TE/Prabhupada 0581 - మీరు కృష్ణుడి సేవలో వినియోగించబడినట్లయితే, మీరు కొత్త కొత్త ప్రోత్సాహం పొందుతారు

Revision as of 11:21, 15 December 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0581 - in all Languages Category:TE-Quotes - 1973 Category:TE-Quotes - Le...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 2.21-22 -- London, August 26, 1973


Yan maithunādi gṛhamedhi sukhaṁ hi tuccham ( SB 7.9.45) కాబట్టి ఈ భౌతిక జీవితం అంటే లైంగిక జీవితం అని అర్థం. చాలా, చాలా అసహ్యకరమైన, నీచము. ఎవరయినా దీనిని అర్థం చేసుకుంటే, అతడు విముక్తి పొందుతాడు.  కానీ ఒకవేళ, ఎవరైనా ఇంకా ఆకర్షించబడినప్పుడు, విముక్తిలో ఇంకా ఆలస్యం ఉందని అర్ధం చేసుకోవాలి. ఎవరైనా అర్ధం చేసుకొని విడిచి పెట్టినట్లయితే ఈ శరీరంలో కూడా అతడు విముక్తి పొందుతాడు. ఆయన jīvan-muktaḥ sa ucyate అని పిలువబడతాడు.

īhā yasya harer dāsye
karmaṇā manasā girā
nikhilāsv apy avasthāsu
jīvan-muktaḥ sa ucyate

కాబట్టి మనము ఈ కోరిక నుండి ఎలా విముక్తి పొందవచ్చు? Īhā yasya harer dāsye, కృష్ణునికి సేవ చేయాలని అని కోరుకుంటే మీరు బయటపడవచ్చు. లేకపోతే, కాదు. అది సాధ్యం కాదు. మీరు భగవంతుని సేవ తప్ప మరేదైనా కోరుకుంటే, అప్పుడు మాయ మీకు ప్రేరణ ఇస్తుంది, "ఇది ఎందుకు ఆనందించకూడదు? అందువల్ల యమునాచార్య అంటారు,

yad-avadhi mama cetaḥ kṛṣṇa-padāravinde nava-nava-rasa-dhāmany udyataṁ rantum āsīt tad-avadhi bata nārī-saṅgame smaryamāne bhavati mukha-vikāraḥ suṣṭhu niṣṭhīvanaṁ ca Yad-avadhi,

ఆ సమయము నుండి mama cetaḥ, నేను నా జీవితము ఆత్మను వినియోగించాను; నా చైతన్యము, కృష్ణుడు యొక్క పాదపద్మముల సేవలో....." ఈ శ్లోకము యమునాచార్యునిచే ఇవ్వబడింది. ఆయన ఒక గొప్ప రాజు, రాజులు, వారు సాధారణంగా లైంగిక కోరిక కలిగి ఉంటారు కానీ ఆయన తరువాత ఒక సాథు భక్తుడు అయ్యారు. తన వ్యక్తిగత అనుభవం, ఆయన అంటున్నారు నేను కృష్ణుని యొక్క పాద పద్మముల సేవలో నా మనస్సును నిమగ్నము చేసినప్పటి నుండి,

yad-avadhi mama cetaḥ kṛṣṇa-padāravinde..." Nava-nava. ఇంకా సేవ, ఆధ్యాత్మిక సేవ అంటే ప్రతిక్షణం కొత్తగా అని అర్థం. ఇది అర్ధరహితమైనది కాదు. ఎవరైతే ఆధ్యాత్మిక సాక్షాత్కారాన్ని పొంది ఉంటారో, వారు కృష్ణుడికి సేవ చేయడానికి చూస్తారు. కొత్త జ్ఞానోదయం, కొత్త జ్ఞానోదయం. Nava-nava-rasa-dhāmany udyataṁ rantum āsīt. ఇక్కడ, ఈ భౌతిక ప్రపంచంలో మీరు ఆనందిస్తారు, అది అరిగిపోతుంది. Punaḥ punaś carvita; కాబట్టి మీరు నిరాశ చెందుతారు. కానీ మీరు కృష్ణుడి సేవలో వినియోగించబడినట్లయితే, మీరు కొత్త కొత్త ప్రోత్సాహం పొందుతారు. అది ఆధ్యాత్మికత అంటే. మీరు దానిని అర్థరహితం అని తెలుసుకున్నట్లయితే, మీరు తప్పక తెలుసుకోవాలి. మీరు ఆధ్యాత్మికంగా సేవించటం లేదు, మీరు భౌతికంగా సేవిస్తున్నారు.  మర్యాద. ఒకే మాదిరిగా. మీరు కొత్త కొత్త అనుభూతి అనుభవించినట్లయితే అప్పుడు మీరు ఆధ్యాత్మికంగా సేవ చేస్తున్నారని తెలుసుకోవచ్చు. ఇది పరీక్ష. మీ ఉత్సాహం పెరుగుతుంది, తగ్గదు.