TE/Prabhupada 0580 - కానీ భగవంతుని అనుమతి లేకుండా మన కోరికలను నేరవేర్చుకోలేము

Revision as of 23:45, 1 October 2020 by Elad (talk | contribs) (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 2.21-22 -- London, August 26, 1973


Sarvasya cāhaṁ hṛdi sanniviṣṭaḥ, "నేను ప్రతి ఒక్కరి హృదయంలో కూర్చుని ఉన్నాను." భగవంతుని కనుగొనండి, కృష్ణుడిని కనుగొనండి. అనేక ప్రదేశాలలో, అన్ని వైదిక సాహిత్యములలో, గుహ్యం. గుహ్యమ్ అంటే హృదయములో ఉంటుంది. Sarvasya cāhaṁ hṛdi sanniviṣṭo mattaḥ smṛtir jñānam apohanaṁ ca ( BG 15.15) మహోన్నతమైన నిర్దేశకుడు, కృష్ణుడు, అక్కడ కూర్చొని ఉన్నాడు ఆయన నిర్దేశము చేస్తున్నాడు, ఇప్పుడు ఈ జీవి ఈ విధముగా తన కోరికను నెరవేర్చాలని కోరుకుంటున్నాడు. ఆయన భౌతిక ప్రకృతికి దిశను ఇస్తున్నాడు. ఇప్పుడు, శరీరమును, ఒక వాహనమును సిద్ధం చేయండి, ఈ మూర్ఖునికి ఈ విధముగా, . ఆయన ఆనందించాలని కోరుకుంటున్నాడు. సరే, ఆయనని ఆనందించనివ్వండి. "ఇది జరుగుతోంది. మనము అందరము మూర్ఖులము, మనము జీవితములో విభిన్న మార్గాలను తయారు చేస్తున్నాము. నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరు ఆలోచిస్తున్నారు. మీరు ఆలోచిస్తున్న వెంటనే... కానీ భగవంతుని అనుమతి లేకుండా మన కోరికలను నేరవేర్చుకోలేము అది సాధ్యం కాదు. కానీ మనము కొనసాగిస్తున్నందున, "నేను ఈ విధముగా నా కోరికను నెరవేర్చుకోవాలని కోరుకుంటున్నాను" కృష్ణుడు అనుమతిస్తున్నాడు, "సరే." ఒక పిల్ల వాడు ఏదో కావాలని కోరుకున్నట్లుగా ఉంటుంది. తండ్రి ఇస్తాడు, "సరే, అది తీసుకో." మనం పొందుతున్న ఈ శరీరములన్నీ, భగవంతుడు యొక్క అనుమతి వలన, కానీ ఆయన "ఈ మూర్ఖుడు ఇలాంటిది ఎందుకు ఇష్టపడుతున్నాడు?" అని అయిష్టతతో అనుమతిస్తున్నాడు. ఇది మన పరిస్థితి. అందువల్ల, చివరికి కృష్ణుడు చెప్పినాడు , sarva-dharmān parityajya, ( BG 18.66) ఈ మూర్ఖత్వాన్ని వదిలేయండి, 'నాకు ఈ శరీరము కావాలి, నాకు ఆ శరీరము కావాలి, నేను ఈ విధముగా జీవించాలనుకుంటున్నాను' - ఈ చెత్త అంతటిని వదిలేయండి. "

ఇక్కడ వేదముల సాహిత్యాలలో మనము భగవంతుడు మరియు జీవిని ఇద్దరిని కనుగొంటాము వారు హృదయములో ఉన్నారు. జీవి, కోరుతూన్నాడు, యజమాని అనుమతిస్తున్నాడు, ప్రకృతి లేదా భౌతిక ప్రకృతి శరీరాన్ని ఇస్తుంది ఇక్కడ శరీరం, సిద్ధంగా ఉంది, అయ్యా ఇక్కడకు రండి. కాబట్టి మన చిక్కుకొనుటకు లేదా విముక్తికి వాస్తవ కారణం మన కోరిక. మనము కోరుకుంటున్నాము కనుక. మీరు కోరుకుంటే, మీరు జన్మ, మరణం, వృద్ధాప్యం వ్యాధి యొక్క ఈ చిక్కుల నుండి స్వేచ్ఛ పొందాలనుకుంటే, అది సిద్ధంగా ఉంది. మీరు ఈ చిక్కులలోనే కొనసాగాలనుకుంటే, శరీరం యొక్క మార్పు, vāsāṁsi jīrṇāni... ఎందుకంటే మీరు ఈ భౌతిక శరీరంలో ఆధ్యాత్మిక జీవితాన్ని అనందించ లేరు మీరు ఈ భౌతిక ప్రపంచమును ఈ భౌతిక శరీరముతో ఆస్వాదించవచ్చు. మీరు ఆధ్యాత్మిక జీవితాన్ని ఆస్వాదించాలని కోరుకుంటే, అప్పుడు మీరు ఆధ్యాత్మిక శరీరంలో ఆనందించాలి. కానీ మనకు ఆధ్యాత్మిక జీవితము గురించి సమాచారము లేకపోవటము వలన, ఆధ్యాత్మిక ఆనందము, ఈ ప్రపంచాన్ని ఆస్వాదించాలని మనము కోరుకుంటున్నాము. Punaḥ punaś carvita-carvaṇānām ( SB 7.5.30) నమలినదే నమలడం. అదే మైథున సుఖము, అదే పురుషుడు మరియు అదే స్త్రీ, వారు ఇంట్లో ఆనందిస్తున్నారు. మళ్ళీ మళ్ళీ నగ్న నృత్యమునకు వెళ్ళడము. కోరిక అదే, మైథున సుఖము, ఇక్కడ లేదా అక్కడ. కానీ వారు ఆలోచిస్తున్నారు, "నేను థియేటర్ లేదా నగ్న నృత్యమునకు వెళ్ళితే, అది చాలా ఆనందదాయకంగా ఉంటుంది." కాబట్టి దీనిని నమిలినదే నమలడము అని అంటారు, punaś carvita-carvaṇānām ( SB 7.5.30) అని పిలుస్తారు. ఇంట్లో అదే మైథునజీవితం, నమలడం, నగ్న క్లబ్ కు వెళ్ళడము, నమలడము నమిలినదే నమలడం. అక్కడ రసం లేదు. ఎటువంటి హాస్యం లేదు, మాధుర్యము లేదు; అందుచే వారు నిరాశ చెందుతున్నారు. ఎందుకంటే విషయము అదే. మీరు ఒక చెరుకుని నమిలి రసమును బయటకు తీస్తారు, మళ్ళీ మీరు నమిలితే , అప్పుడు మీరు ఏమి పొందుతారు? కానీ వారు చాలా మంద బుద్ధి గల వారు, కాబట్టి మూర్ఖులు, వారికి తెలియదు. వారు అప్పటికే రుచి చూసిన ఆనందాన్ని నేను చెప్పేదేమిటంటే అప్పటికే ఆనందించిన ఆనందము కొరకు ప్రయత్నిస్తున్నారు. Punaḥ punaś carvita-carvaṇānām ( SB 7.5.30) Adānta-gobhir viśatāṁ tamisraṁ punaḥ punaś carvita-carvaṇānām. ఒక మానవుడు... మీరు కనుగొంటారు కుక్కలు, అవి మైథునజీవితం కలిగి ఉన్నప్పుడు, వాటికీ ఏ సిగ్గు లేదు. అందువల్ల, కామము కలిగిన అనేక మంది అక్కడ నిలబడి చూస్తారు. చూస్తూ వారు సంకల్పము చేస్తారు, "నేను ఈ విధముగా వీధిలో ఆస్వాదించగలిగితే." కొన్నిసార్లు వారు చేస్తారు. ఇది జరుగుతోంది. Punaḥ punaś carvita-carvaṇānām ( SB 7.5.30)