TE/Prabhupada 0517 - మీరు చాలా గొప్ప కుటుంబంలో జన్మించినందున, మీకు వ్యాధుల రాకుండా ఉంటాయని కాదు

Revision as of 02:03, 27 September 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0517 - in all Languages Category:TE-Quotes - 1968 Category:TE-Quotes -...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 7.1 -- Los Angeles, December 2, 1968


కాబట్టి ఆ యోగా పద్ధతికి జవాబుగా, కృష్ణడు నేరుగా ఇక్కడ మాట్లాడుతున్నాడు: mayy āsakta-manāḥ. మీరు కృష్ణుడి రూపము మీద మీ మనస్సును కేంద్రీకరిస్తే , చాలా అందముగా ... ఆయన రాధారాణి మరియు ఆమె సహచరులతో ఆనందిస్తున్నాడు. అప్పుడు, mayy āsakta-manāḥ pārtha yogam, మీరు ఈ యోగాను సాధన చేస్తే, mad-āśrayaḥ, yuñjan mad-āśrayaḥ... మీరు ఈ యోగాను ఆచరించాలి, అదే సమయంలో, మీరు కృష్ణుడి ఆశ్రయం తీసుకోవాలి. Mad-āśrayaḥ. ఆశ్రయ అంటే "నా రక్షణ క్రింద". దీనిని శరణాగతి అంటారు. మీరు కష్టమైన స్థితిలో ఉన్నప్పుడు మీ స్నేహితుడి దగ్గరకు వెళ్లితే, మీ స్నేహితుడికి శరణాగతి పొందితే, నా ప్రియమైన మిత్రుడా, మీరు ఎంతో గొప్పవారు, చాలా శక్తివంతమైనవారు, చాలా ప్రభావవంతమైనవారు. నేను ఈ గొప్ప ప్రమాదంలో ఉన్నాను. నేను నీకు శరణాగతి పొందుతున్నాను. నాకు రక్షణ ఇవ్వండి ... " కావున మీరు కృష్ణుడికి అది చేయగలరు. ఇక్కడ భౌతిక ప్రపంచంలో, మీరు ఒక వ్యక్తికి శరణాగతి పొందితే, ఆయన ఎంత గొప్పవాడు అయినప్పటికీ, ఆయన తిరస్కరించవచ్చు. ఆయన, "సరే, నేను మీకు రక్షణ ఇవ్వలేను" అని అనవచ్చు. అది సహజ ప్రత్యుత్తరం. మీరు ప్రమాదంలో ఉంటే మీ సన్నిహిత స్నేహితుడి దగ్గరకు వెళ్లినా కూడా, "నాకు రక్షణ ఇవ్వండి" ఆయన, సంకోచిస్తాడు. ఎందుకంటే తన శక్తి చాలా పరిమితం . ఆయన మొట్ట మొదట అనుకుంటాడు "నేను ఈ వ్యక్తికి రక్షణ ఇస్తే, నాకు వచ్చే లాభము పోతుందా? " తన శక్తి పరిమితముగా ఉన్నందున ఆయన అలా ఆలోచిస్తాడు. కాని కృష్ణుడు చాలా మంచివాడు ఆయన చాలా శక్తివంతుడు కూడా, ఆయన చాలా సoపద కలిగిన వాడు ... ఆయన భగవద్గీతలో అందరికి చెప్పుతాడు, sarva-dharmān parityajya mām ekaṁ śaraṇaṁ vraja: ( BG 18.66) మీరు ప్రతిదీ ప్రక్కన వదిలి వేయండి. మీరు కేవలము నాకు శరణాగతి పొందండి ఫలితమేమిటి? దాని ఫలితము ahaṁ tvāṁ sarva-pāpebhyo mokṣayiṣyāmi: నీ పాపపు జీవితపు అన్ని రకముల ప్రతిక్రియల నుండి నేను నిన్ను విడుదల చేస్తాను.

ఈ భౌతిక ప్రపంచం,మన కార్యక్రమాలు అన్నీ పాపములు. చర్య మరియు ప్రతిచర్య ఉంది. మీరు చేస్తున్నది ఏమైనా చర్య మరియు ప్రతిచర్య ఉంది. మంచి ప్రతిస్పందన ఉన్నా కూడా, ఆప్పటికీ అది పాపము. అయినా అది పాపము. వేదముల సాహిత్యం ప్రకారము, పవిత్ర కార్యక్రమాలు, పవిత్ర కార్యక్రమాల ఫలితములు ... Janmaīśvarya-śruta-śrībhiḥ ( SB 1.8.26) మీరు ఈ జీవితంలో పాపములు చేయడము లేదు అని అనుకుందాం, మీరు అన్ని విషయాల్లోనూ ఎంతో పుణ్యము చేశారు. మీరు దానాలు చేశారు, మీరు దయతో ఉంటారు, ప్రతిదీ సరిగ్గా ఉంది. కాని భగవద్గీత అది కర్మ-బంధన అని చెప్పుతుoది. మీరు ఎవరికైనా కొంత దానము ఇస్తే, చెప్పటానికి, కొంత డబ్బును, మీరు ఆ డబ్బు తిరిగి నాలుగు రెట్లు, ఐదు రెట్లు, లేదా పది రెట్లు తిరిగి పొందుతారు, మీ తదుపరి జీవితంలో. అది సత్యము. కాబట్టి వైష్ణవ తత్వము ఇది కూడా పాపం అని చెబుతుంది. ఎందుకు పాపము? ఎందుకంటే మీరు ఆ చక్ర వడ్డీని స్వీకరించటానికి మీరు మరల జన్మ తీసుకోవలసి ఉంటుంది. అది పాపము. ఇప్పుడు మీరు చాలా గొప్ప కుటుంబంలో జన్మించారు అనుకుందాం. తల్లి గర్భంలో ఉండటం ఇబ్బంది, అది ఒకటే ఉంటుoది నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు మీరు పవిత్రమైన వ్యక్తా లేదా అపవిత్రమైన వ్యక్తా. తల్లి యొక్క కడుపులో మీరు పడే ఇబ్బందులు మరియు బాధలు ఒకే విధముగా ఉంటాయి, మీరు నలుపా లేదా తెలుపా, మీరు భారతీయుడా లేదా అమెరికన్ లేదా పిల్లినా లేదా కుక్క లేదా ఏదైనా. Janma-mṛtyu-jarā-vyādhi-duḥkha-doṣānudarśanam ( BG 13.9) జన్మించడము వలన సమస్యలు, మరణిoచడము వలన కష్టాలు, వ్యాధుల వలన కష్టాలు, వృద్ధాప్య సమస్యలన్నీ ప్రతి చోట ఉన్నాయి. మీరు చాలా గొప్ప కుటుంబంలో జన్మించినందున, మీకు వ్యాధుల రాకుండా ఉంటాయని కాదు. మీరు ముసలి వారు అవ్వరు అని కాదు. మీరు జన్మ సమస్యల నుండి రక్షించ బడతారు అని కాదు, లేదా మీరు మరణం యొక్క సమస్యల నుండి రక్షింపబడతారు అని కాదు.

కాబట్టి ఈ విషయాలు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. కాని ప్రజలు చాలా అవివేకులుగా మారారు, వారు పట్టించుకోరు ... మరణం, అది సరే. మరణం. అది రానివ్వండి. జన్మ ... ఇప్పుడు ముఖ్యంగా ఈ రోజుల్లో, పిల్లవాడు తల్లి గర్భంలో ఉంటే, చంపడానికి చాలా పద్ధతిలు ఉన్నాయి. చాలా. ఎందుకు? ఎందుకంటే ప్రజలు చాలా చిక్కులలో ఇరుక్కుంటున్నారు , అలాంటి వ్యక్తి జన్మను కూడా పొందలేడు. తల్లి గర్భంలో ఆయన ఉంచబడతాడు, మరియు ఆయన చంపబడతాడు, మళ్లీ ఆయన మరొక తల్లి గర్భంలో ఉంచబడతాడు, మళ్ళీ ఆయన చంపబడతాడు. ఈ విధముగా, ఆయన వెలుగును కూడా చూడలేడు. మీరు చూడoడి. కాబట్టి తల్లి గర్భంలోకి వెళ్ళితే మళ్ళీ మరణమును అంగీకరించడానికి, వృద్ధాప్యాన్ని స్వీకరించడానికి, వ్యాధిని అంగీకరి౦చడానికి, అది మంచి పని కాదు. మీరు ధనవంతులైతే, మీరు ఈ భౌతిక ఉనికి యొక్క అన్ని సమస్యలను అంగీకరించాలి, లేదా మీరు పేదవారైతే ... ఇది పట్టింపు లేదు. ఈ భౌతిక శరీరంలో ఈ భౌతిక ప్రపంచములోకి ప్రవేశించిన ఎవరైన, ఆయన ఈ సమస్యలన్నీ తీసుకోవాలి. మీరు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల దేశమైన అమెరికన్ అయి ఉండవచ్చు. ఏ వ్యాధి లేదు అని అర్ధం కాదు, ఏ వృద్ధాప్యము లేదు అని కాదు, జన్మ లేదు మరణం లేదు. కాబట్టి తెలివైన వ్యక్తి ఈ సమస్యలకు పరిష్కారము చేస్తాడు. ఆయన తెలివైనవాడు. మీగతా వారు ఎవరైతే అతుకులు వేస్తున్నారో, అతుకులు వేస్తున్నారో భౌతిక జీవితపు సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నారో, వారికి సాధ్యం కానప్పటికీ - ఇది సాధ్యం కాదు