TE/Prabhupada 0635 - ఆత్మ ప్రతి జీవిలోనూ ఉంటుంది చీమ లోపల కూడా
Lecture on BG 2.30 -- London, August 31, 1973
భక్తుడు: అనువాదం: " ఓ భరత వంశీయుడా, దేహమందు ఉంటున్న దేహి శాశ్వతము మరియు ఎన్నటికీ చంపబడడు, కావున నీవు ఏ జీవి కోసం దుఃఖించనవసరం లేదు."
ప్రభుపాద : Dehī nityam avadhyo 'yaṁ dehe sarvasya bhārata. దేహి అంటే శరీరం అని అర్థం, శరీరం లోపల . ఈ విషయం, ప్రారంభమైంది, dehino 'smin yathā dehe kaumāraṁ yauvanaṁ jarā ( BG 2.13) దేహ, దేహి. దేహి అంటే శరీరం కలిగి ఉన్నవాడు. ఉదాహరణకు guṇī. Āsthate prata లో.(?) వ్యాకరణం . గుణ, లో, దేహ, లో, లో, prata. (?) దేహిన్ శబ్ద. కాబట్టి దేహిన్ శబ్ద యొక్క ప్రథమా విభక్తి దేహి . దేహి నిత్యం , శాశ్వతమైన. చాలా విధాలుగా, కృష్ణుడు వివరించాడు. నిత్యం, శాశ్వతమైన. నాశనం చేయలేని, మార్పులేని. ఇది జన్మించడము లేదు, ఇది చనిపోవడం లేదు, ఇది ఎల్లప్పుడూ, ఎల్లప్పుడూ ఒకే రకముగా ఉంటుంది. Na hanyate hanyamāne śarīre ( BG 2.20) ఈ విధముగా, మళ్ళీ ఆయన నిత్యం, నిత్యమైనదని చెప్పారు. అవధ్యా, ఎవరూ చంపలేరు. శరీరంలో, ఆయన ఉన్నాడు. కాని దేహి సర్వస్య భారత. ఇది చాలా ముఖ్యం. కేవలం మానవ శరీరంలో ఆత్మ ఉంటుంది ఇతర శరీరాల్లో ఉండదు. అది కాదు. అది మూర్ఖత్వం. సర్వస్య. ప్రతి శరీరంలో. చీమ లోపల కూడా, ఏనుగు లోపల కూడా, అతి పెద్ద మర్రి చెట్టు లోపల కూడా లేదా సూక్ష్మజీవి లోపల. సర్వస్య. ఆత్మ అక్కడ ఉంది. కాని కొందరు మూర్ఖులు, వారు జంతువులు ఏ ఆత్మ కలిగిలేవని చెప్తారు. ఇది తప్పు. ఏ జంతువు అయినా ఆత్మ కలిగిలేదని మీరు ఎలా చెప్తారు? ప్రతి ఒక్కరూ. ఇక్కడ కృష్ణుడి ప్రామాణిక ప్రకటన: సర్వస్య. ఇంకొక చోట, కృష్ణుడు చెప్తాడు, sarva-yoniṣu kaunteya sambhavanti mūrtayaḥ yāḥ: ( BG 14.4) అన్ని జాతులలో, ఎన్ని రూపాలు ఉన్నాయో, 84,00,000 విభిన్న జీవన రూపాలు, tāsāṁ mahad yonir brahma. Mahad yonir. వాటి శరీరం యొక్క మూలం ఈ భౌతిక ప్రకృతి. Ahaṁ bīja-pradaḥ pitā: నేను విత్తనం ఇచ్చు తండ్రిని. తండ్రి తల్లి లేకుండా ఏ సంతానం లేదు, కాబట్టి తండ్రి కృష్ణుడు తల్లి భౌతిక ప్రకృతి, లేదా ఆధ్యాత్మిక ప్రకృతి.
రెండు ప్రకృతులు ఉన్నాయి. ఇది ఏడవ అధ్యాయంలో వివరించబడింది. భౌతిక ప్రకృతి ఆధ్యాత్మిక ప్రకృతి. లేదా ఉన్నత ప్రకృతి లేదా న్యూన ప్రకృతి. మన శరీరంలో వలె తక్కువస్థాయి భాగాలు ఉన్నతస్థాయి భాగాలు ఉన్నాయి. శరీరం ఒకటే. కాని అయినప్పటికీ అవి శరీరం యొక్క వేర్వేరు భాగాలు. వాటిలో కొన్నిటిని తక్కువస్థాయిగా పరిగణిస్తారు వాటిలో కొన్నిటిని ఉన్నతమైనవిగా భావిస్తారు. రెండు చేతులు కూడా. వేదముల నాగరికత ప్రకారం, కుడి చేయి ఉన్నతమైన స్థాయి కలిగిన చేయి, ఎడమ చేయి తక్కువ స్థాయి, లక్షణము గల చేయి. మీరు ఎవరికైనా ఏమైనా ఇవ్వాలని కోరుకునప్పుడు, మీరు దానిని కుడి చేయితో ఇవ్వాలి. మీరు ఎడమ చేయితో ఇస్తే, అది అవమానకరమైనది. రెండు చేతులు అవసరం. ఎందుకు ఈ చేయి ఉన్నతమైనది, ఈ చేయి...? కాబట్టి మనము వేదముల ఉత్తర్వును అంగీకరించాలి. అయితే రెండు ప్రకృతులు, ఆధ్యాత్మిక ప్రకృతి మరియు భౌతిక ప్రకృతి రెండూ ఒకే మూలం నుండి వస్తున్నప్పటికీ, పరమ సత్యము... Janmādy asya yataḥ ( SB 1.1.1) అంతా ఆయన నుండి వెలువడుతున్నది. అయినప్పటికీ, అక్కడ తక్కువస్థాయి ప్రకృతి మరియు ఉన్నతస్థాయి ప్రకృతి ఉంది. తక్కువస్థాయి మరియు ఉన్నతస్థాయి మధ్య వ్యత్యాసం ఏమిటి? తక్కువస్థాయి స్వభావం లేదా భౌతిక ప్రకృతిలో, భగవంతుని చైతన్యము దాదాపు లేదు. సత్వ గుణములో ఉన్నవారు, వారికి కొంచము భగవంతుని చైతన్యము ఉంటుంది. రజో గుణములో ఉన్నవారికి, వారికి మరింత తక్కువ స్థాయిలో ఉంటుంది; తమో గుణములో ఉన్నవారికి, భగవంతుని చైతన్యము లేదు. పూర్తిగా లేదు. వేరు వేరు స్థాయిలు