TE/Prabhupada 0718 - శిష్యుడిని లేదా కుమారుడిని, వారినిఎల్లప్పుడూ కోప్పడాలి

Revision as of 17:03, 22 January 2018 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0718 - in all Languages Category:TE-Quotes - 1977 Category:TE-Quotes - Mo...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Morning Walk -- February 1, 1977, Bhuvanesvara


భక్తుడు(1) : శ్రీల ప్రభుపాద, ఉదాహరణకు కత్తెర కథ వలె, శాస్త్రవేత్తలను కృష్ణుడిని, భగవద్గీతను అంగీకరించమని ఎలా ఒప్పించాలి? భగవద్గీతను అంగీకరించమని శాస్త్రవేత్తలను ఎలా ఒప్పించాలి? సమస్య ఏమిటంటే....

ప్రభుపాద: లేదు, అది వాస్తవం అయితే, మీరు బలవంతం చేయొచ్చు, అది వాస్తవం అయితే, అది సత్యము కాకపోతే, అది మొండితనం. అది సత్యము అయితే, మీరు బలవంతం చేయొచ్చు, తండ్రి పిల్లవాడిని బలవంతం చేయడం లాగానే, “పాఠశాలకు వెళ్ళు.” ఎందుకంటే అతడికి తెలుసు విద్య లేకపోతే అతడి జీవితం నిరాశకు గురవుతుంది, అందువలన ఆయన బలవంతం చేయవచ్చు. నేను బలవంతం చేయబడ్డాను. నేను పాఠశాలకు వెళ్లే వాడిని కాను. అవును. (నవ్వుతూ) నా తల్లి బలవంతం చేసేది. నా తండ్రి చాలా స్వేచ్చేను ఇచ్చేవాడు. నా తండ్రి, ఎర్, నా తల్లి బలవంతం చేసేది. పాఠశాలకు నన్ను లాక్కుని వెళ్ళుటకు ఆమె ఒక వ్యక్తిని ప్రత్యేకంగా ఉంచింది. కాబట్టి శక్తి అవసరం.

గురుకృప: కానీ అది ప్రామాణికం. మీ తల్లిదండ్రులు మీకు ప్రామాణికం.

ప్రభుపాద: అవును.

గురుకృప: కానీ వారు మన ప్రామాణికతను అంగీకరించరు. వారు అంటున్నారు, "నేను మీతో సమానంగా ఉన్నాను. వాస్తవానికి నాకు మీ కన్నా ఎక్కువ తెలుసు".

ప్రభుపాద: ఇది మరో మూర్ఖత్వం, మరో మూర్ఖత్వం. తండ్రి - తల్లి, సహజ సంరక్షకుడు వారు బలవంతం చేయొచ్చు.

స్వరూప దామోదర: మనము వారికి ఉన్నతమైన అవగాహన కలిపించాలి, ఙ్ఞానం లో ఉన్నతమైన భాగమును.

ప్రభుపాద: అవును. పిల్లవాడు మూర్ఖునిగా ఉండవచ్చు, కానీ తండ్రి - తల్లి వారి పిల్లవాడు ఒక అవివేకిగా ఉండుట చూడలేరు. ఆయన బలవంతం చేయవచ్చు. ప్రభుత్వం కూడా. ఎందుకు సైనికశక్తి ఉంది? పోలీసు బలం ఎందుకు ఉంది? మీరు చట్టవిరుద్ధంగా ఉండాలని కోరుకుంటే, అప్పుడు మిమ్మల్ని చట్టం ఆమోదించేందుకు బలవంతము చేస్తారు. బలము అవసరం.

భక్తుడు(1): పాఠశాలకు వెళ్లడం వల్ల కొంత ప్రయోజనం ఉందని మొదట పిల్లవాడు చూడాలి.

ప్రభుపాద: పిల్లవాడు చూడలేడు. వాడు ఒక మూర్ఖుడు. వాడిని బూట్లతో కొట్టాలి. అప్పుడు వాడు చూస్తాడు. పిల్లవాడు చూడలేడు. putram ca sisyam ca tadayen na tu lalayet (చాణక్య పండిత): పిల్లలను మరియు శిష్యులను ఎల్లప్పుడూ కోప్పడాలి. అది చాణక్య పండిత. "వారిని ఎప్పుడూ గారాబము చేయొద్దు". Lalane bahavo dosas tadane bahavo gunah....." మీరు గారం చేస్తే అతడు చెడిపోతాడు. మీరు అతన్ని కోప్పడితే, ఆయన చాలా మంచి వ్యక్తిగా తయారవుతాడు. అందువలన, శిష్యుడిని లేదా కుమారుడిని, వారిని ఎల్లప్పుడూ కోప్పడాలి. ఇది చాణక్య పండితుని యొక్క ఉత్తర్వు. వారిని గారాబం చేసే ప్రశ్నే లేదు.

గురుకృప: ప్రజలు తమను పొగడాలి అని కోరుకుంటారు. వారికి తీవ్రముగా చెప్పవలెనని కోరుకోరు.

ప్రభుపాద: ఇది శిష్యుల స్థితి. చైతన్య మహాప్రభు చెప్పారు, guru more murkha dekhi ( cc Adi 7.71) చైతన్య మహాప్రభు ఆయనే దేవదేవుడు, అతడు అన్నాడు నా గురు మహారాజు నన్ను ఒక అవివేకి మూర్ఖులలో మొదటి రకముగా చూసారు. కోప్పడడము. అది అవసరం. చాణక్య పండిత, ఒక గొప్ప నైతిక ఉపదేశకుడు, ఆయన సలహా ఇచ్చాడు, tadayen na tu lalayet: " ఎల్లప్పుడూ వారిని కోప్పడండి. లేకపోతే వారు చెడిపోతారు."

స్వరూప దామోదర: తెలివైన అబ్బాయికి తెలుసు, ఆ కోప్పడడము శిక్ష అని.

ప్రభుపాద: అవును. అవును.