TE/Prabhupada 0636 - జ్ఞానవంతులైనవారు, వారు ఏ విధమైన వ్యత్యాసాన్ని చూడరు అది ఆత్మను కలిగి లేదు

Revision as of 23:37, 1 October 2020 by Elad (talk | contribs) (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 2.30 -- London, August 31, 1973


అందువలన, ఈ శరీరము, అయితే, అదే మూలం నుండి వస్తున్న పదార్థము అయినప్పటికీ, ఇప్పటికీ అధమముగా ఉంటుంది. కాబట్టి దేహి, లేదా ఆత్మ, స్వభావం వలన భౌతిక ప్రకృతి కన్నా గొప్పది అయినప్పటికీ, కానీ అయినప్పటికీ, ఆయన భౌతిక ప్రకృతి లోపల బంధించబడటము వలన, ఆయన కృష్ణుని మర్చిపోయాడు. ఇది పద్ధతి. కానీ, ఇక్కడ చెప్పినట్లుగా, దేహే సర్వస్య, సర్వస్య దేహే, అదే స్పూర్తి ఉంది. కాబట్టి, దుష్టులు మూర్ఖులు కాని వారు, తెలివైనవారు పూర్తి జ్ఞానం కలిగి ఉన్నవారు, వారు ఒక మానవుడు లేదా ఒక జంతువు మధ్య వ్యత్యాసం చూడరు. పండితాః సమ-దర్శినః. ఆయన పండితుడు కనుక, ఆయనకు జ్ఞానము ఉంది , ఆయనకు ఆత్మ ఉంది అని తెలుసు. విద్యా-వినయ-సంపన్నే బ్రాహ్మణే ( BG 5.18) మొదటి తరగతి జ్ఞానవంతులైన బ్రాహ్మణునిలో, ఆత్మ, అదే లక్షణము గల ఆత్మ ఉంది. విద్యా-వినయ-సంపన్నే బ్రాహ్మణే గవి, ఆవులో, హస్తినే, ఏనుగులో, శుని - శుని అంటే కుక్క - చండాల, మానవులలో అత్యల్పుడైన, ప్రతి చోటా ఆత్మ ఉంది. అంతే కాని మానవునికి మాత్రమే ఆత్మ ఉంది లేదా ఉన్నతమైన దేవతలలో ఆత్మ ఉంది అని కాదు, నిస్సహాయమైన జంతువులు ఆత్మను కలిగి లేవు. కాదు, ప్రతి ఒక్కరికి ఉంది... దేహే సర్వస్య భారత.. కాబట్టి ఎవరిని మనము అంగీకరించాలి? కృష్ణుడి యొక్క లేదా ఎవరో మూర్ఖపు తత్వవేత్త యొక్క లేదా ఎవరో మతమును పాటించువాడు అని పిలవబడే వానినా? ఎవరిని మనము అంగీకరించాలి? కృష్ణుడు, మహోన్నతమైన ప్రామాణికుడు, మహోన్నతమైన వ్యక్తిని మనము అంగీకరించాలి. ఆయన సర్వస్య అని చెప్పారు. చాలా ప్రదేశాలలో, కృష్ణుడు చెప్తారు. అందువల్ల, జ్ఞానవంతులైనవారు, వారు ఏ విధమైన వ్యత్యాసాన్ని చూడరు అది ఆత్మను కలిగి లేదు అని. అందరూ ఆత్మను కలిగి ఉన్నారు. తస్మాత్ సర్వాని భూతాని. మరలా, ఆయన చెప్పాడు, సర్వాని భూతాని. న త్వం శోచితుమర్హసి. ఇది మీ కర్తవ్యము. ఆత్మ అనేది శాశ్వతమైనదని, అది చంపబడదు అనే అంశంపై మాత్రమే కృష్ణుడు కేవలం ప్రాధాన్యత ఇస్తున్నాడు. చాలా విధాలుగా శరీరం నశ్వరము అవుతుంది. కాబట్టి ఇప్పుడు పోరాడటము నీ బాధ్యత. శరీరం చంపబడదు, శరీరం నాశనం కావచ్చు. కానీ na hanyate hanyamāne śarīre ( BG 2.20) కానీ ఈ శరీరాన్ని నాశనం చేసిన తరువాత, ఆత్మ యొక్క ఉనికి ఉంటుంది. ఆయన ఇంకొక శరీరాన్ని పొందుతాడు, అంతే "Deha, tathā dehāntara-prāptiḥ ( BG 2.13) దేహాంతర - ప్రాప్తిః. మీరు మరొక శరీరాన్ని పొందాలి. ఇది తరువాతి శ్లోకము లో కూడా వివరించబడుతుంది.

యుద్ధంలో పాల్గొంటున్న ఒక క్షత్రియుడు, ధర్మపరమైన పోరాటంలో... పోరాటం ధర్మపరమైనదిగా ఉండాలి. కారణం సరైనదిగా ఉండాలి. అప్పుడు పోరాటం సరియైనది. కాబట్టి ధర్మపరమైన పోరాటంలో క్షత్రియుడు చంపినందున, ఆయన బాధ్యత వహించనవసరము లేదు, ఆయన పాపం చేసినట్లు కాదు. అది చెప్పబడింది. ఉదాహరణకు ఒక బ్రాహ్మణుని వలె. ఆయన యజ్ఞములో... ఆయన యజ్ఞములో కొన్ని జంతువులను బలి ఇస్తాడు. అంటే ఆయన చంపుతున్నాడు అని కాదు. అదేవిధముగా క్షత్రియుడు ఆయన చంపినప్పుడు, ఆయన పాపం చేయడము లేదు. ఇది తరువాతి శ్లోకము లో వివరించబడుతుంది. "కాబట్టి ఇది మీ బాధ్యత." నీవు నీ బంధువులను లేదా నీ తాతను చంపుతునట్లు భయపడవద్దు. నా నుండి తీసుకో, హామీని, దేహి, అవధ్య, నీవు చంపలేవు, ఆయన శాశ్వతమైనవాడు. " ఇప్పుడు, దేహే సర్వస్య భారత ఇది ముఖ్యమైన విషయము మీరు గమనించాలి, ప్రతి జీవి శరీరం ఆత్మ యొక్క స్థితి మీద పెరిగింది. శరీరం చాలా పెద్దది లేదా చాలా చిన్నది కావచ్చు, అది పట్టింపు లేదు. కానీ... కాబట్టి పదార్థము ఆత్మ యొక్క స్థితి మీద ఉత్పత్తి చేయబడుతుంది లేదా పెరుగుతుంది. ఒక ఆత్మ లేదా జీవ శక్తి పదార్థాల కలయికతో ఉనికిలోకి వస్తుంది అని కాదు. ఇది శాస్త్రీయ అంశం. పదార్థము ఆత్మపై ఆధారపడి ఉంటుంది. అందువలన, ఇది అధమస్థాయిలో ఉంది. Yayedaṁ dhāryate jagat. ధారయతే, ఇది మోస్తుంది. ఆత్మ ఉంది; అందువలన, అతి గొప్ప విశ్వం ఆత్మ మీద ఆధారపడి ఉంది. మహోన్నతమైన ఆత్మ కృష్ణుడు, లేదా చిన్న ఆత్మ. రెండు రకాలైన ఆత్మలు ఉన్నాయి. ఆత్మ మరియు పరమాత్మా. ఈశ్వర లేదా పరమేశ్వర