TE/Prabhupada 0670 - మీరు కృష్ణుడి మీద మనస్సును స్థిరముగా ఉంచితే, అప్పుడు భౌతిక కదలిక ఉండదు

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


Lecture on BG 6.16-24 -- Los Angeles, February 17, 1969


భక్తుడు: శ్లోకము సంఖ్య పంతొమ్మిది: "గాలి లేని ప్రదేశంలో ఒక దీపం వెలుగదు... ( BG 6.19) "

ప్రభుపాద: ఇక్కడ ఉదాహరణ, చూడండి.

భక్తుడు: "... కాబట్టి భక్తుడు, ఎవరి మనస్సు నియంత్రించబడాలో, అతడు ఎల్లప్పుడూ భగవంతుని మీద ధ్యానంలో స్థిరంగా ఉంటాడు."

ప్రభుపాద: ఈ గదిలో, ఎటువంటి గాలి కదలడం లేనందున, దీపమును చూడండి, జ్వాల నిలకడగా ఉంటుంది. అదేవిధముగా, ఉంటే... మీ మనస్సు యొక్క జ్వాల ఈ మంట వలె స్థిరంగా ఉంటుంది, మీరు మనస్సును కృష్ణ చైతన్యములో నిమగ్నము చేసి ఉంటే. అప్పుడు మీ... మీ జ్వాల కదలకుండా ఉన్నట్లు, మీ మనస్సు ఆందోళన చెందదు. అది యోగా యొక్క పరిపూర్ణము.

భక్తుడు: 20 నుండి 23 శ్లోకములు: "పరిపూర్ణ దశను ట్రాన్స్ లేదా సమాధి అని పిలుస్తారు, యోగా యొక్క అభ్యాసం ద్వారా భౌతిక మానసిక కార్యక్రమాల నుండి ఒక వ్యక్తి యొక్క మనస్సు పూర్తిగా నిరోధించబడును ( BG 6.20) "

ప్రభుపాద: సమాధి అంటే అర్థం, సమాధి అంటే... శూన్యము చేయటం కాదు, అది అసాధ్యం. Kleśo 'dhikaratas teṣām avyaktāsakta-cetasām. ఎవరో ఒక యోగి చెప్తారు నీవు నీకుగా ఆపు. నీవు కదలకుండా ఉండు. నేను కదలకుండా ఉండటము ఎలా సాధ్యమవుతుంది? నేను కదులుతున్న ఆత్మను, ఇది సాధ్యం కాదు. కదలకుండా ఉండటము అంటే, మీరు కృష్ణుడి మీద మనస్సును స్థిరముగా ఉంచితే, అప్పుడు భౌతిక కదలిక ఉండదు. ఇది కదలిక లేకపోవడము అంటే ఈ భౌతిక ప్రవృత్తులు మిమ్మల్ని ఇక ఏ మాత్రము కలత కలిగించవు. దీనిని కదలిక లేకపోవడము, అయితే కృష్ణుని కార్యక్రమాలకు మీ కదలిక పెరుగుతుంది. మరింత మీరు మీ కదలికను లేదా కార్యక్రమాలను కృష్ణ చైతన్యములో పెంచుకుంటూ ఉంటే , మీరు భౌతిక కార్యక్రమాలలో సహజముగా కదలిక లేకుండా ఉంటారు. అది పద్ధతి. కానీ మీరు కదలకుండా ఉంటే, అదే ఉదాహరణ - ఒక పిల్లవాడు, పిల్లవాడు ఏడుస్తున్నాడు. మీరు పిల్లవాడిని ఏడవకుండా చేయలేరు. మీరు అతనికి ఏదో, ఆట వస్తువులు, కొన్ని మంచి చిత్రాలు ఇవ్వండి. ఆయన చూస్తాడు, నిమగ్నమవుతాడు, కదలిక లేకుండా ఉంటాడు అది మార్గం. కాబట్టి ప్రజలు కదలిక లేకుండా ఉన్నారు , లేదు... కదలిక లేకపోవడము కాదు , ఏమి పిలుస్తారు? కదలడము. కానీ మీరు ఆయనని కదలకుండా ఉండేటట్లు చేయలనుకుంటే, ఆయనకి కృష్ణుడి నిమగ్నతను ఇవ్వండి. అప్పుడు ఆయన కదలకుండా ఉంటాడు. ఆయన (అస్పష్టముగా)... అది సాక్షాత్కారము. కృష్ణ చైతన్యములో ఎందుకు నిమగ్నమై ఉండాలి అని ఆయన అర్థము చేసుకుంటే? "నేను కృష్ణుడి యొక్క? నేను ఈ పదార్ధము కాదు, నేను ఈ దేశం వాడిని కాదు, నేను ఈ సమాజము వాడిని కాదు, నేను ఈ మూర్ఖుడు యొక్క కాదు, నేను కేవలం కృష్ణుడి యొక్క. "కదలిక లేకపోవడము ఆయన పూర్తి జ్ఞానముతో ఉన్నాడు.

అది నా పరిస్థితి. నేను భాగం. Mamaivāṁśo jīva ( BG 15.7) -- ఈ జీవుల అందరు నాలో భాగము. అందువల్ల మీరు "నేను కృష్ణునిలో భాగము" అని అర్థం చేసుకున్నప్పుడు వెంటనే మీరు భౌతిక కార్యక్రమాలకు చలించకుండా ఉంటారు. అవును