆయన తన గురించి తాను మాట్లాడుతున్నాడు. మీరు కృష్ణుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది మన కృష్ణచైతన్య ఉద్యమం. కేవలము కృష్ణుడిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించండి. ఆయన కార్యక్రమాలను అతడు నిరాకారము కాదు. Janma karma me divyam.. కర్మ అంటే కార్యక్రమాలు. ఆయనకు కార్యక్రమాలు ఉన్నాయి. ఎందుకు ఆయన ఈ ప్రపంచంలో పాల్గొంటున్నాడు, కార్యక్రమాలలో? ఎందుకు ఆయన వస్తున్నాడు?

yadā yadā hi dharmasya
glānir bhavati bhārata
abhyutthānam adharmasya
tadātmānaṁ sṛjāmy aham
(BG 4.7)

ఆయనకు కొంత ప్రయోజనము ఉంది. ఆయనకు కొంత లక్ష్యము ఉంది కాబట్టి కృష్ణుడిని ఆయన లక్ష్యమును ఆయన కార్యక్రమాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అవి చరిత్ర రూపంలో వివరించబడినవి. కాబట్టి ఇబ్బంది ఎక్కడ ఉంది? మనము చాలా విషయాలు, ఎవరో రాజకీయవేత్తల చరిత్ర, చదువుతాము అదే విషయము, అదే శక్తి, మీరు కృష్ణుని అవగాహన చేసుకోవడము కోసం ప్రయత్నించండి ఇబ్బంది ఎక్కడ ఉంది? అందువల్ల, కృష్ణుడు చాలా కార్యక్రమాలతో తనకు తాను వ్యక్తమవుతాడు.