TE/Prabhupada 0782 - కీర్తన చేయడము ఆపవద్దు. అప్పుడు కృష్ణుడు మిమ్మల్ని కాపాడుతాడు: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0782 - in all Languages Category:TE-Quotes - 1975 Category:TE-Quotes - Le...")
 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 7: Line 7:
[[Category:TE-Quotes - in USA, Philadelphia]]
[[Category:TE-Quotes - in USA, Philadelphia]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0781 - La vraie perfection du yoga signifie fixer le mental aux pieds de lotus de Krishna|0781|FR/Prabhupada 0783 - On est venu dans ce monde matériel avec un esprit de jouissance. Donc, on est déchu|0783}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0781 - యోగా యొక్క పరిపూర్ణము అంటే కృష్ణుడి యొక్క కమల పాదముల వద్ద మనస్సును స్థిరముగా ఉంచుట|0781|TE/Prabhupada 0783 - ఈ భౌతిక ప్రపంచంలో మనము ఆనందించే కోరికతో వచ్చాము.అందువలన మనము పతనము అయ్యాము|0783}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 18: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|8NugZBE_XQM|కీర్తన చేయడము ఆపవద్దు. అప్పుడు కృష్ణుడు మిమ్మల్ని కాపాడుతాడు  <br/>- Prabhupāda 0782}}
{{youtube_right|IUR_eK26CKA|కీర్తన చేయడము ఆపవద్దు. అప్పుడు కృష్ణుడు మిమ్మల్ని కాపాడుతాడు  <br/>- Prabhupāda 0782}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:46, 1 October 2020



Lecture on SB 6.1.28-29 -- Philadelphia, July 13, 1975


కాబట్టి అజామిళుడు, యువకుడు, వేశ్యతో సహవాసం వలన, ఆయన తన మంచి ప్రవర్తనను కోల్పోయాడు, వేశ్యను పోషించ సాగాడు దొంగిలించడం ద్వారా, మోసగించడం ద్వారా, ఒకదాని తరువాత మరొక దానిని. కాబట్టి పొరపాటున, లేదా వయస్సు వలన, ఆయన వేశ్యకు ఆకర్షించబడ్డాడు. కాబట్టి కృష్ణుడు చూస్తున్నాడు. అందువలన ఆయన అతనికి ఈ అవకాశాన్ని ఇచ్చాడు, పిల్లల పట్ల తనకున్న ప్రేమ కారణంగా, ఆయన కనీసం మరలా మరలా "నారాయణ" అని పలుకుతున్నాడు నారాయణ ఇక్కడకు రా, నారాయణ నీ ఆహారం తీసుకో. నారాయణ క్రింద కూర్చో కాబట్టి bhāva-grāhi-janārdanaḥ (CB Ādi-khaṇḍa 11.108). కృష్ణుడు చాలా దయతో ఉంటాడు, ఆయన ప్రయోజనమును, లేదా సారాంశమును తీసుకుంటాడు. ఎందుకంటే ఆయన పవిత్ర నామము దాని ప్రభావాన్ని కలిగి ఉంది. కాబట్టి ఈ అజామిళుడు తన మూర్ఖత్వంతో, ఆయన కుమారుడు యొక్క భౌతిక శరీరము పట్ల ఆసక్తి కలిగి ఉన్నప్పటికీ, కానీ ఆయన "నారాయణ" అని కీర్తన చేస్తుండటము వలన, కృష్ణుడు ఆ సారాన్ని తీసుకుంటున్నాడు, అది అంతే, కావున ఏదో ఒక మార్గము ద్వార, ఆయన కీర్తన, జపము చేయడము ఉంది. కీర్తన, జపము చేయడము యొక్క ప్రాముఖ్యత చాలా బాగుంది. కాబట్టి కీర్తన చేయడము ఆపవద్దు. అప్పుడు కృష్ణుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఇది ఉదాహరణ. "హరే కృష్ణ, హరే కృష్ణ," మీరు అభ్యాసం చేయండి. సహజముగా, మీరు ప్రమాదంలో ఉన్నప్పుడు, "హరే కృష్ణ" అని చెప్తారు. ఈ మాత్రము చేయండి. మీరు ఏదో చేయాటానికి సాధన చేయాలనుకుంటే, హరే కృష్ణ కీర్తన చేయండి, అప్పుడు మీరు సురక్షితంగా ఉంటారు.

ఇది కష్టం కాదు. నిజాయితీగా కీర్తన చేయండి. అపరాధములు చేయకుండా ఉండండి. ఇంద్రియ తృప్తి కోసం ఉద్దేశ్యపూర్వకంగా పతనము కావద్దు. ఇది చాలా ప్రమాదకరమైనది. ఆయన... ఉద్దేశపూర్వకంగా, ఆయన పతనము అవ్వలేదు. పరిస్థితుల ప్రభావము వలన ఒక వేశ్యతో సన్నిహిత సంబంధములోకి వచ్చినాడు, ఆయన వల్ల కాలేదు... కాబట్టి సందర్భానుసారంగా ఆయన పతనము అయినాడు, ప్రణాళికతో కాదు. ఇది గమనించాలి. ఇష్టపూర్వకంగా చేయడం, ఇది చాలా గొప్ప అపరాధము. పరిస్థితుల ప్రభావము వలన మనము పతితులు అయ్యేందుకు చాలా అవకాశం ఉంది జన్మ జన్మలుగా మనము దుష్ప్రవర్తనను అభ్యసించాము. ఎందుకంటే భౌతిక జీవితం అంటే పాపములు చేసే జీవితం అని అర్థం. మీరు మొత్తం ప్రజలను చూడండి. వారు పట్టించుకోరు. ఇది పాపము అని కూడా వారికి తెలియదు. మనము అంటున్నాము, "అక్రమ లైంగికత వద్దు, మాంసం తినవద్దు, మత్తుపదార్థాలు వద్దు, జూదము వద్దు." కాబట్టి పాశ్చాత్య ప్రజలు ఆలోచిస్తారు, "ఈ చెత్త ఏమిటి? అని ఇవి మానవులకు ప్రాధమిక సదుపాయాలు, ఈ మనిషి తిరస్కరిస్తున్నాడు. " వారికి ఇవి కూడా తెలియదు. మా విద్యార్థుల్లో కొందరు ఈ సంస్థను విడిచిపెట్టారు. వారు భావించారు, స్వామిజీ జీవన ప్రాధమిక అవసరాలు తిరస్కరిస్తున్నాడు. వారు చాలా మంద బుద్ధి గల వారు. ఇది పాపము అని వారు అర్థం చేసుకోలేక పోయారు. సాధారణ, సాధారణ మనిషి మాత్రమే కాదు, ఒక పెద్ద మనిషి కూడా, ఇంగ్లాండ్లో జెట్లాండ్ ప్రభు కూడా, నా గాడ్ బ్రదర్స్ లో ఒకరు ప్రచారము చేయడానికి వెళ్ళారు, ప్రభు జెట్లాండ్, మార్క్వెస్ ఆఫ్ జెట్లాండ్... ఆయన రోనాల్డ్షే ప్రభువుగా పిలువబడ్డాడు. ఆయన బెంగాల్ గవర్నర్. మా కళాశాల రోజులలో ఆయన మా కళాశాలకు వచ్చాడు... ఆయన స్కాట్మాన్. చాలా పెద్ద మనిషి మరియు తత్వము పట్ల ఆసక్తి ఉంది. అందువలన ఆయన ఈ గాడ్ బ్రదర్ ను అడిగాడు, "మీరు నన్ను బ్రాహ్మణుడిని చేయగలరా?" అందువల్ల ఆయన అన్నాడు, "అవును, ఎందుకు కాదు? మీరు ఈ నియమాలను నిబంధనలను అనుసరించండి, మీరు బ్రాహ్మణుడు అవుతారు." కాబట్టి ఆయన నియమాలు నిబంధనలను విన్నప్పుడు-అక్రమ లైంగికత వద్దు, ఏ మాంసం-తినకూడదు, జూదం అడకూడదు, మందు త్రాగ కూడదు ఆయన అన్నాడు, ", అది సాధ్యం కాదు, ఇది సాధ్యం కాదు." ఆయన మొహమాటము లేకుండా నిరాకరించాడు, "మా దేశంలో అది సాధ్యం కాదు." ఇది చాలా కష్టమైన పని, కానీ ఒకవేళ ఒకరు చేయగలిగితే ఈ పాపములును విడిచిపెట్టడానికి, ఆయన జీవితం చాలా పవిత్రమైనది. ఆయన పవిత్రము అవుతాడు. ఒక వ్యక్తి పవిత్రము అవ్వకపోతే, ఆయన హారే కృష్ణ మంత్రమును జపించలేడు, ఆయన కృష్ణ చైతన్యముని అర్థం చేసుకోలేడు