TE/Prabhupada 0604 - కానీ నేను కొనసాగిస్తే, కృష్ణుడు నన్ను ఆధ్యాత్మిక వేదికపై ఉంచుతాడు: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0604 - in all Languages Category:TE-Quotes - 1969 Category:TE-Quotes - Le...")
 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 7: Line 7:
[[Category:TE-Quotes - in USA, New Vrndavana]]
[[Category:TE-Quotes - in USA, New Vrndavana]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0603 - Ce mrdanga se rendra de maison en maison, de pays en pays|0603|FR/Prabhupada 0605 - Accroissez votre amour pour Vasudeva et vous ne risquerez pas de reprendre un corps matériel|0605}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0603 - కానీ ఈ మృదంగము ఇంటి నుండి ఇంటికి ప్రతి ఇంటికి వెళ్ళుతుంది|0603|TE/Prabhupada 0605 - వాసుదేవుడిని ప్రేమించండి అప్పుడు భౌతిక శరీరముతో సంబంధమునకు ఇంక ఏ అవకాశము లేదు|0605}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 18: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|D7EQwhIegZw|కానీ నేను కొనసాగిస్తే, కృష్ణుడు నన్ను ఆధ్యాత్మిక వేదికపై ఉంచుతాడు  <br/>- Prabhupāda 0604}}
{{youtube_right|AUecK73RtRA|కానీ నేను కొనసాగిస్తే, కృష్ణుడు నన్ను ఆధ్యాత్మిక వేదికపై ఉంచుతాడు  <br/>- Prabhupāda 0604}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:37, 1 October 2020



Vanisource:Lecture on SB 1.5.11 -- New Vrindaban, June 10, 1969


నివృత్త అంటే ఇప్పటికే పూర్తయింది, పూర్తిగా పూర్తయింది. ఏది పూర్తి అయింది? తృష్ణ. తృష్ణ అంటే ఆరాటము అని అర్థం. తన భౌతిక అరాటములను పూర్తి చేసుకున్నవ్యక్తి, వారు ఈ ఆధ్యాత్మిక పొగడటమును స్తుతించగలరు. మన సంకీర్తన ఉద్యమంలో వలె, మీరు చాలా ఆనందం, ఆనందం పొందుతున్నారు. ఇతరులు ఇలా చెబుతారు, "ఈ ప్రజలు ఏమి చేస్తున్నారు? పిచ్చి వారు, వారు పారవశ్యముతో, కొన్ని డ్రమ్ములను కొడుతూ, నృత్యము చేస్తున్నారు. " భౌతిక ఆనందం కోసం వారి కాంక్ష పూర్తి కానందున వారు అలా భావిస్తారు. అందువలన నివృత్త.

వాస్తవానికి, ఈ కృష్ణుడి పేరు, లేదా భగవంతుడి ఆధ్యాత్మిక పేరు, విముక్తి పొందినప్పుడు కీర్తన, జపము చేయవచ్చు. కాబట్టి మనం చెప్తాము, జపము చేసేటప్పుడు మూడు దశలు ఉన్నాయి. అపరాధ స్థితి, ముక్త స్థితి, వాస్తవమునకు భగవంతుని పై ప్రేమ కలిగిన స్థితి ఇది జపము చేయడము వలన పరిపూర్ణ దశ. ప్రారంభంలో మనము అపరాధ దశలో జపము చేస్తాము - పది రకాల అపరాధాలు. అంటే మనము జపము చేయకూడదు అని అర్థం కాదు. అపరాధాలు చేస్తున్న కూడా , మనము జపము చేస్తూ ఉండాలి. ఆ జపము నన్ను అన్ని అపరాధాల నుండి బయటకు రావడానికి నాకు సహాయం చేస్తుంది. అయితే మనము అపరాధాలు చేయకుండా ఉండుటకు మనము జాగ్రత్త తీసుకోవాలి. అందువల్ల ఈ పది రకాల అపరాధాలకు సంబంధించిన జాబితా ఇవ్వబడింది. మనము నివారించేందుకు ప్రయత్నించాలి. అది అపరాధాలు లేకుండా జపము చేస్తున్నప్పుడు, అప్పుడు అది విముక్తి దశ అంటారు. ఇది విముక్తి దశ. విముక్తి దశ తరువాత, జపము చేయడము చాలా ఆనందంగా ఉంటుంది, ఎందుకంటే అది ఆధ్యాత్మిక దశలో ఉంది, కృష్ణుని మరియు భగవంతుని మీద వాస్తవమైన ప్రేమను రుచి చూస్తారు కానీ అదే విషయము... జపము... అపరాధ దశలో, జపము చేయడము, మరియు విముక్తి పొందిన దశలో జపము చేయుట... కానీ పరిపక్వ దశలో... రూపగోస్వామి లాగే, అతడు ఇలా చెప్పేవాడు ఒక నాలుకతో నేను ఏమి జపము చేస్తాను రెండు చెవులతో నేను ఏమి వినగలుగుతాను? నేను కోట్లాది చెవులను కలిగి ఉంటే, నేను కోట్లాది నాలుకలను కలిగి ఉంటే, అప్పుడు నేను జపము చేయగలను మరియు వినగలను. " ఎందుకంటే వారు విముక్తి దశలో ఉన్నారు.

కానీ ఆ ఉద్దేశ్యంతో మనం దిగులుపడకూడదు. మనము పట్టుదలతో కొనసాగించాలి. ఉత్సాహాద్ ధైర్యాత్. ఉత్సాహాత్ అంటే ఉత్సాహంతో ధైర్యాత్ , ధైర్యాత్ అంటే పట్టుదల, సహనం. ఉత్సాహాత్ . నిశ్చయత్. నిశ్చయత్ అంటే ధృడమైన పట్టుదల అవును, నేను జపము చేయడము ప్రారంభించాను. బహుశా అపరాధాలు ఉండవచ్చు, కానీ నేను కొనసాగిస్తే, కృష్ణుడు నన్ను ఆధ్యాత్మిక వేదికపై ఉంచుతాడు అప్పుడు నేను హరే కృష్ణ జపము చేయడమును రుచి చూస్తాను. " విశ్వనాథ చక్రవర్తి వలె, పండిన దశలో మరియు పండని దశలో ఉన్న మామిడి పండు ఉదాహరణ ఇచ్చారు. పండని దశ, అది చేదుగా ఉంటుంది, కానీ అదే మామిడి, ఇది పూర్తిగా పక్వత ఉన్నప్పుడు, ఇది తీపి, తీయ్యగా ఉంటుంది. మనము ఈ దశ కోసం ఎదురుచూడవలసి వుంటుంది, మనము జాగ్రత్తగా ఉండాలి మనము అపరాధాలు చేయకుండా ఉండటానికి అప్పుడు, మనము తప్పనిసరిగా వస్తాము. ఒక రోగి రోగి లాగానే, వైద్యుడు ఇచ్చిన నిబంధనలను అనుసరిస్తే, ఔషధం తీసుకుంటే, అప్పుడు తప్పని సరిగా ఆయనకు నయమవుతుంది