TE/Prabhupada 0550 - ఈ ఎండమావి వెంట పరిగెత్తవద్దు. తిరిగి భగవంతుని దగ్గరకు వెళ్ళండి

Revision as of 23:38, 1 October 2020 by Elad (talk | contribs) (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 2.62-72 -- Los Angeles, December 19, 1968


ప్రభుపాద: ఈ ప్రపంచంలోని కొన్ని అసత్యపు భ్రాంతిని కలిగించే అందము చేత బంధించబడి ఉన్నాము. ఎండమావి. ఖచ్చితమైన ఉదాహరణ ఎండమావి. ఎండమావి అంటే ఏమిటి? ఎడారిలో సూర్యకాంతి ప్రతిబింబం నీరులా కనిపిస్తుంది. అక్కడ నీరు ఎక్కడ ఉంది? నీరు లేదు. జంతువు, దాహముతో ఉన్న జంతువు, ఎండమావి వెంట పడుతుంది. ఓ, ఇక్కడ నీరు ఉంది. నేను సంతృప్తి చెందుతాను. అదేవిధముగా మనం పరిగెడుతున్నాము, ఎండమావి వెంట శాంతి లేదు, ఆనందం లేదు. అందువల్ల మనం మన దృష్టిని భగవంతుని వైపు మళ్ళించవలసి ఉంటుంది. ఈ ఎండమావి వెంట పరిగెత్తవద్దు తిరిగి భగవంతుని వైపుకు, కృష్ణుని దగ్గరకు తిరిగి వెళ్ళండి. అది మన ప్రచారము. మీ దారి మళ్ళించవద్దు... భ్రాంతి కలిగించే భౌతిక అందము నందు మీ ఇంద్రియాలను నిమగ్నం చేయవద్దు. మీ ఇంద్రియాలను కృష్ణునికి , వాస్తవమైన అందము నందు అమలు చేయండి. ఇది కృష్ణ చైతన్యము. కొనసాగించు.

తమాల కృష్ణ: "భగవంతుడు శివుడు ఒకసారి తీవ్రమైన ధ్యానంలో ఉన్నాడు, కానీ అప్పుడు అందమైన కన్య పార్వతి ఇంద్రియ ఆనందం కోసం ఆయనని కలవర పెట్టినది, ఆయన ఆమె ప్రతిపాదనను అంగీకరించారు ఫలితంగా కార్తికేయ జన్మించాడు. "

ప్రభుపాద:, ఇక్కడ కార్తికేయ ఉన్నాడు. (నవ్వు) అవును. హరే కృష్ణ. కొనసాగించు. (నవ్వు)

తమాల కృష్ణ: "హరిదాస్ ఠాకురా భగవంతుడు యొక్క ప్రాథమిక భక్తునిగా ఉన్నప్పుడు ఆయనను మాయదేవి యొక్క అవతారము ప్రలోభపెట్టడానికి ప్రయత్నించినది."

ప్రభుపాద: ఇప్పుడు తేడా ఉంది. భగవంతుడు శివుడు, ఆయన దేవతలందరిలో కల్ల గొప్ప వాడు. ఆయన కూడా పార్వతి చేత ప్రలోభ పెట్టబడినాడు, ఆ ఆకర్షణ ఫలితంగా, ఈ పుత్రుడు కార్తికేయ జన్మించాడు. అది, పిలవబడే, దేవతల యొక్క కుట్ర, ఒక కుమారుడు భగవంతుడు శివుని యొక్క వీర్యము నుండి జన్మించితే తప్ప, రాక్షసులను జయించడము అసాధ్యం. కాబట్టి కార్తికేయ దేవతల నాయకునిగా సేనాపతి గా భావిస్తారు. కానీ ఇక్కడ మరొక ఉదాహరణ. హరిదాస ఠాకురా. హరిదాస ఠాకురా యువకుడు , సుమారుగా ఇరవై, ఇరవై నాలుగు సంవత్సరాల వయస్సు, ఆయన హరే కృష్ణని కీర్తన చేస్తున్నాడు ఆ గ్రామంలో భూస్వామికి, అతను హరిదాసా ఠాకురా అంటే చాలా అసూయపడేవాడు. అతన్ని కలుషితము చేయడానికి ఒక వేశ్యని విన్నియోగించి కుట్ర చేసినాడు. కాబట్టి వేశ్య అంగీకరించింది మధ్య రాత్రి సమయములో చాలా అందమైన దుస్తులతో ఆమె యువతి, హరిదాసా ఠాకురాను ఆకర్షించడానికి ప్రయత్నించింది. కానీ ఆయన ఆకర్షించబడలేదు. అది తేడా. ఒక కృష్ణ చైతన్యము ఉన్న వ్యక్తి, ఒక సాధారణ వ్యక్తి అయినా కూడా, భగవంతుడు శివుడు లేదా భగవంతుడు బ్రహ్మ యొక్క స్థాయిలోనే కాదు, ఆయన ఎప్పుడూ మాయ చేత జయించబడడు. కానీ కృష్ణ చైతన్యములో పూర్తిగా లేకపోయినా, అతడు భగవంతుడు శివుడిని లేదా భగవంతుడు బ్రహ్మ, ఇతరులను గురించి మాట్లాడటం, అంటే ఆయన మాయ ద్వారా జయించబడతాడు. ఇది పరిస్థితి. కొనసాగించు. "హరిదాస ఠాకురా భగవంతుని యొక్క ఒక ప్రాథమిక భక్తునిగా ఉన్నప్పుడు..."

తమాల కృష్ణ: "... ఆయన కూడా అదే విధముగా మాయాదేవి చేత ప్రలోభ పెట్టబడినాడు అదే విధముగా, కానీ హరిదాసా భగవంతుడు కృష్ణుడి పట్ల తన నిష్కారణమైన భక్తి కారణంగా సులభంగా పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. భగవంతుని యొక్క నిజమైన భక్తుడు అన్ని భౌతిక విషయములను ద్వేషించుట నేర్చుకుంటాడు భగవంతుని యొక్క సాంగత్యములో ఆధ్యాత్మిక ఆనందము వలన, తన ఉన్నత రుచి కారణంగా. ఇది విజయము యొక్క రహస్యం.