TE/Prabhupada 0830 - మనము సేవకుడిగా ఉండాలని ప్రయత్నిస్తున్నాము.ఇది వైష్ణవ తత్వము: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0830 - in all Languages Category:TE-Quotes - 1972 Category:TE-Quotes - Le...")
 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 7: Line 7:
[[Category:TE-Quotes - in India, Vrndavana]]
[[Category:TE-Quotes - in India, Vrndavana]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0829 - Les quatre murs vous entendront chanter. Cela est sufisant. Ne soyez pas déçu|0829|FR/Prabhupada 0831 - On ne peut pas suivre l'asadhu-marga. On doit suivre le sadhu-marga|0831}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0829 - నాలుగు గోడలు మీరు చెప్పేది వింటాయి. అది చాలు.నిరాశ చెందవద్దు|0829|TE/Prabhupada 0831 - మనం ఆసాధు మార్గాన్ని అనుసరించలేము. మనం సాధు మార్గాన్ని అనుసరించ వలెను|0831}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 18: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|9i09SisknZ8|మనము సేవకుడిగా ఉండాలని ప్రయత్నిస్తున్నాము.ఇది వైష్ణవ తత్వము  <br/>- Prabhupāda 0830}}
{{youtube_right|_SIIe_z08mc|మనము సేవకుడిగా ఉండాలని ప్రయత్నిస్తున్నాము.ఇది వైష్ణవ తత్వము  <br/>- Prabhupāda 0830}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:38, 1 October 2020



Lecture on SB 1.2.30 -- Vrndavana, November 9, 1972


కాబట్టి కృష్ణుడు విభు; మనము అణువు. మనం కృష్ణుడితో సమానం అని ఎప్పుడూ భావించకూడదు. అది గొప్ప అపరాధము. అది మాయ అని పిలవబడుతుంది. అది మాయ యొక్క చివరి వల. వాస్తవమునకు, మనము ఈ భౌతిక ప్రపంచమునకు కృష్ణుడితో ఒకటిగా మారటానికి వచ్చాము. మనము కృష్ణుడిలా తయారుకావాలని మనము అనుకున్నాము.

కృష్ణ- బులియా జీవ భోగ వాంఛా కరే
పసెతె మాయా తారె జాపతియా ధరె
(ప్రేమ - వివర్త).

కృష్ణునితో ఒకటి కావాలని, కృష్ణునితో పోటీ పోటీపడాలని కోరుకున్నాము, అందుకే మనము ఈ భౌతిక ప్రపంచంలో ఉంచబడ్డాము మాయ తార జపతియ ధర్రే. ఇక్కడ, ఈ భౌతిక ప్రపంచంలో, ఇది జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కృష్ణుడిగా మారడానికి ప్రయత్నిస్తున్నారు. అది మాయ. ప్రతి ఒక్కరు. " అన్నింటిలో మొదట, నన్న ఒక గొప్ప, గొప్ప వ్యక్తిగా మారనివ్వండి; అప్పుడు నన్ను మంత్రిగా, నన్ను అధ్యక్షుడిగా అవ్వనివ్వండి." ఈ విధముగా, ప్రతిదీ విఫలమైతే, అప్పుడు" నన్ను భగవంతుని ఉనికిలో విలీనం అవ్వనివ్వండి." అంటే, " నన్ను భగవంతునిగా మారనివ్వండి." ఇది జరుగుతుంది. ఇది జీవితం కోసం భౌతిక పోరాటం. ప్రతి ఒక్కరూ కృష్ణుడిగా మారడానికి ప్రయత్నిస్తున్నారు.

కానీ మా తత్వము భిన్నంగా ఉంటుంది. మేము కృష్ణుడిగా ఉండాలని కోరుకోవటం లేదు. మేము కృష్ణుడి సేవకుడిగా ఉండాలని ప్రయత్నిస్తున్నాము. అది మాయవాద తత్వమునకు వైష్ణవ తత్వమునకు మధ్య వ్యత్యాసము. చైతన్య మహాప్రభు మనము ఎలా మారవచ్చో బోధించారు. కృష్ణుని సేవకుని సేవకుని సేవకుని సేవకునిగా. గోపీ - భర్తుః పద - కమలయోర్ దాస - దాస - దాసానుదాసః ( CC Madhya 13.80) కృష్ణుని సేవకునిలో అతి తక్కువ స్థానములో ఉన్న వ్యక్తి, మొదటి తరగతి వైష్ణవుడు. అతడు ఉత్తమ తరగతి వైష్ణవుడు. అందువల్ల శ్రీ చైతన్య మహాప్రభు బోధిస్తారు:

తృణాదపి సునీచేన
తరోర్ అపి సహిష్ణునా
అమానినా మానదేన
కీర్తనీయః సదా హరిః
( Cc adi 17.31)

ఇది వైష్ణవ తత్వము. మేము సేవకునిగా ఉండుటకు ప్రయత్నిస్తున్నాము. ఏదైనా భౌతికతతో మమ్మల్ని మేము గుర్తుంచుకోము. మనము ఏదైనా భౌతికతతో గుర్తించుకుంటే, వెంటనే, మనము మాయ యొక్క బారిన పడతాము. కృష్ణ - భులియా. ఎందుకనగా, నేను కృష్ణుడితో నా సంబంధాన్ని మరిచి పోయిన వెంటనే..... నేను కృష్ణుడి యొక్క శాశ్వత సేవకుడిని. చైతన్య మహాప్రభు చెప్పారు, జీవేర స్వరూప హయ నిత్య - కృష్ణ - దాస ( CC Madhya 20.108-109) ఇది కృష్ణుడి సేవకునిగా ఉండటానికి, జీవికి శాశ్వత గుర్తింపు. ఇది మరచి పోయిన వెంటనే, అది మాయ. ఇది మరచి పోయిన వెంటనే నేను " నేను కృష్ణుడను " అని అనుకుంటే, అది మాయ. ఆ మాయ అంటే ఈ మాయ, భ్రమ, జ్ఞానం పెంపొందించుకొవడము ద్వారా దీనిని తిరస్కరించవచ్చు. అతడు జ్ఞాని. ఙ్ఞాని అంటే ఇది నిజమైన జ్ఞానం అని అర్థం, తన వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవటం. “నేను భగవంతునితో సమానం. నేను భగవంతుడిని.” అది జ్ఞానము కాదు నేను భగవంతుడిని, కానీ నేను భగవంతుని అంశను. కానీ మహోన్నతమైన భగవంతుడు కృష్ణుడు. ఈశ్వరః పరమః కృష్ణః (BS.5.1)