TE/Prabhupada 0777 - మీరు ఎంత మీ చైతన్యము అభివృద్ధి చేసుకుంటారో మీరు మరింత స్వేచ్ఛా ప్రేమికునిగా మారుతారు: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0777 - in all Languages Category:TE-Quotes - 1972 Category:TE-Quotes - Le...")
 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 7: Line 7:
[[Category:TE-Quotes - in USA, Los Angeles]]
[[Category:TE-Quotes - in USA, Los Angeles]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0776 - "Quel est le problème si je deviens un chien?" Cela est le résultat de l'éducation|0776|FR/Prabhupada 0778 - La plus grande contribution à la société humaine est la connaissance|0778}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0776 - నేను కుక్కగా మారితే తప్పు ఏమిటి . ఇది విద్య యొక్క ఫలితం|0776|TE/Prabhupada 0778 - మానవ సమాజానికి గొప్ప సహయము చేయడము అంటే జ్ఞానము ఇవ్వడము|0778}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 18: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|X6V36mxi_Tc|మీరు ఎంత మీ చైతన్యము అభివృద్ధి చేసుకుంటారో మీరు మరింత స్వేచ్ఛా ప్రేమికునిగా మారుతారు  <br/>- Prabhupāda 0777}}
{{youtube_right|dYUAC4LymC8|మీరు ఎంత మీ చైతన్యము అభివృద్ధి చేసుకుంటారో మీరు మరింత స్వేచ్ఛా ప్రేమికునిగా మారుతారు  <br/>- Prabhupāda 0777}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:46, 1 October 2020



Lecture on SB 2.4.2 -- Los Angeles, June 26, 1972


Virūḍhāṁ mamatām ( SB 2.4.2) విరూఢామ్. ఉదాహరణకు మీరు చాలా గొప్ప చెట్లు చూసినట్లుగా చాలా సంవత్సరాలుగా, చాలా సంవత్సరాలు నిలబడి ఉన్నాయి. వేరు గట్టిగా బందించబడి ఉంది. మీరు చూసినారు, అనుభూతి చెందినారు. వాటి పని 10,000 సంవత్సరాలు నిలబడి ఉండటము, కానీ వేరు చాలా బలముగా భూమిని పట్టుకుని ఉంది, బలంగా ఉంది. దీనిని విరూఢామ్ అని పిలుస్తారు, ఆకర్షణ. ఉదాహరణకు మీకు తెలివి ఉంటే, మెరుగైన చైతన్యము, మానవుడు, ఒక గంట మిమ్మల్ని ఇక్కడ నిలబడమని అడిగితే, అది చాలా కష్టముగా ఉంటుంది. మిమ్మల్ని ఒక గంట బలవంతంగా నిలబెట్టి ఉంటే, మీరు చాలా అసౌకర్యమును అనుభూతి చెందుతారు. కానీ ఈ చెట్టు, అది చైతన్యము అభివృద్ధి చెందలేదు కనుక, ఇది 10,000 సంవత్సరాల పాటు నిలబడి ఉంది, బహిరంగ వాతావరణంలో, అధిక ఉష్ణము, వర్షం, హిమపాతం అన్ని రకాలను తట్టుకోవడం. కానీ ఇంకా, ఇది ఆకర్షణ కలిగి ఉంటుంది. ఇది అభివృద్ధి చెందిన చైతన్యము మరియు అభివృద్ధి చెందుతున్న చైతన్యము మధ్య వ్యత్యాసం. చెట్టు కూడా చైతన్యము కలిగి ఉంది. ఆధునిక శాస్త్రం, వారు నిరూపించారు, వాటికీ చైతన్యము కలిగి ఉంది అని.చాలావరకు కప్ప బడి ఉంది, దాదాపు మరణించినటు వంటి.

కానీ అది చనిపోలేదు. చైతన్యము ఉంది. మీరు ఎంత మీ చైతన్యము అభివృద్ధి చేసుకుంటారో, మీరు మరింత స్వేచ్ఛా ప్రేమికునిగా మారుతారు. మానవ సమాజంలో వలె, స్వేచ్ఛ కోసం పోరాటం ఉంది. కానీ జంతు సమాజంలో, వాటికి స్వేచ్ఛ అంటే ఏమిటో తెలియదు. మనది కూడా, స్వేచ్ఛ అని పిలవబడే. కానీ ఇప్పటికీ, మనం స్వేచ్ఛ కోసం పోరాడే కొంత చైతన్యమును కలిగి ఉన్నాము. వారు తినడానికి పోరాడుతున్నారు. అంతే. ఇక్కడ, పరిక్షిత్ మహారాజ... ఈ విముక్తి... కృష్ణ చైతన్యము అంటే ఈ భౌతిక బంధనము నుండి విముక్తి అని అర్థం. అందువలన ఆయన చాలా అధునాతనము అయినాడు... తన బాల్యం నుండి, తను జన్మించినప్పటి నుండి, తన తల్లి గర్భంలో నుండి, ఆయన కృష్ణ చైతన్యముతో ఉన్నాడు. అందువల్ల ఆయన అర్థము చేసుకున్నప్పటి నుండి "కృష్ణుడు నా లక్ష్యం," వెంటనే, virūḍhāṁ mamatāṁ jahau, వెంటనే వదలి వేసాడు. జహౌ అంటే "వదలి వేయడము" అని అర్థం. ఆయన ఏ విధమైన విషయాలను వదలి వేస్తున్నాడు? సామ్రాజ్యమును. హస్తినాపురములో ఇంతకు ముందు చక్రవర్తి, వారు భూమిని, మొత్తం ప్రపంచమును పరిపాలిస్తున్నారు, పరీక్షిత్ మహారాజు, కనీసం 5,000 సంవత్సరాల క్రితం పరీక్షిత్ మహారాజు రాజుగా ఉన్నప్పుడు.

ఆయన మొత్తం ప్రపంచం యొక్క చక్రవర్తి. కాబట్టి ఆయన దానిని వదలి వేస్తున్నాడు. ఒక చిన్న గ్రామమును లేదా అటువంటిది ఏదైనా కాదు. కాదు ఆ సామ్రాజ్యమును కూడా, ఎటువంటి కలత లేకుండా. ఎవ్వరూ ఆయనని ఎదిరించేవారు కాదు. ఆయన ఎంతో శక్తివంతుడు. Rājye ca avikale ( SB 2.4.2) అవికలే. వికల అంటే "విడిపోయిన" లేదా "కలత చెందిన" అని అర్థము. కానీ ఆయన రాజ్యం ఎప్పుడు విచ్ఛిన్నం లేదా కలత చెందలేదు. ఇప్పుడు ప్రపంచం మొత్తం విడిపోయినది మరియు అశాంతికి గురవుతోంది. ప్రస్తుత క్షణమున వారికి చాలా దేశాలు, స్వతంత్ర దేశాలు ఉన్నాయి. అంటే ప్రపంచం ముక్కలుగా విభజించబడింది. గతంలో అటువంటి ముక్కలు లేవు. ఒకటి. ఒకటే ప్రపంచం, ఒకరే రాజు. ఒకే భగవంతుడు, కృష్ణుడు. ఒకే గ్రంథము, వేదాలు. ఒకే నాగరికత, వర్ణాశ్రమ-ధర్మ. చాలా దూరమున కాదు. వారు చరిత్రను ఇస్తున్నారు... వారు భూమి పొరను అధ్యయనం చేస్తున్నారు, కానీ వారు లక్షల సంవత్సరాల భూమి పొరను అధ్యయనం చేస్తున్నప్పటికీ, లక్షలాది సంవత్సరాల పాటు ఖచ్చితమైన నాగరికత ఉoది. పరిపూర్ణ నాగరికత, భగవంతుని చైతన్యము. ఆనందము ఉన్న నాగరికత. ఇప్పుడు వారు విడిపోయినారు, కలత చెందినారు. గతంలో ఇలా లేదు.

కావున ఈ విరూఢా మమతా . మమతా అంటే అర్థం "ఇది నాది." అని దానిని మమతా అని అంటారు. మమతా. మమ అంటే "నాది" "నా" మరియు "నాది" అనే చైతన్యము దీనిని మమతా అంటారు. నేను ఈ శరీరం, ఈ శరీరముతో సంబంధం ఉన్న, ప్రతిదీ నాది. నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నా బ్యాంకు బ్యాలెన్స్, నా సమాజం, నా వర్గము, నా దేశం, నా జాతి - నా. " దీనిని మమతా అని అంటారు. కావున ఈ మమతా, లేదా "నా" యొక్క చైతన్యము ఎలా పెరుగుతుంది? ఒక యంత్రం ఉంది, మాయ, మాయ చేత ప్రభావితము చేయ బడుతుంది. భ్రాంతి కలిగించే శక్తి ప్రారంభం. అది ఏమిటి? ఆకర్షణ. స్త్రీ పురుషునిచే ఆకర్షించ బడుతుంది, పురుషుడు స్త్రీ చేత ఆకర్షించ బడతాడు. ఇది ప్రాథమిక సూత్రం. ఇక్కడ, ఈ భౌతిక ప్రపంచంలో, భగవంతుని పట్ల ఆకర్షణ లేదు, కానీ ఆకర్షణ ఉంది. ఆ ఆకర్షణ మొత్తం మీద, మైథున సుఖము యొక్క ఆకర్షణ. అంతే. మొత్తం ప్రపంచ, మానవ సమాజం మాత్రమే కాదు, జంతు సమాజం, పక్షి సమాజం, మృగం సమాజం, ఏ సమాజం అయినా, ఏ జీవి అయినా, ఆకర్షణ మైథున సుఖము మాత్రమే. Puṁsaḥ striyā mithunī-bhāvam etam ( SB 5.5.8) ఇక్కడ ఆకర్షణ, ఆకర్షణ యొక్క కేంద్రం, మైథున సుఖము. కావున, అబ్బాయిలు మరియు అమ్మాయిలు లేదా ఎవరైనా, చిన్న వయస్సులో, ఆ లైంగిక ప్రేరణ పెరుగుదల ఉంటుంది సంభోగము కొరకు కోరిక ఉంటుంది. పురుషుడు స్త్రీని కోరుకుంటున్నారు, స్త్రీ పురుషుడిని కోరుకుంటున్నారు. ఇది ఆకర్షణ. ఇది బద్ధజీవులను కట్టి వేస్తున్న ప్రాథమిక సూత్రం పునరావృతమవుతున్న జన్మ మరణం యొక్క ఈ బాధాకరమైన జీవితంలో. ఈ ఆకర్షణ.