TE/Prabhupada 0800 - కార్ల్ మార్క్స్. కార్మికుడి ఇంద్రియాలను ఎలా తృప్తి పరచాలా అని ఆయన ఆలోచిస్తున్నాడు

Revision as of 23:37, 1 October 2020 by Elad (talk | contribs) (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


730906 - Lecture SB 05.05.01-8 - Stockholm


ప్రభుపాద: కార్ల్ మార్క్స్. కార్మికుడు, పని చేసేవాడు, వారి ఇంద్రియాలను ఎలా తృప్తి పరచాలా అని ఆయన ఆలోచిస్తున్నాడు. అది ఆయన తత్వము. అవునా కాదా?

భక్తుడు: అవును.

ప్రభుపాద: పెట్టుబడిదారుడు, వారు విలాసవంతముగా వారి ఇంద్రియాలను మాత్రమే తృప్తి పరుచుకుంటున్నారు అని ఆయన అనుకుంటున్నాడు, ఎందుకు పని చేస్తున్న కార్మికులు కాదు. అది ఆయన తత్వము. ప్రధాన విషయము ఇంద్రియ తృప్తి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మొత్తం ప్రపంచం వివిధ పేర్లతో బిజీగా ఉంది, కానీ ప్రధాన విషయము ఇంద్రియ తృప్తి. అంతే. ఎవరికైనా ఏదైనా వ్యతిరేకంగా చెప్పటానికి ఉందా? కానీ ఇక్కడ ఋషభదేవుడు చెప్పినాడు, nṛloke kaṣṭān kāmān arhate, na arhate Na ayam deho deha-bhājāṁ nṛloke kaṣṭān kāmān arhate viḍ-bhujāṁ ye ( SB 5.5.1) అటువంటి కృషి, అది కుక్కలు మరియు పందులు కూడా చేస్తాయి. అంటే మనం పని చేయాల్సి ఉందని అర్థమా, మనము ఈ మానవ శరీరము కలిగి ఉన్నాము మనము కేవలం కుక్కలు మరియు పందులు వలె పని చేయవలసి ఉందా? వాస్తవమునకు వారు అలా చేస్తున్నారు. అంత కంటే ఎక్కువ కాదు. కుక్కలు మరియు పందులు, అవి పగలు మరియు రాత్రి అదే విషయము కోసము బిజీగా ఉన్నాయి: తినడము ఎలా, నిద్ర పోవడము ఎలా, ఎలా మైథున జీవితం కలిగి ఉండాలి, ఎలా రక్షించుకోవాలి. మానవుడు కూడా అదే విధముగా పని చేస్తున్నాడు, వేర్వేరు పేర్లతో మాత్రమే. జాతీయవాదం, సామ్యవాదం, ఈ "వాదము" ఆ "వాదము", కానీ పని కుక్క మరియు పంది మరియు మానవ సమాజం యొక్క, నాగరికత అని పిలవబడే, విషయము అదే ఉంది. కాబట్టి ఋషభదేవుడు చెప్తాడు ఆ కుక్కలు పందులు వారు ఇంద్రియ తృప్తి కోసం చాలా కష్టపడి పనిచేస్తున్నారు, కానీ మానవ శరీరం దాని కోసం కాదు. ఇది విభిన్న మార్గం కోసం.

ఆధునిక నాగరికత, వారికి తెలియదు. ఆధునిక మనిషి, సమాజం, వారికి తెలియదు. వారు కేవలం ఆలోచిస్తున్నారు "అవును, కుక్క వీధిలో నిద్రపోతోంది. మనము చాలా చక్కని భవనం, మంచి అపార్ట్మెంట్, మంచి మంచం కలిగి ఉండాలి. ఇది నాగరికత పురోగతి. లేకపోతే అది ప్రాచీనమైనది, మనము ఇదే ప్రమాణంలో ఉంటే, ఏ గృహోపకరణాలు లేకుండా ఎక్కడైనా నిద్రిస్తుంటే, లేకుండా... " కానీ ఏమైనప్పటికీ విషయము నిద్రిపోవడము మాత్రమే, అంత కంటే ఎక్కువ కాదు. అదేవిధముగా, మీరు తినడం కూడా తీసుకోండి, లేదా సంభోగము చేయడము కూడా తీసుకోండి. అప్పుడు, ప్రశ్న ఉంటుంది, అప్పుడు మీరు మానవ జీవితం దేని కోసం ఉద్దేశించబడింది అని చెబుతారు? జవాబు ఏమిటంటే tapo divyaṁ putrakā yena sattvaṁ śuddhyed ( SB 5.5.1) మానవ జీవితం తపస్యా, తపస్యా కోసం ఉద్దేశించబడింది. తపస్యా అంటే తపస్సు. దీనిని తిరస్కరించడం, తిరస్కరించడం. పిల్లులు కుక్కలు సంతృప్తి చెందాయి- అవి ఎక్కువ తిని, అవి తాము ఆనందిస్తున్నామని అని అవి భావిస్తున్నాయి. ఈ రోజుల్లో మానవుడు కూడా. వారు చాలా ఆకలిని పెంచే వాటిని వాడుతున్నారు, తాగుతున్నారు. మనము దీనిని విమానం లో అధ్యయనం చేస్తాము. తినడానికి ముందు, వారు వైన్ ఇస్తారు ఆకలిని చాలా ఎక్కువ చేయడానికి, అప్పుడు చాలా పెద్ద మొత్తంలో తింటారు. మీరు దీన్ని గమనించారా?

భక్తుడు: అవును.

ప్రభుపాద: అవును, అది వారి ఆనందము. కానీ ఋషభదేవుడు చెప్పినాడు, లేదా శాస్త్రం ఇలా చెబుతోంది, "లేదు, లేదు. మీరు తినకూడదు. ఇది మీ పరిపూర్ణము. "చూడండి. ఈ, ఈ జంతువుల వంటి వ్యక్తులు, వారు చాలా తింటున్నారు, వారు ఆనందిస్తున్నారు, కానీ మీ కర్తవ్యము తగ్గించుకోవడము, అవసరము ఉన్నంత వరకు, ఎక్కువ తినవలసిన అవసరము లేదు. కాబట్టి వారు తయారుగా ఉన్నారా? లేదు. ఇది చాలా కష్టము. కానీ అది లక్ష్యం. అందువల్ల, మీరు ఆధ్యాత్మిక మార్గములో ఉన్న వారిలో కనుగొంటారు... ఉదాహరణకు రఘునాథ గోస్వామి వలె. రఘునాథ గోస్వామి చాలా ధనవంతుని కుమారుడు. ఆయన తండ్రి మరియు మామ చాలా ధనవంతులు ఐదు వందల సంవత్సరాల క్రితం, ఆదాయం సంవత్సరానికి పన్నెండు లక్షల రూపాయలు. ఒక లక్ష అంటే, ఒక వంద వెయ్యి రూపాయలు... ప్రస్తుతము నేను అనుకుంటున్నాను దాని విలువ, వందల వేల సార్లు పెరిగింది