TE/Prabhupada 0700 - సేవ. సేవ అంటే మూడు విషయాలు: సేవకుడు, సేవించబడే వారు మరియు సేవ: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0700 - in all Languages Category:TE-Quotes - 1969 Category:TE-Quotes - Le...")
 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 8: Line 8:
[[Category:Telugu Pages - Yoga System]]
[[Category:Telugu Pages - Yoga System]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0699 - Un dévot amoureux, il veut aimer Krishna dans Sa forme originelle|0699|FR/Prabhupada 0701 - Si vous éprouvez de l'affection pour le maîte spirituel, votre devoir se terminera dans cette vie|0701}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0699 - ప్రేమలో ఉన్న భక్తుడు, తన వాస్తవ రూపంలో కృష్ణుడిని ప్రేమిస్తాడు|0699|TE/Prabhupada 0701 - మీరు ఆధ్యాత్మిక గురువు మీద ప్రేమను కలిగి ఉంటే|0701}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 19: Line 19:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|RmRVn2IaMAc|సేవ. సేవ అంటే మూడు విషయాలు: సేవకుడు, సేవించబడే వారు మరియు సేవ  <br />- Prabhupāda 0700}}
{{youtube_right|bJ5LbrU94hA|సేవ. సేవ అంటే మూడు విషయాలు: సేవకుడు, సేవించబడే వారు మరియు సేవ  <br />- Prabhupāda 0700}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:37, 1 October 2020



Lecture on BG 6.46-47 -- Los Angeles, February 21, 1969


ప్రభుపాద: అవును?

భక్తుడు: మళ్ళీ, ప్రభుపాద, ఈ ఉదయం చదివిన దానిలో...

ప్రభుపాద: వద్దు, ఉదయం దాని గురించి ప్రశ్నలు వద్దు. అది సరే, మీరు అడగవచ్చు, కానీ ప్రశ్న మరియు సమాధానాలు చదివే విషయములో ఉండాలి. లేకపోతే మీరు అన్ని అంశాలని తీసుకు వచ్చినట్లయితే ప్రశ్నలకు మరియు సమాధానములకు అంతు ఉండదు. మీరు చూడండి. ఏమైనప్పటికి, మీరు దానిని ముగించవచ్చు. అవును, ఏదైనా ప్రశ్న ఉందా?

భక్తుడు: మీరు గోప బాలురు, కృష్ణుడి స్నేహితులు, ఆయనతో ఆడుతున్నారని చెప్పారు, వారు వారి గత జీవితంలో చాలా పవిత్రమైన కర్మలను చేసారని చెప్పారు. వారు శాశ్వత సహచరులు అని నేను అర్థము చేసుకోగలను...

ప్రభుపాద: కాదు, శాశ్వత సహచరులుగా ఉన్నవారు... వారిలో కొందరు శాశ్వత సహచరులు; వారిలో కొందరు ఆ శాశ్వత సంబంధానికి ఉద్ధరించబడ్డారు. ఉదాహరణకు మీరు వెళ్ళి కృష్ణుడి సహచరుడుగా మారారు అనుకుందాం. కృష్ణుడితో ఆడుకునేవానిగా కావున మీ స్థితి కూడా ఇప్పుడు, శాశ్వతమైనది అవుతుంది. కేవలం కృష్ణుడి యొక్క శాశ్వత సహచరులు మాత్రమే ఆయనతో ఆడుకోవచ్చు అంటే, ఇతరులు కాదు అంటే, అప్పుడు మీరు కృష్ణ చైతన్య వంతులు అయ్యారు అనటములో అర్థం ఏమిటి? మీరు కూడా కావచ్చు. ఎలా? అనేక జన్మల పవిత్ర కర్మల ద్వారా. మీరు కూడా ఆ స్థానానికి ఉద్ధరించబడవచ్చు. Kṛta-puṇya-puñjāḥ ( SB 10.12.11) వాస్తవానికి bhauma వృందావనములో ఈ భౌతిక ప్రపంచంలో, వృందావనము, కృష్ణుడి సహచరులు చాలా వరకు ఈ బద్ద జీవులు వీరు కృష్ణ చైతన్యము పరిపూర్ణము దశకు ఉద్ధరింపబడ్డారు మొట్టమొదటగా వారు కృష్ణుడిని చూడడానికి అనుమతించబడ్డారు కృష్ణుడి లీలలు జరుగుతున్న లోకములో. ఆ తరువాత వారు ఆధ్యాత్మిక వృందావనమునకు ఉద్ధరింపబడ్డారు. అందువలన ఇది భాగవతములో చెప్పబడింది: kṛta-puṇya-puñjāḥ. వారు అందరు ఉద్ధరింపబడ్డారు కానీ వారు ఉద్ధరింపబడినను, వారు ఇప్పుడు నిరంతర సహచరులు. ఇది స్పష్టంగా ఉందా? హరే కృష్ణ. కావున? ఇతర ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా ?

భక్తుడు: ప్రభుపాద? భక్తి-యోగాలో తనను తాను నిమగ్నము చేసుకోవటానికి సాధ్యము అవుతుందా కృష్ణుడికి సేవ చేయకుండా? ఉదాహరణకు ఎవరైనా...

ప్రభుపాద: కృష్ణుడు లేకుండా, భక్తి ఎక్కడ ఉంది?

భక్తుడు: సరే, కొంత మంది భగవంతుడు బుద్ధుడిని లేదా ప్రభువైన యేసును పూజిస్తారు...

ప్రభుపాద: అది భక్తి-యోగ కాదు. భక్తి-యోగ అనేది కేవలము కృష్ణుడితో సంబంధం కలిగి ఉంటుంది. భక్తి-యోగ మిగతా ఎవరికైనా, అమలు చేయడానికి లేదు బుద్ధుని తత్వము భక్తి-యోగంతో ఎలా జోడించగలరు? భక్తి-యోగ అంటే భగవంతుడిని అర్థము చేసుకోవటము. Bhaktyā mām abhijānāti ( BG 18.55) మీరు భగవద్గీత, పద్దెనిమిదవ అధ్యాయంలో చూస్తారు. భక్తి-యోగం ద్వారా మీరు భగవంతుడు, దేవాదిదేవుడిని, భగవంతుడుని అర్థం చేసుకోవచ్చు. కానీ బుద్ధుని తత్వంలో భగవంతుడే లేదు. అది మీకు తెలుసా? కాబట్టి భక్తి-యోగా ఎక్కడ ఉంది?

భక్తుడు: క్రైస్తవుల విషయములో, వారిలో కొందరు యేసుక్రీస్తును ఆరాధిస్తారు.

ప్రభుపాద: అది భక్తి-యోగ. ఎందుకంటే వారు భగవంతుణ్ణి అంగీకరించినందున. మీరు భగవంతుణ్ణి అంగీకరించకపోతే, భక్తి-యోగ అనే ప్రశ్నే లేదు. కాబట్టి క్రైస్తవ ధర్మము కూడా వైష్ణవిజం, ఎందుకంటే వారు భగవంతుణ్ణి అంగీకరిస్తారు. బహుశా, కొంత దశ, దీని నుండి వేరుగా ఉంటుంది. భగవంతుని సాక్షాత్కారములో కూడా వివిధ దశలు ఉన్నాయి. భగవంతుడు గొప్పవాడు అని క్రైస్తవ ధర్మము చెబుతోంది. అంగీకరించు! అది చాలా బాగుంది. కానీ భగవంతుడు ఎంత గొప్పవాడు, అది మీరు భగవద్గీత మరియు శ్రీమద్-భాగవతం నుండి అర్థం చేసుకోవచ్చు. కానీ భగవంతుడు గొప్పవాడు అని అంగీకారం ఉంది. అంటే, అందువలన అది భక్తి యొక్క ఆరంభం. మీరు అమలు చేయవచ్చు, భక్తి. మహమ్మదీయ మతము కూడా. అది కూడా భక్తి-యోగా. భగవంతుడు లక్ష్యంగా ఉన్న ఏ మతమైనా -అది దానిలో, భక్తిని అమలు చేయవచ్చు. కానీ భగవంతుడే లేనప్పుడు లేదా నిరాకారము అయినప్పుడు, భక్తి-యోగ యొక్క ప్రశ్న లేదు. భక్తి-యోగ అనగా bhaja dhatu kti, bhaja-sevayā.. సేవ. సేవ అంటే మూడు విషయాలు: సేవకుడు, సేవించబడే వారు మరియు సేవ. ఒకరు ఉండాలి ఎవరైతే సేవను అంగీకరిస్తారో? సేవను చేయడానికి ఒక వ్యక్తి ఉండాలి. ఆపై మార్గము, సేవా పద్ధతి. కాబట్టి భక్తి-యోగ అంటే సేవ. సేవను తీసుకోవడానికి ఎవరూ లేకుంటే, భక్తి-యోగా ఎక్కడ ఉంది? కాబట్టి ఏ తత్వమైనా లేదా మతపరమైన సూత్రమైనా భగవంతుని, దేవదిదేవుడిని అంగీకరించకపోతే భక్తి అమలు చేయడము అనేది లేదు.