TE/Prabhupada 0613 - మనము ఆరు విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి

Revision as of 09:34, 19 October 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0613 - in all Languages Category:TE-Quotes - 1968 Category:TE-Quotes - Le...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 2.13-17 -- Los Angeles, November 29, 1968


నందరాణి: గృహస్థులైన స్త్రీలు కృష్ణ చైతన్యంలో తమ పిల్లలను పెంచడము, ఇది కృష్ణుడికి పరోక్ష సేవ. వారు నేరుగా నేరుగా ఆయనను సేవించడానికి ప్రయత్నించాలా, మీకు తెలుసు, బహుశా ఆలయంలో వంట చేయడం లేదా ఉంటూ, మీకు తెలుసా, ఈ విధంగా, నేరుగా, లేదా పిల్లలు పెంచడం మరియు కేవలం గృహస్థ ధర్మం కలిగి, తగినంత సేవ చేయడం? తగినంత సేవ చేయడం ఉందా?

ప్రభుపాద: అవును, విషయం ఏంటంటే మనము కృష్ణ చైతన్యంలో ఉండాలి. కేవలం విద్యుద్దీకరణ వలె. ఒక తీగను విద్యుత్తుకు తాకించడము ద్వారా, మరొకటి చేరిస్తే, మరొకటి, మరొక తీగ, తాకడం ఉంటే, వాస్తవంగా, అప్పుడు విద్యుత్ ప్రతిచోటా ఉంటుంది. అదేవిధముగా మన కృష్ణ చైతన్యము సరిగా అనుసంధానించబడితే, అప్పుడు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అన్న ప్రశ్నే లేదు. ఎందుకంటే సంపూర్ణ ప్రపంచంలో ఎలాంటి తేడా లేదు. ఇది ప్రత్యక్ష సంబంధంతో తాకిబడిన వెంటనే... ఇది గురు శిష్య పరంపర అని పిలువబడుతుంది. ఎందుకంటే, ఈ సంబంధము ఒకరి నుంచి ఒకరికి, క్రిందకు వస్తోంది, కాబట్టి మనము ఇక్కడ తాకితే, అదే విధముగా అనుసంధానించబడిన ఆధ్యాత్మిక గురువు, అప్పుడు విద్యుత్ సంబంధము ఉంది. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అన్న ప్రశ్నే ఏదీ లేదు. Evaṁ paramparā-prāptam imaṁ rājarṣayo viduḥ ( BG 4.2) మనము కేవలం సంబంధము డిస్కనెక్ట్ చేయబడిందో లేదో చూడాలి. సంబంధము ఉంటే, గట్టిగా, అప్పుడు విద్యుత్ తప్పకుండా వస్తుంది. కాబట్టి మన బద్ధ దశలో చాలా అనుమానాలు వుంటాయి. చాలా చిక్కులు వుంటాయి. కానీ నేను మీకు ఇచ్చిన ఉదాహరణ లాగానే, వెంటనే ఫలితాన్ని స్వీకరించడానికి చాలా ఆతురతగా ఉండ వద్దు. కేవలం మనము అనుసరించాల్సి ఉంటుంది. మనము అనుసరించాల్సి ఉంటుంది. Tat-tat-karma-pravartanāt (Upadeśāmṛta 3). ఇది రూప గోస్వామిచే సూచించబడింది. మనము ఆరు విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి కృష్ణ చైతన్యములో సంపూర్ణంగా ఉండటానికి ఆరు విషయాలను మనం నివారించాలి.

కాబట్టి ఉత్సాహాద్ ధైర్యాన్ నిశ్చయాత్ (Upadeśāmṛta 3). మొదటి సూత్రం చాలా ఉత్సాహంగా ఉండాలి. అతను తప్పక విశ్వాసించాలి కృష్ణుడు చెప్పాడు అది, న మే భక్తా ప్రణశ్యతి, నా భక్తుడు ఎన్నటికీ పతనము అవ్వడు. కాబట్టి "నేను కృష్ణుని భక్తుడిగా హృదయపూర్వకంగా మారుతాను. నేను కృష్ణుని భక్తుడిగా హృదయపూర్వకంగా మారాలి. "ఇది ఉత్సాహం అని పిలువబడుతుంది. తర్వాత ధైర్యం. "నేను కృష్ణుడి భక్తుడిని అయ్యాను, కానీ నేను సంతోషంగా లేను. అది ఎందుకు జరుగుతుంది?" అందువల్ల మీరు ఓర్పుతో ఉండాలి. ఉత్సాహంగా ఉండాలి, మీరు తప్పక ఓర్పుతో కూడా ఉండాలి. నిశ్చయాత్ అంటే మీరు నమ్మకంగా ఉండాలి అని అర్థం. ఓహో...కృష్ణుడు చెప్పాడు అది, తన భక్తుడు ఎన్నటికీ పతనము అవ్వడు, కనుక నేను ఎన్నటికీ పతనము అవ్వను నేను ఇప్పుడు అనుభూతి చెందనప్పటికీ. నేను సేవను చేస్తాను" Utsāhād dhairyān niścayāt tat-tat-karma-pravartanāt. కానీ మీకు ఇవ్వబడిన విధముగా మీరు మీ విధులను నిర్వర్తించాలి. సతో వృత్తేః మీరు చేయకూడదు... ఏ కపటం ఉండకూడదు. సతో వృత్తేః అంటే సరళముగా వ్యవహరించడము, నేరుగా వ్యవహరించడం. సతో వృత్తేః, సాధు-సంగే, భక్తుల సాంగత్యంలో. కనుక ఒకరు తప్పనిసరిగా ఉత్సాహభరితంగా ఉండాలి, తప్పనిసరిగా ఓర్పుతో ఉండాలి, తప్పనిసరిగా నమ్మకంతో ఉండాలి, భక్తుడు తప్పనిసరిగా విధులు నిర్వర్తించాలి, భక్తుడు తప్పనిసరిగా భక్తుల సాంగత్యములో ఉండాలి, భక్తుడు వ్యవహరించడంలో చాలా నిజాయితీగా ఉండాలి. ఆరు విషయాలు. ఈ ఆరు పనులు ఉంటే, పరిపూర్ణంగా విజయము సిద్ధిస్తుంది