TE/Prabhupada 0557 - మనము కృష్ణ చైతన్యము పట్ల చాలా తీవ్రమైన ఆసక్తి కలిగి ఉండాలి. హరిదాస ఠాకురా వలె

Revision as of 08:58, 25 December 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0557 - in all Languages Category:TE-Quotes - 1968 Category:TE-Quotes - Le...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 2.62-72 -- Los Angeles, December 19, 1968


తమాల కృష్ణ: "అవగాహన మరియు వాస్తవాన్ని అంగీకరించడం మాత్రమే. ఖట్వాంగ మహారాజు ఈ స్థితిని పొందాడు, తన మరణమునకు ముందు కొద్ది నిమిషాలు గడిపాడు కృష్ణుడికి శరణాగతి పొందినాడు . నిర్వాణం అంటే భౌతిక జీవన పద్ధతిని ముగించడం. బుద్ధుని తత్వము ప్రకారం, ఈ భౌతిక జీవితం తర్వాత శూన్యము మాత్రమే ఉంటుంది. కానీ భగవద్గీత భిన్నంగా బోధిస్తుంది. ఈ భౌతిక జీవితాన్ని పూర్తి చేసిన తర్వాత వాస్తవ జీవితం ప్రారంభమవుతుంది. స్థూల భౌతికవాదులకు, ఒక వ్యక్తి తన భౌతిక జీవితాన్ని ముగించుకోవాలి అని తెలుసుకుంటే సరిపోతుంది కానీ ఆధ్యాత్మికంగా పురోభివృద్ధికి చెందిన వ్యక్తులకు, ఈ భౌతిక జీవితము తర్వాత మరొక జీవితం ఉంది. అందువల్ల, ఈ జీవితాన్ని ముగించే ముందు, ఒకరు అదృష్టవశాత్తూ కృష్ణ చైతన్యవంతులైతే, తప్పకుండా ఆయన వెంటనే బ్రహ్మ-నిర్వాణ దశకు వస్తాడు. భగవంతుని రాజ్యం మరియు భగవంతుని యొక్క భక్తియుక్త సేవకు మధ్య తేడా లేదు. రెండూ పరిపూర్ణ దశలో ఉన్నందున, భగవంతుని యొక్క ఆధ్యాత్మిక సేవలో ప్రేమతో నిమగ్నమైనప్పుడు ఆధ్యాత్మికం రాజ్యమునకు వెళ్ళే అవకాశము ఉంది. భౌతిక ప్రపంచంలో ఇంద్రియ తృప్తి యొక్క కార్యక్రమాలు ఉన్నాయి, అయితే ఆధ్యాత్మిక ప్రపంచములో కృష్ణ చైతన్యము యొక్క కార్యక్రమాలు ఉన్నాయి. అందువల్ల ఈ జీవితంలోనే కృష్ణ చైతన్యమును పొందుట అంటే బ్రహ్మణ్ ను తక్షణమే పొందటము, కృష్ణ చైతన్యములో ఉన్నవాడు తప్పకుండా ఇప్పటికే భగవంతుని రాజ్యంలోకి ప్రవేశించాడు. శ్రీ భక్తివినోద ఠాకురా భగవద్గీత యొక్క భగవద్గీత రెండవ అధ్యాయాన్ని సంగ్రహించారు మొత్తం పుస్తకము యొక్క విషయాంశములుగా . భగవద్గీతలో విషయాంశములుగా కర్మ యోగ, జ్ఞాన-యోగ... "

ప్రభుపాద: జ్ఞాన-యోగ.

తమాల కృష్ణ: "... జ్ఞాన -యోగ, భక్తి-యోగ. రెండవ అధ్యాయంలో, కర్మ-యోగా జ్ఞాన-యోగ స్పష్టంగా చర్చించబడ్డాయి, భక్తి-యోగ యొక్క సంగ్రహముగా కూడా ఇవ్వబడింది. ఈ విధముగా భక్తివేదాంత భాష్యములు శ్రీమత్ భగవద్గీత యొక్క రెండవ అధ్యాయపు విషయాంశముల మీద సమాప్తము అయినవి

ప్రభుపాద: ధన్యవాదాలు. ఏమైనా సందేహాలు ఉన్నాయా? చెప్పండి.

తమాల కృష్ణ : నేను ఎల్లప్పుడూ అర్థము చేసుకోలేకున్నాను... ఇక్కడ హరిదాస ఠాకురా వంటి పవిత్రమైన భక్తులు మాయాదేవీ యొక్క ప్రేరేపణలకు బాధితుడు కాదని చెప్పబడినది, కానీ భగవంతుడు బ్రహ్మ, భగవంతుడు శివుడు, కూడా బాధితుడు అవవచ్చు. నేను వారు ఎల్లప్పుడూ వారు భగవంతుని యొక్క పవిత్రమైన భక్తులు అని అనుకున్నాను.

ప్రభుపాద: కాదు వారు పవిత్రమైన భక్తులు, కానీ వారు గుణ అవతారములు. ఉదాహరణకు భగవంతుడు బ్రహ్మ ఈ భౌతిక విశ్వంలో మహోన్నతమైన వ్యక్తి. ఆయన అన్ని జీవుల తండ్రి. కాబట్టి వారు.. వాస్తవానికి, మనము చాలా నిశితంగా అధ్యయనం చేస్తే, హరిదాస ఠాకురా, భక్తియుక్త సేవలో, బ్రహ్మ కంటే గొప్ప స్థానములో ఉన్నారు ఆయన బ్రహ్మ అవతారంగా పరిగణించబడ్డారు , బ్రహ్మ హరిదాస అందువల్ల మనము బ్రహ్మదేవుడిని, శివుడిని చూసినప్పుడు, ఆ విధముగా ఆకర్షింపబడ్డారని మనము కలత చెందకూడదు. ఈ ఉపదేశమును తీసుకోవాలి, బ్రహ్మ, శివుడు అయితే కొన్నిసార్లు మాయ యొక్క బాధితులుగా, మన గురించి ఏమి మాట్లాడాలి?

అందువల్ల మనము చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్రహ్మ శివుడి స్థాయిలో ఉన్న వారు కూడా పడిపోయే అవకాశం ఉంది, సాధారణ వ్యక్తుల గురించి ఏమి మాట్లాడాలి. అందువల్ల మనము కృష్ణ చైతన్యము పట్ల చాలా తీవ్రమైన ఆసక్తి కలిగి ఉండాలి. హరిదాస ఠాకురా వలె అప్పుడు మాయ యొక్క ఆకర్షణను అధిగమించడానికి మనకు చాలా సులభంగా వీలు అవుతుంది. అర్థం చేసుకోవాలి. అంతే కాని బ్రహ్మ చూపించినారు ఆయన బలహీనత అని పిలువ బడే దానిని, ఆయన బలహీనంగా ఉన్నాడు లేదా ఆయన తక్కువగా ఉన్నాడు అని . కాదు. అది మనకు బోధించడానికి.