TE/Prabhupada 0748 - భగవంతుడు భక్తుని సంతృప్తి పరచాలని కోరుకుంటున్నారు: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0748 - in all Languages Category:TE-Quotes - 1973 Category:TE-Quotes - Le...")
 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 7: Line 7:
[[Category:TE-Quotes - in USA, Los Angeles]]
[[Category:TE-Quotes - in USA, Los Angeles]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0747 - Draupadi a prié, "Krishna, si Vous voulez, Vous pouvez me sauver"|0747|FR/Prabhupada 0749 - Krishna éprouve de la douleur. Alors devenez conscient de Krishna|0749}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0747 - ద్రౌపది ప్రార్థన చేసింది కృష్ణా, మీకు కావాలంటే, మీరు రక్షించవచ్చు|0747|TE/Prabhupada 0749 - కృష్ణుడు బాధ పడుతూ ఉన్నాడు. కావున మీరు కృష్ణ చైతన్య వంతులు అవ్వండి|0749}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 18: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|p2ag_M4aA4Y|భగవంతుడు భక్తుని సంతృప్తి పరచాలని కోరుకుంటున్నారు  <br />- Prabhupāda 0748}}
{{youtube_right|jCG_TBoQ0l4|భగవంతుడు భక్తుని సంతృప్తి పరచాలని కోరుకుంటున్నారు  <br />- Prabhupāda 0748}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:37, 1 October 2020



Lecture on SB 1.8.29 -- Los Angeles, April 21, 1973


అందువల్ల భగవద్గీతలో భగవంతుడు ఇలా చెప్పాడు: paritrāṇāya sādhūnāṁ vināśāya ca duṣkṛtām ( BG 4.8) కాబట్టి రెండు ప్రయోజనాలు. భగవంతుడు అవతరించినప్పుడు ఆయనకు రెండు లక్ష్యములు ఉన్నాయి. ఒక లక్ష్యము పరిత్రాణాయ సాధూనామ్ మరియు వినాశాయ చ దుష్... విశ్వాసముగా ఉన్న భక్తులను, సాధువును విముక్తి కలుగ చేయడమే ఒక లక్ష్యం. సాధు అంటే సాధువులు.

సాధు... నేను అనేక సార్లు వివరించాను. సాధు అంటే భక్తుడు. సాధు అంటే లౌకిక నిజాయితీని లేదా మోసము, నైతికత లేదా అనైతికత కాదు. దీనికి భౌతిక కార్యక్రమాలతో పని లేదు. ఇది కేవలం ఆధ్యాత్మికం, సాధు. కానీ కొన్నిసార్లు మనం అనుకుంటాము, "సాధు," ఒక వ్యక్తి యొక్క భౌతికమైన మర్యాద, నైతికత. కానీ వాస్తవానికి "సాధు" అంటే ఆధ్యాత్మిక స్థితిలో ఉండడము అని అర్థం. భక్తియుక్త సేవలో నిమగ్నమై ఉన్నవారు. Sa guṇān samatītyaitān ( BG 14.26) సాధువులు భౌతిక లక్షణాలకు అతీతముగా ఉన్నవారు కాబట్టి paritrāṇāya sādhūnām. పరిత్రాణాయ అంటే విముక్తి కలుగ చేయడము.

ఒక సాధు ఇప్పటికే విముక్తుడు అయి ఉంటే, ఆయన ఆధ్యాత్మిక స్థితిలో ఉంటే, అప్పుడు ఆయనని విముక్తిడిని చేయవలసిన అవసరం ఏమిటి? ఇది ప్రశ్న. అందువల్ల ఈ పదాన్ని ఉపయోగించారు. viḍambanam. ఇది ఆశ్చర్యముగా ఉంది. ఇది విరుద్ధమైనది. ఇది విరుద్ధంగా కనిపిస్తుంది. ఒక సాధువు ఇప్పటికే విముక్తుడు అయి ఉంటే.. ఆధ్యాత్మిక పరిస్థితి అంటే ఆయన ఇంక బద్ధస్థితిలో ఉండడు సత్వ గుణము, రజో గుణము తమో గుణము యొక్క మూడు భౌతిక గుణాలల్లో. ఇది స్పష్టంగా భగవద్గీతలో పేర్కొనబడింది: sa guṇān samatītyaitān ( BG 14.26) ఆయన భౌతిక లక్షణాలను అధిగమిస్తాడు. ఒక సాధువు, భక్తుడు. అప్పుడు విముక్తి అనే ప్రశ్న ఎక్కడ ఉంది? విముక్తి... ఆయనకి విముక్తి అవసరం లేదు, ఒక సాధువు, కానీ ఆయన భగవంతుని చూడడానికి చాలా ఆత్రుతగా ఉంటాడు కనుక అది తన అంతరంగిక కోరిక, అందుచేత కృష్ణుడు వస్తాడు విముక్తి కోసం కాదు. ఆయన ఇప్పటికే విముక్తిని పొందినాడు. ఆయన ఇప్పటికే భౌతిక కోరలు నుండి విముక్తిని పొందినాడు. కానీ ఆయనని సంతృప్తి పరచుటకు, కృష్ణుడు ఎల్లప్పుడు...

ఒక భక్తుడు అన్ని విధాలుగా భగవంతుని సంతృప్తి పరచాలని కోరుకుంటున్నట్లు, అలాగే భక్తుని కంటే ఎక్కువగా, భగవంతుడు భక్తుని సంతృప్తి పరచాలని కోరుకుంటున్నారు. ఇది ప్రేమ వ్యవహారాల మార్పిడి. ఉదాహరణకు మీ మాదిరిగానే, మన సాధారణ వ్యవహారాల్లో కూడా, మీరు ఎవరినైనా ప్రేమించి ఉంటే, మీరు అతన్ని లేదా ఆమెను సంతృప్తి పరచాలని అనుకుంటున్నారు. అదేవిధముగా, ఆమె లేదా ఆయన కూడా పరస్పరం తిరిగి ప్రేమించాలని కోరుకుంటారు. కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలో అటువంటి పరస్పర ప్రేమ వ్యవహారాలు ఉంటే, అది ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎంత గొప్పగా ఉన్నతముగా ఉంటుంది ? కాబట్టి ఒక శ్లోకము ఉంది: "సాధువు నా హృదయం, నేను కూడా సాధువు హృదయము." సాధువు ఎప్పుడూ కృష్ణుడి గురించి ఆలోచిస్తున్నాడు, కృష్ణుడు తన భక్తుడు, సాధువు గురించి ఎల్లప్పుడూ ఆలోచిస్తున్నాడు.