TE/Prabhupada 0646 - యోగ పద్ధతి అంటే మీరు ఇంద్రియ తృప్తిలో అన్ని పనికిమాలిన పనులు చేస్తుండటము కాదు

Revision as of 07:02, 17 October 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0646 - in all Languages Category:TE-Quotes - 1969 Category:TE-Quotes - Le...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 6.2-5 -- Los Angeles, February 14, 1969



ప్రభుపాద: ఎవరు చదువుతున్నారు?

భక్తుడు: శ్లోకము సంఖ్య రెండు. సన్యాసము అని పిలవబడేది యోగతో సమానమనియు, లేదా దేవదిదేవునితో కలవటము అని, ఎవరునూ యోగి కాలేరు ఆయన ఇంద్రియలను తృప్తిపరుచుకోవాలనే కోరికను వదలివేస్తే తప్ప ( BG 6.2) "

ప్రభుపాద: ఇక్కడ యోగాభ్యాసం విషయము ఉంది. యోగ అంటే కూడిక. ఇప్పుడు మన బద్ధ స్థితి లో, మనము భగవంతుని భాగము మరియు అంశ అయినప్పటికీ, కానీ మనము ఇప్పుడు వేరు అయ్యాము. ఇదే ఉదాహరణ. ఈ వేలు మీ శరీరం యొక్క భాగం, కానీ వేరు చేయబడితే, అది కత్తిరించబడితే, దానికి విలువ ఉండదు. కానీ ఎంత కాలము అది ఈ శరీరముతో కలసి ఉంటుందో, అప్పుడు దాని విలువ లక్షల డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ. ఏ వ్యాధి వచ్చినా మీరు నయం చేసుకోవడానికి పెద్ద మొత్తం ఖర్చు చేస్తారు. అదేవిధముగా మనం... ప్రస్తుత క్షణము, భౌతిక జీవితము యొక్క బద్ద స్థితిలో, మనము భగవంతుని నుండి వేరు చేయబడ్డాము. కాబట్టి మనము భగవంతుని గురించి మాట్లాడటానికి చాలా అయిష్టంగా ఉన్నాము, భగవంతుని అర్థం చేసుకోవడానికి, ఆయనతో మనకున్న సంబంధాన్ని. ఇది కేవలం సమయం వృధా అని మనము భావిస్తున్నాము. ఈ సమావేశంలో, ప్రతి ఒక్కరికి తెలుసు, ఈ గుడి, కృష్ణ చైతన్యము గుడి అని, భగవంతుడి గురించి మాట్లాడుతారు అని. లేదా ఏ చర్చిలో అయినా. ప్రజలకు అసలు ఆసక్తి ఉండదు. వారు ఒక రకమైన, ఏమంటారు దానిని, వినోదం, ఆధ్యాత్మిక పురోగతి పేరుతో, లేకుంటే అది కేవలం సమయం వృధా. కొంత డబ్బును సంపాదించడానికి ఈ సమయము ఉపయోగించుకోవటము మంచిది. లేదా ఒక క్లబ్ లో లేదా ఒక రెస్టారెంట్ లో ఆనందించటము, ఇంద్రియ తృప్తి

కాబట్టి భగవంతుడి మీద శ్రద్ధ లేకపోవడము అంటే ఇంద్రియ తృప్తి అని అర్థము. ఎవరైతే ఇంద్రియ తృప్తికి బానిసలు అవుతారో, వారు యోగ పద్ధతికి అర్హులు కాదు. యోగ పద్ధతి అంటే మీరు ఇంద్రియ తృప్తిలో అన్ని పనికిమాలిన పనులు చేస్తుండటము కాదు మరియు కేవలం ధ్యానములో కూర్చుని ఉండటము. ఇది కేవలం పెద్ద మోసము. దీనికి అర్థం లేదు. యోగ పద్ధతి మొదట ఇంద్రియాలను నియంత్రించడం, యమ, నియమ. యోగ సాధన యొక్క ఎనిమిది వేర్వేరు దశలు ఉన్నాయి. యమ, నియమ, ఆసన, ధ్యానం, ధారణ, ప్రాణాయామ, ప్రత్యాహార, సమాధి. కాబట్టి మొదట ఈ అధ్యాయంలో మనము మాట్లాడుతాము, యోగ పద్ధతి అంటే ఏమిటో భగవంతుడు కృష్ణుడు మీకు బోధిస్తాడు. అందువలన ప్రారంభంలో కృష్ణుడు ఎవరూ యోగిగా మారలేడని చెప్తాడు, ఆయన ఇంద్రియ తృప్తి కోరికను త్యజించకపోతే. ఎవరైనా ఇంద్రియ తృప్తి చేసుకుంటూ ఉంటే, ఆయన ఒక పనికి మాలిన వాడు. ఆయన ఒక యోగి కాదు. ఆయన ఒక యోగి కాలేడు. యోగ పద్ధతి ఖచ్చితముగా బ్రహ్మచర్యము, మైథునజీవితం లేకుండా. అంటే యోగ పద్ధతి. మైథున జీవితంలో పాల్గొనే వారు ఎవరు అయినా అతడు యోగి కాలేడు యోగులు అని పిలువ బడే వారు మీ దేశానికి వచ్చి, అవును, మీకు ఇష్టము వచ్చినది ఏమైనా చేయవచ్చు మీరు ధ్యానం చేయండి, నేను మీకు కొన్ని మంత్రాలను ఇస్తాను. "ఇవి అన్ని పనికి మాలినవి ఇక్కడ ఈ ప్రామాణిక ప్రకటన ఉన్నది, ఎవరూ ఒక యోగి కాలేరు ఆయన ఇంద్రియ తృప్తి కోరికను వదలివేస్తే తప్ప. ఇది మొదటి షరతు. కొనసాగించు.

భక్తుడు: సంఖ్య మూడు. "ఎనిమిది రకములు కలిగిన యోగ పద్ధతిలో ఒక ప్రాథమిక భక్తుడికి, పనియే మార్గము అని చెప్పబడింది. ఇప్పటికే యోగ సాధించిన వ్యక్తికి, అన్ని భౌతిక విషయాలను వదలివేయడమే మార్గము అని చెప్పబడింది. " ( BG 6.3)

ప్రభుపాద: అవును. రెండు దశలు ఉన్నాయి. ఒకరు పరిపూర్ణ స్థితికు చేరుకోవడానికి యోగను అభ్యసిస్తున్న వ్యక్తి, మరియు రెండో వారు పరిపూర్ణ స్థితిను సాధించిన వ్యక్తి. కావున, ఎంత కాలము ఒక పరిపూర్ణ స్థితిలో లేమో, కేవలం ప్రయత్నిస్తున్నాము, ఆ సమయంలో చాలా పనులు ఉన్నాయి. ఆ ఆసన పద్ధతి, యమ, నియమ... సాధారణంగా మీ దేశంలో చాలా యోగ సంఘాలు ఉన్నాయి. వారు ఈ ఆసన పద్ధతిని నేర్పుతారు. వివిధ భంగిమలలో కూర్చోవడం ఎలా. అది సహాయము చేస్తుంది. కానీ వాస్తవమైన వేదికకు రావడానికి అది పద్ధతి మాత్రమే. అవి కేవలం మార్గము మాత్రమే అని అర్థం. వాస్తవ యోగ పద్ధతి పరిపూర్ణత శరీర వ్యాయమ పద్ధతి నుండి భిన్నంగా ఉంటుంది. రెండు దశలు ఉన్నాయి. ఒక స్థితి పరిపూర్ణ స్థితిను చేరుకోవడానికి ప్రయత్నిస్తున్న స్థితి, మరొక స్థితి ఎవరైతే పరిపూర్ణ స్థితిని చేరుకున్నారో అట్టి స్థితి.