TE/Prabhupada 0556 - ఈ ఆత్మ సాక్షాత్కారం యొక్క మొదటి అవగాహన, ఆ ఆత్మ శాశ్వతమైనది: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0556 - in all Languages Category:TE-Quotes - 1968 Category:TE-Quotes - Le...")
 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 7: Line 7:
[[Category:TE-Quotes - in USA, Los Angeles]]
[[Category:TE-Quotes - in USA, Los Angeles]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0555 - Endormi pour ce qui est des sujets spirituels|0555|FR/Prabhupada 0557 - Nous devrions avoir une très forte inclinaison pour la conscience de Krishna, comme Haridasa Thakura|0557}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0555 - భౌతిక వ్యక్తులు, వారు ఆధ్యాత్మిక అవగాహన విషయములో నిద్రిస్తున్నారు|0555|TE/Prabhupada 0557 - మనము కృష్ణ చైతన్యము పట్ల చాలా తీవ్రమైన ఆసక్తి కలిగి ఉండాలి. హరిదాస ఠాకురా వలె|0557}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 18: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|nmmhDIt8PBw|ఈ ఆత్మ సాక్షాత్కారం యొక్క మొదటి అవగాహన, ఆ ఆత్మ శాశ్వతమైనది  <br />- Prabhupāda 0556}}
{{youtube_right|pVx8sDrTycU|ఈ ఆత్మ సాక్షాత్కారం యొక్క మొదటి అవగాహన, ఆ ఆత్మ శాశ్వతమైనది  <br />- Prabhupāda 0556}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:37, 1 October 2020



Lecture on BG 2.62-72 -- Los Angeles, December 19, 1968

ప్రభుపాద: భౌతిక వ్యక్తులు భవిష్యత్తు అంటే ఏమిటో వారు అర్థం చేసుకోలేరు. వారు ఈ శరీరమే ప్రతిదీ అని నమ్ముతారు. మనము ఈ శరీరమును కలిగి ఉన్నాము, అది మరణించినప్పుడు, ఇది అంతా పూర్తయింది అని అనుకుంటాము. మనము ఇప్పటికే ఈ ప్రశ్నలను చర్చించాము. కానీ అది వాస్తవము కాదు. ఈ ఆత్మ సాక్షాత్కారం యొక్క మొదటి అవగాహన, ఆ ఆత్మ శాశ్వతమైనది, ఈ శరీరం యొక్క వినాశనం తర్వాత కూడా ఆత్మ నాశనము కాదు. ఇది ఆత్మ సాక్షాత్కారము యొక్క ప్రారంభము. కాబట్టి ఈ ప్రజలు వారు అర్థం చేసుకోలేరు. వారు దానిని పట్టించుకోరు. అది వారి నిద్ర స్థితి. అది వారి దీన స్థితి.చదవడము కొనసాగించు.

తమాలా కృష్ణ: "ఆయన తన ఆత్మ-సాక్షాత్కారపు పనిలో కొనసాగుతుంటాడు భౌతిక కర్మల ప్రతి చర్యల వలన కలవరపడకుండా." 70: "ఎడతెగని కోరికలు ప్రవాహముతో కలవరపడని వ్యక్తి, ఉదాహరణకు మహా సముద్రాలలో నదులు ప్రవేశించే లాగా , మహా సముద్రము ఎప్పుడూ నిండి ఉంటుంది. కానీ ఎల్లప్పుడూ స్థిరముగా ఉంటుంది, అటువంటి వ్యక్తి మాత్రమే ఒంటరిగా శాంతిని సాధిస్తాడు అంతే కాని అలాంటి కోరికలను సంతృప్తి పరచుకునే వ్యక్తి కాదు. "

ప్రభుపాద: ఇప్పుడు, ఇక్కడ... ఒక భౌతిక వ్యక్తి, ఆయన తన కోరికలను కలిగి ఉంటాడు. ఉదాహరణకు ఆయన ఏదైనా వ్యాపారము చేస్తున్నాడని అనుకుందాం, ఆయన డబ్బు పొందుతున్నాడు. కాబట్టి ఆయన భౌతిక పద్ధతిలో తన కోరికను నెరవేర్చుకుంటాడు. కానీ కృష్ణ చైతన్యము కలిగిన వ్యక్తి, ఆయన అదే విధముగా చేస్తున్నాడని అనుకుందాం, ఆయన కృష్ణ చైతన్యము కొరకు ఏదో ప్రణాళిక చేస్తున్నాడు. కాబట్టి ఈ రెండు వేర్వేరు రకపు పనులు ఒకే స్థాయిలో లేవు. చదవడము కొనసాగించు.

తమాల కృష్ణ : 70: "కాదు ఒక వ్యక్తి... 71: "అన్ని ఇంద్రియ కోరికలను త్యజించిన వ్యక్తి, కోరికలు లేకుండా ఉండే వ్యక్తి,తానే యజమాని అనే భావనను విడిచిపెట్టిన వ్యక్తి అహంకారము లేని వాడు, ఆయన మాత్రమే ఒంటరిగా నిజమైన శాంతి సాధించగలడు. "

ప్రభుపాద: అవును. ఇంద్రియ తృప్తి కోసం అన్ని కోరికలను త్యజించిన వ్యక్తి. మన కోరికలను త్యజించ వలసిన అవసరము మనకు లేదు. ఎలా మీరు త్యజించ గలరు? కోరిక జీవి యొక్క స్థిరమైన సహచరి. అది జీవితము యొక్క లక్షణం. నేను, మీరు జీవి కనుక, , మీకు కోరిక ఉంది, నాకు కోరిక ఉంది. ఈ బల్ల కు కాదు. బల్లకు ఎటువంటి ప్రాణము లేదు; కాబట్టి దానికి కోరిక లేదు. బల్ల చెప్ప లేదు నేను ఇక్కడ చాలా నెలల నుండి నిలబడి ఉన్నాను. దయచేసి నన్ను మరొక ప్రదేశమునకు నన్ను మార్చండి. "లేదు . ఎందుకంటే దానికి కోరిక లేదు. కాని నేను మూడు గంటలు ఇక్కడ కూర్చుని ఉంటే, ఓ నేను చెప్పుతాను, ఓ, నేను అలసిపోయాను. దయచేసి నన్ను ఇక్కడ నుండి తీసుకు వెళ్ళండి... దయచేసి మరొక స్థలాన్నికి నన్ను మార్చండి మనము జీవిస్తున్నందువలన మనము కోరికలను కలిగి ఉంటాము. మనము కోరికల వినియోగించే తీరును మార్చుకోవాలి. మనము మన కోరికలను ఇంద్రియ తృప్తి కొరకు ఉపయోగించు కుంటుంటే అది భౌతికము. కానీ కృష్ణుని కొరకు మనము మన కోరికలను ఉపయోగిస్తే, అది మనది, మనము అన్ని కోరికల నుండి విముక్తి పొందుతున్నాము. ఇది ప్రమాణము.

తమాల కృష్ణ: 72: "ఆది మనిషి యొక్క ఆధ్యాత్మికము మరియు దివ్యమైన జీవిన మార్గము, అది పొందిన పిమ్మట ఒక మనిషి కలత నొందడు మరణ సమయములో కూడా ఈ విధముగా ఉన్నప్పుడు , అతడు భగవంతుని రాజ్యములోనికి ప్రవేశించవచ్చు. " భాష్యము: "అతడు వెంటనే కృష్ణ చైతన్యము లేదా దివ్యమైన జీవితాన్ని పొందగలడు , ఒక్క క్షణములోనే, లేదా లక్షలాది జన్మల తర్వాత కూడా అలాంటి స్థితిని అతడు పొందలేడు. "

ప్రభుపాద: అనేక సార్లు ఈ ప్రశ్నను అడిగారు "కృష్ణ చైతన్యవంతుడు అవ్వడానికి ఎంత సమయం పడుతుంది?" అని నేను దానికి కూడా సమాధానం ఇచ్చాను, ఒక క్షణములోనే అవ్వ వచ్చు అని. అదే విషయము వివరించబడింది. చదవడము కొనసాగించండి.