TE/Prabhupada 0799 - పూర్తి స్వేచ్ఛ. శాశ్వతత్వం, ఆనందకరమైన పూర్ణ జ్ఞానం



Arrival Speech -- Stockholm, September 5, 1973


మీరు దయతో నన్ను ఆహ్వానించినందుకు నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ దేశం స్వీడన్ కు నేను ఇది మొదటిసారి వస్తున్నాను. కాబట్టి ఈ కృష్ణ చైతన్య ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా క్రమక్రమంగా వ్యాప్తి చెందుతోంది. ఈ ఉద్యమం యొక్క ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టము ఎందుకంటే ఇది పూర్తిగా ఆధ్యాత్మిక స్థితి మీద ఉంది. సాధారణంగా ఆధ్యాత్మిక స్థితి ఏమిటో ప్రజలు అర్థం చేసుకోలేరు. కాబట్టి మనము రెండు విషయాల కలయిక అని మనము అర్థం చేసుకోవచ్చు ... మనలో ప్రతి ఒక్కరమూ, జీవిస్తున్నవారు, ప్రస్తుతం సమయంలో మనము ఆత్మ మరియు భౌతిక పదార్థము యొక్క కలయికలో ఉన్నాము. భౌతిక పదార్థాన్ని మనం అర్థం చేసుకోగలము, కానీ ఈ భౌతిక పదార్థముతో మన సుదీర్ఘ అనుబంధం వల్ల, ఆత్మ అంటే ఏమిటో మనము అర్థం చేసుకోలేము. కానీ ఏదో ఉందని మనము ఊహించుకోగలము ఏది మృతదేహం మరియు జీవించి ఉన్న శరీరమునకు వ్యత్యాసము చూపుతుందో. అది మనము అర్థం చేసుకోగలము. ఒక మనిషి చనిపోయినప్పుడు... నా తండ్రి చనిపోయారు అనుకుందాం, లేదా ఎవరో ఒకరు, బంధువు, చనిపోయారు, మనం ఏడుస్తాము "నా తండ్రి ఇక లేడు, ఆయన వెళ్లిపోయినాడు." కానీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు? తండ్రి మంచం మీద పడుకునే ఉన్నాడు. నా తండ్రి చని పోయాడు? అని ఎందుకు చెప్తారు? ఎవరో చెప్పినట్లయితే "మీ తండ్రి మంచం మీద పడుకుని నిద్రపోతున్నాడు. మీ తండ్రి చనిపోయాడని ఎందుకు నీవు ఏడుస్తున్నావు? ఆయన వెళ్ళలేదు. ఆయన నిద్రిస్తున్నాడు. కానీ ఆ నిద్ర ఈ నిద్ర కాదు, రోజువారీ విధముగా సాధారణ నిద్ర. ఆ నిద్ర శాశ్వత నిద్ర అని అర్థం. వాస్తవానికి, ఎవరు నా తండ్రి అని చూడటానికి మనకు కళ్ళు లేవు. నా తండ్రి జీవించి వున్న కాలంలో నాకు నా తండ్రి ఎవరో తెలియదు; కాబట్టి వాస్తవ తండ్రి దూరంగా వెళ్ళిపోయినప్పుడు, మనము ఏడుస్తున్నాము "నా తండ్రి వెళ్లిపోయినాడు." కాబట్టి అది ఆత్మ. ఆ శరీరము నుండి ఎవరైతే బయటికి వెళ్లినాడో అది ఆత్మ. లేకపోతే ఎందుకు ఆయన మాట్లాడుతున్నాడు "నా తండ్రి వెళ్లిపోయినాడు"? శరీరం అక్కడే ఉంది.

కాబట్టి మొదట మనము ఆత్మ మరియు ఈ భౌతిక శరీరం మధ్య ఈ వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవాలి. మనము ఆ ఆత్మ అంటే ఏమిటో అర్థం చేసుకుంటే, అప్పుడు ఈ ఆధ్యాత్మిక ఉద్యమమేమిటో మనము అర్థం చేసుకోవచ్చు. లేకపోతే, కేవలం భౌతిక అవగాహనతో, ఆధ్యాత్మిక జీవితం లేదా ఆధ్యాత్మిక స్థితి ఏమిటో అర్థం చేసుకోవడం చాలా కష్టము. కానీ ఉంది. ప్రస్తుత క్షణం లోనే మనము సులభంగా అనుభూతి చెందవచ్చు, కానీ ఒక ఆధ్యాత్మిక ప్రపంచం, ఆధ్యాత్మిక జీవితం ఉంది. ఆ ఆధ్యాత్మిక జీవితం ఏమిటి? పూర్తి స్వేచ్ఛ. పూర్తి స్వేచ్ఛ. శాశ్వతత్వం, ఆనందకరమైన పూర్ణ జ్ఞానం. అది ఆధ్యాత్మిక జీవితం. జీవితం యొక్క ఈ శరీర భావన నుండి పూర్తిగా వేరుగా ఉంటుంది. ఆధ్యాత్మిక జీవితం అంటే శాశ్వతమైనది, జ్ఞానం కలిగిన ఆనందకరమైన జీవితం. ఈ భౌతిక జీవితం అంటే అశాశ్వతం, అజ్ఞానం దుఃఖంతో నిండి ఉంటుంది. ఈ శరీరం అంటే అది ఉండదు, అది ఎల్లప్పుడూ పూర్తిగా బాధాకరమైన పరిస్థితి లో ఉంటుంది. మరియు దీనికి ఆనందము లేదు