TE/Prabhupada 0787 - ప్రజలు భగవద్గీతను సాధారణ యుద్ధం, హింస అని తప్పుగా అర్థం చేసుకున్నారు

Revision as of 23:45, 1 October 2020 by Elad (talk | contribs) (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Lecture on BG 1.44 -- London, July 31, 1973


ప్రద్యుమ్న: అనువాదం: "అహో ఎంత విచిత్రము ఘోరమైన పాపకర్మలను చేయుటకు సిద్ధమవుతున్నాం, రాజ్య సుఖమును ఆస్వాదించ వలెననెడి కోరికతో ప్రేరేపించబడినాము."

ప్రభుపాద:

aho bata mahat-pāpaṁ
kartuṁ vyavasitā vayam
yad rājya-sukha-lobhena
hantuṁ svajanam udyatāḥ
(BG 1.44)

కాబట్టి కొన్నిసార్లు అర్జునుడు నిందించబడ్డాడు, భగవద్-గీత కూడా నిందించబడినది దానిలో హింస ఉంది. హింస ఉంది. భగవద్గీత పూర్తిగా హింసతో నిండిపోయింది. అవును, అది పూర్తిగా హింసతో నిండిపోయింది. యుద్ధరంగం. కానీ ఇక్కడ, వైష్ణవుని ఆలోచన... అర్జునుడు తన రాజ్య -సుఖము కొరకు ఏర్పాటు చేయబడినదని అనుకుంటున్నాడు. Yad rājya-sukha-lobhena. లోభేన. ఇది అర్జునుడి సంతృప్తి కోసం ఏర్పాటు చేయబడింది, అందువల్ల ఆయన రాజ్యమును మరియు దాని ద్వారా వచ్చే ఆనందమును ఆనందిస్తాడు. వాస్తవమునకు, అది అలా కాదు. ఇది కృష్ణుడిచే ఆయన సంతృప్తి కొరకు ఏర్పాటు చేయబడినది, అర్జునుడి సంతృప్తి కొరకు కాదు. కాబట్టి అది సాధారణ పని మరియు భక్తియుక్త సేవ మధ్య వ్యత్యాసం. భక్తియుక్త సేవ మరియు సాధారణ పని, దాదాపు సమానముగా కనబడతాయి. ఉదాహరణకు మనము ఈ ఇంట్లో నివసిస్తున్నట్లుగానే. పొరుగువారు, వారు అనుకోవచ్చు, అది కొందరు ఇక్కడ నివసిస్తున్నారు, పాడుతూ, నృత్యం చేస్తున్నారు. మనము కూడా నృత్యం చేస్తాము. మనము కూడా కొన్నిసార్లు పాడతాము. మరియు తింటున్నాము వారు కూడా తింటున్నారు. అప్పుడు తేడా ఏమిటి? " వారు "భక్తియుక్త సేవ మరియు సాధారణ పని మధ్య తేడా ఏమిటి?" అని ఆలోచించవచ్చు. ఇది దాదాపు సమానంగా కనిపిస్తుంది. అందువల్ల ప్రజలు భగవద్గీతను సాధారణ యుద్ధం, హింస అని తప్పుగా అర్థం చేసుకున్నారు. కానీ అది కాదు. ఇది కృష్ణుడిచే ఏర్పాటు చేయబడింది, ఎందుకంటే, ఆయన తన లక్ష్యమును పూర్తి చేసుకోవడానికి. ఆయన లక్ష్యము paritrāṇāya sādhūnāṁ vināśāya ca duṣkṛtam ( BG 4.8) ఇది ఆయన సంతృప్తి, అర్జునుని యొక్క సంతృప్తి కాదు, మరి ఎవరి సంతృప్తి కొరకు కాదు. ఇది ఆయన ప్రణాళిక. ఆయన వస్తాడు, ఆయన ఈ విశ్వంలో, ఈ లోకములో అవతరిస్తాడు, కేవలం ధర్మపరమైన జీవితము యొక్క వాస్తవమైన ప్రయోజనమును స్థాపించడానికి మరియు చంపడానికి, మానవ జీవితం, జీవితం యొక్క వాస్తవ ప్రయోజనమును వ్యతిరేకిస్తున్న వారిని నశింప చేయడానికి. ఇది ఆయన లక్ష్యం, ఏకకాలంలో రెండు విషయాలు. Paritrāṇāya sādhūnāṁ vināśāya ca duṣkṛtam ( BG 4.8)

కావున స్వజనం

aho bata mahat-pāpaṁ
kartuṁ vyavasitā vayam
yad rājya-sukha-lobhena
hantuṁ svajanam udyatāḥ
(BG 1.44)

స్వజనం అంటే బంధువులు. కాబట్టి బంధువులు అంటే అర్థం, అధిక అర్థంలో, కేవలం నా సోదరుడు లేదా నా సోదరి లేదా నా తండ్రి లేదా నా మామయ్య మాత్రమే కాదు. లేదు. స్వజనం అంటే జీవులు అన్నీ. ఎందుకంటే కృష్ణ చైతన్యము లేని వ్యక్తి, సాధారణ చైతన్యముతో, భౌతిక చైతన్యముతో, ఆయన స్వజనం పరంగా ఆలోచించ లేడు. "నా బంధువులు, జీవులు అందరూ," అని ఆయన ఆలోచించలేడు. వాస్తవమునకు, ప్రతి ఒక్కరూ మన స్వజనం, ఎందుకంటే భగవంతుడు తండ్రి అయి ఉంటే, కృష్ణుడు చెపుతున్నట్లుగా, అహం బీజ-ప్రదాః పితా, ఆయన మహోన్నతమైన తండ్రి అయితే ... ఆయన మాత్రమే చెప్పటము లేదు కనీసం, ఏ మంచి మత పద్ధతి అయినా చెప్తుంది, భగవంతుడు వాస్తవ తండ్రి. అది సత్యము. Ahaṁ sarvasya prabhavo mattaḥ sarvam pravartate ( BG 10.8) అంతా ఆయన నుండి వస్తుంది. ఆయన మహోన్నతమైన తండ్రి. కృష్ణుడు మహోన్నతమైన తండ్రి అయితే, ఆయన ప్రతి ఒక్కరికీ తండ్రి. సర్వ-యోనిషు కౌంతేయా ( BG 14.4) జీవుల యొక్క అన్ని జాతుల్లో , అన్ని రకాల జీవులు, వారు అందరూ స్వజనం, బంధువులు. ఎలా ఇది ఉండకూడదు? ఎందుకంటే కృష్ణుడు వాస్తవ తండ్రి. ఇది కృష్ణ చైతన్యము. అందుచేత కృష్ణుడి భక్తుడు ఏ జీవికీ కొద్దిగా హాని కూడా చేయాలనుకోడు. ఇది కృష్ణ చైతన్యము