TE/Prabhupada 0522 - మీరు ఈ మంత్రాన్ని నిష్కపటంగాకీర్తించినట్లయితే, ప్రతిదీ స్పష్టమవుతుంది: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0522 - in all Languages Category:TE-Quotes - 1968 Category:TE-Quotes - Le...")
 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 7: Line 7:
[[Category:TE-Quotes - in USA, Los Angeles]]
[[Category:TE-Quotes - in USA, Los Angeles]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0521 - Ma politique est de suivre dans les traces de Rupa Gosvami|0521|FR/Prabhupada 0523 - Avatara veut dire qui descend de sphères supérieures, d’une planète supérieure|0523}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0521 - నా విధానం రూపగోస్వామి అడుగుజాడలను అనుసరించడం|0521|TE/Prabhupada 0523 - అవతార అంటే ఉన్నత లోకము నుండి వచ్చే వారు, ఉన్నత లోకము|0523}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 18: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|7n4leVbLO7w|మీరు ఈ మంత్రాన్ని నిష్కపటంగా  కీర్తించినట్లయితే, ప్రతిదీ స్పష్టమవుతుంది  <br />- Prabhupāda 0522}}
{{youtube_right|jEdRWaRZ210|మీరు ఈ మంత్రాన్ని నిష్కపటంగా  కీర్తించినట్లయితే, ప్రతిదీ స్పష్టమవుతుంది  <br />- Prabhupāda 0522}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 00:01, 2 October 2020



Lecture on BG 7.1 -- Los Angeles, December 2, 1968


ప్రభుపాద: అవును.

విష్ణుజన: చైతన్య మహాప్రభు యొక్క చాలా కథలు ఉన్నాయి, చాలా మంది మూర్ఖులను మార్చినారు. కేవలం ఆయన ఉండటము వలన, వారు హరే కృష్ణ కీర్తన చేశారు. మనం అతని కరుణను ఎలా పొందగలము. మనం మన చుట్టూ ఉన్న ప్రజలకు సహాయము చేయడానికి వారు హరే కృష్ణ కీర్తన చేయడానికి

ప్రభుపాద: మీరు ఈ మంత్రాన్ని నిష్కపటంగా కీర్తించినట్లయితే, ప్రతిదీ స్పష్టమవుతుంది. ఇది శుద్ది చేయు పద్ధతి. మీరు కొన్ని మూర్ఖపు ఆలోచనలు, దుష్ట అనుబంధము కలిగి ఉన్నా, అది పట్టింపు లేదు. కేవలం మీరు కీర్తన చేస్తున్నట్లైతే... మీకు ఆచరణాత్మకంగా తెలుసు, ప్రతిఒక్కరు, ఈ జపించే పద్ధతి అనేది ప్రజలను ఉన్నత స్థానమునకు తీసుకోని రాగల ఏకైక పద్ధతి. కాబట్టి ఇది పద్ధతి, కీర్తన చేయడము మరియు శ్రవణము చేయడము. భగవద్గీత లేదా శ్రీమద్-భాగవతం నుండి ఉపన్యాసాలను వినండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, మరియు జపము చేయండి, మరియు నియమాలు మరియు నిబంధనలను అనుసరించండి. నియమాలు మరియు నిబంధనలు తరువాత. మొదట, మీరు శ్రవణము చేయడానికి మరియు కీర్తన చేయడానికి ప్రయత్నించండి. Śṛṇvatāṁ sva-kathāḥ kṛṣṇaḥ puṇya-śravaṇa-kīrtanaḥ. Puṇya-śravaṇa-kīrtanaḥ ( SB 1.2.17) ఎవరైతే హరే కృష్ణ మంత్రమును వింటాడో, అతను కేవలం వినడం ద్వారా పవిత్రమవుతాడు. ఆయన పవిత్రము అవుతాడు. కాబట్టి ఒక దశలో, ఆయన అంగీకరిస్తాడు. కాని ప్రజలు అనుకుంటారు "ఈ హరే కృష్ణ కీర్తన అంటే ఏమిటి?" మీరు చూడండి నీవు వారికి కొంత నాశిరకమైన, కుండలిని-యోగ ఈ మోసపురితమైనవి ఇచ్చినట్లయితే, వారు చాలా ఆనందపడతారు. మీరు చూడండి? కాబట్టి వారు మోసగింపబడాలని కోరుతున్నారు. కొందరు మోసగాళ్ళు వచ్చి, అవును, మీరు ఈ మంత్రాన్ని తీసుకొని నాకు ముఫ్పై-ఐదు డాలర్లు ఇవ్వండి, మరియు ఆరు నెలల్లో మీరు దేవుడు అవుతారు, మీరు నాలుగు చేతులు కలిగిఉంటారు."(నవ్వు)

కాబట్టి మనము మోసగింపబడాలని కోరుకుంటున్నాము. అంటే, మోసం చేసే పద్ధతి బద్ధ జీవితంలోని అంశాలలో ఒకటి. బద్ధ జీవనంలో నాలుగు లోపాలు ఉన్నాయి. ఒక లోపం మనము పొరపాటు చేస్తున్నాము. మరియు మరొక లోపము మనము ఏదైతే కాదో దాన్ని అంగీకరించడం ఈ విధంగా పొరపాటు చేయడం, ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టం కాదు. మనలో ప్రతి ఒక్కరికి తెలుసు పొరపాట్లు, తప్పులు ఎలా చేస్తున్నామో గొప్ప వ్యక్తులైనా సరే వారు కూడా తప్పులు చేస్తారు. మీరు చూడండి. ఉదాహరణకు చాలా సందర్భాలు ఉన్నాయి రాజకీయాల్లో ఒక చిన్న పొరపాటు లేదా ఒక తప్పు. గొప్ప తప్పు... కాబట్టి పొరపాటు, తప్పు చేయడం మానవ సహజం, తప్పు ఉంది. అదే విధముగా ఏదైనా వాస్తవము కాని దాన్ని వాస్తవముగా అంగీకరించడం. ఇది ఎలా ఉంది? ఉదాహరణకు ప్రతి ఒక్కరూ ఈ బద్ధ జీవితంలో, వారు అనుకుంటున్నారు "ఈ శరీరమే నేను అని" కానీ నేను ఇది కాదు. నేను ఈ శరీరం కాదు. కాబట్టి దీనిని భ్రాంతి, ప్రమాద అని పిలుస్తారు. ఒక ఉత్తమ ఉదాహరణ ఒక తాడును పామువలె అంగీకరించడం. చీకటిలో అక్కడ ఈ విధంగా ఒక తాడు ఉంది అనుకొందాం. మీరు అంటారు "ఓహ్ ఇక్కడ ఒక పాము ఉంది" ఇది భ్రాంతికి ఉత్తమ ఉదాహరణ. ఏదైతే కాదో దాన్ని అంగీకరించడం.

కాబట్టి ఈ లోపము ఉంది ఈ బద్ధ జీవితంలో మరియు పొరపాట్లు తప్పులు చేయుట ఆ లోపం కూడా ఉంది. మరియు మూడవ లోపము మనం మోసం చేయాలనుకొనుట మరియు మనము మోసగింపబడాలనుకొనుట. మనము చాలా నిపుణులము కూడా మనము ఎల్లప్పుడూ ఎవరినన్నా ఎలా మోసం చేయాలి అని ఆలోచిస్తాము. మరియు సహజంగా అతను కూడా నన్ను మోసం చేయాలని ఆలోచిస్తున్నాడు. కాబట్టి మొత్తం బద్ధ జీవితమంతా ఈ సాంగత్యమే మోసగాళ్లు మరియు మోసగింపబడినవారు, అంతే. కాబట్టి ఇది మరొక లోపము. మరియు నాల్గవ లోపము మన ఇంద్రియాలు అసంపూర్ణము. అందువల్ల మనము పొందే జ్ఞానం, అది అసంపూర్ణ జ్ఞానము. ఒక వ్యక్తి కల్పన చేయవచ్చు. కానీ ఆయన తన మనసుతో కల్పన చేస్తాడు. అంతే. కానీ ఆయన మనసు, బుద్ధి అసంపూర్ణము. అయినప్పటికీ ఆయన కల్పన చేస్తాడు, ఆయన ఏదో పనికిమాలినది ఉత్పత్తి చేస్తాడు. అంతే, ఎందుకంటే ఆయన మనస్సు, బుద్ధి అసంపూర్ణము. అది పెద్ద విషయమేమి కాదు, మీరు వెయ్యి సున్నాలను కూడినట్లయితే, అది ఒకటి అవుతుంది. లేదు. అది ఇప్పటికీ సున్నానే. కాబట్టి కల్పనలు చేయు పద్ధతి ద్వారా భగవంతుని అర్థం చేసుకోవాలనుకుంటే, ఇది సున్నా తప్ప ఇంక ఏమి కాదు. అందువలన మన బద్ద జీవితంలో ఈ లోపాలన్నీటితో వాస్తవమైన జీవితానికి రావడం సాధ్యం కాదు. అందువలన మనము కృష్ణుడి వంటి వ్యక్తుల నుండి దీన్ని తీసుకోవాలి. మరియు ఆయన యొక్క ప్రామాణికమైన ప్రతినిధి నుండి తీసుకోవాలి, అదే వాస్తవమైన జ్ఞానము. అప్పుడు మీరు పరిపూర్ణత పొందుతారు