TE/Prabhupada 0838 - భగవంతుడు లేనప్పుడు అంతా శూన్యంగా మరియు పనికి రానివిగా ఉంటుంది: Difference between revisions

(Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Prabhupada 0838 - in all Languages Category:TE-Quotes - 1973 Category:TE-Quotes - Le...")
 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 7: Line 7:
[[Category:TE-Quotes - in USA, Los Angeles]]
[[Category:TE-Quotes - in USA, Los Angeles]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0837 - On peut être très puissant aussi longtemps que Krishna nous garde puissant|0837|FR/Prabhupada 0839 - Quand on est enfant et pur, on devrait être éduqué dans le Bhagavata-dharma|0839}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0837 - మనము చాలా శక్తివంతులము కావచ్చు, కృష్ణుడు మనల్ని శక్తివంతముగా ఉంచినంత వరకు|0837|TE/Prabhupada 0839 - పిల్లలుగా ఉన్నప్పుడు మనము కలుషితం కాలేదు మనము భాగవత-ధర్మములో శిక్షణ పొంది యుండాలి|0839}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 18: Line 18:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|P890EMdsLAg|భగవంతుడు లేనప్పుడు అంతా శూన్యంగా మరియు పనికి రానివిగా ఉంటుంది  <br />- Prabhupāda 0838}}
{{youtube_right|38uJ2xh_Emg|భగవంతుడు లేనప్పుడు అంతా శూన్యంగా మరియు పనికి రానివిగా ఉంటుంది  <br />- Prabhupāda 0838}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:38, 1 October 2020



731201 - Lecture SB 01.15.21 - Los Angeles


ప్రద్యుమ్న: అనువాదం: "నేను అదే గాండీవ విల్లును కలిగి ఉన్నాను, అదే బాణాలను, అదే గుర్రాలతో నడపబడిన రథమును, నేను వాటిని అదే అర్జునుడిగా వాడుతున్నాను, ఎవరినైతే రాజులు గౌరవించారో కానీ కృష్ణుడు లేకపోవడము వలన, అవి అన్నీ, ఒక్క క్షణములో, శూన్యంగా మరియు పనికి రానివిగా మారిపోయినవి. ఇది ఖచ్చితముగా బూడిద మీద శుద్ధియైన వెన్న ను అందించటం వలె ఉంది, బంజరు భూమిపై విత్తనాలు నాటడము వలె లేదా ఒక మాయా మంత్రదండము ద్వారా డబ్బును సంపాదించడము వలె ( SB 1.15.21) "

ప్రభుపాద: చాలా ముఖ్యమైన శ్లోకము, హమ్? Tad abhūd asad īśa-riktam. భగవంతుడు లేనప్పుడు అంతా శూన్యంగా మరియు పనికి రానివిగా ఉంటుంది. అంతే. ఆధునిక నాగరికతలో ప్రతిదీ ఉంది, కానీ భగవంతుని చైతన్యము లేకుండా, ఏ క్షణం అయినా అది నాశనము అవుతుంది. లక్షణాలు ఉన్నాయి... ఏ క్షణం అయినా. ప్రస్తుత క్షణమున, ఈ భగవంతుడు లేని నాగరికత, యుధ్ధం ప్రకటించిన వెంటనే, అమెరికా ఆటంబాంబును వదిలివేయడానికి సిద్ధముగా ఉంది, రష్యా... ఏ దేశమైతే అణు బాంబును మొదట వేస్తుందో తొలి దేశం, ఆ దేశము విజయము సాధిస్తుంది. ఎవరూ విజయము సాధించరు ఎందుకంటే వారు ఇరువురు సిద్ధముగా ఉన్నారు బాంబును వేయడానికి. అమెరికా నాశనమవుతుంది రష్యా నాశనమవుతుంది. అది పరిస్థితి. కాబట్టి మీరు నాగరికత, శాస్త్రీయ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి చేయండి, కానీ అది భగవంతుడు లేనట్లైతే, ఏ సమయంలో అయినా అది నాశనమవుతుంది. ఏ సమయంలో అయినా.

ఉదాహరణకు రావణుని వలె. రావణుడు, హిరణ్యకశిపుడు, వారు రాక్షసులు, దైవభక్తి లేని రాక్షసులు. రావణుడు వేదముల జ్ఞానంలో బాగా జ్ఞానవంతుడైన పండితుడు చాలా శక్తివంతమైన వాడు భౌతికముగా. ఆయన అన్ని భవనాలను ప్రతిదానిని తన రాజధానిలో బంగారముతో మార్చాడు. ఇది... రావణుని సోదరుడు ఒక రాజు... ప్రపంచంలో మరో వైపున. ఇది నా సలహా... ఇది చాలా శాస్త్రీయ రుజువు అని చెప్పడం లేదు. భూగోళంలోని మరో వైపు... రావణుడు లంకలో ఉన్నాడు, ప్రపంచంలోని మరొక వైపు, మీరు సబ్వే ద్వారా వెళ్ళితే, బ్రెజిల్ దగ్గరకు వస్తుంది. బ్రెజిల్ బంగారు గనులు కలిగి ఉండేది. రామాయణములో రావణుడి సోదరుడు భూగోళం యొక్క ఇతర వైపు జీవిస్తున్నాడని చెప్పబడింది, రామచంద్రుడు ఆ సబ్వే ద్వారా తీసుకువెళ్ళబడ్డారు. కాబట్టి ఇది పరిగణనలోకి తీసుకుంటే మనం అనుకోవచ్చు రావణుడు బ్రెజిల్ నుంచి పెద్ద మొత్తంలో బంగారం దిగుమతి చేసుకున్నాడు, ఆయన వాటిని పెద్ద పెద్ద ఇళ్లుగా మార్చాడు. అందువల్ల రావణుడు చాలా శక్తివంతమైనవాడు, ఆయన తన రాజధాని ని స్వర్ణ లంకగా మార్చాడు, "బంగారాముతో తయారు చేసిన రాజధాని" గా చేసాడు. ఒక మనిషి అభివృద్ధి చెందని దేశం నుండి మీ దేశానికి వస్తే, న్యూయార్క్ లేదా ఏ నగరం అయినా, వారు పెద్ద పెద్ద ఆకాశహార్మ్యములను చూసినప్పుడు, వారు ఆశ్చర్య పోతారు ఆకాశహార్మాల భవనాలు ఈ రోజుల్లో ప్రతి చోటా ఉన్నప్పటికీ, గతంలో ఇది చాలా అద్భుతము.

కాబట్టి మనం చాలా అద్భుతాలను సృష్టించగలము, కానీ రావణుడి యొక్క ఉదాహరణను మనము తీసుకోవచ్చు. రావణుడు భౌతికముగా చాలా పురోభివృద్ధి చెందినవాడు, ఆయన తగినంత వేదముల జ్ఞానమును కలిగి ఉన్నాడు. ఆయన ఒక బ్రాహ్మణ కుమారుడు. అంతా ఉంది. అయితే, ఆయన చేసిన తప్పు ఏమిటంటే కేవలం రాముడిని పట్టించుకోలేదు అది మాత్రమే తప్పు. ", రాముడు ఏమిటి? నేను ఆయనని పట్టించుకోను. స్వర్గపు రాజ్యమునకు వెళ్ళటానికి యజ్ఞములు మరియు సాంప్రదాయిక వేడుకలను చేయవలసిన అవసరం లేదు. " రావణుడు ఇలా అన్నాడు, "చంద్ర గ్రహానికి వెళ్లడానికి నేను ఒక మెట్ల నిర్మాణాన్ని కడతాను. ఎందుకు మీరు ఈ విధముగా లేదా ఆ విధముగా ప్రయత్నిస్తున్నారు ? నేను అలా చేస్తాను. "స్వర్గీశరీ (?) కాబట్టి ఈ ప్రజలు రావణుడి వలె ప్రయత్నం చేస్తున్నారు, కానీ వారు రావణుడి నుండి పాఠాలు తీసుకోవాలి ఆయనకు దైవభక్తి లేకపోవటము ఆయనని పతనము చేసినది. ఆయన ప్రతిదీ కోల్పోయినాడు.

కాబట్టి అర్జునుడు యొక్క ఈ ఆదేశము... ఆయన ఇలా చెప్పాడు 'haṁ dhanus ta iṣavaḥ ఆయన గోపమనుషులచే ఓడించబడ్డాడు. ఆయన కృష్ణుని రాణులను రక్షించలేకపోయాడు, కృష్ణుని రాణులు ఈ గోపమనుషులచే తీసుకువెళ్ళబడ్డారు. కాబట్టి ఆయన విలపిస్తున్నాడు, ఈ బాణం మరియు విల్లుతోనే నేను కురుక్షేత్ర యుద్ధంలో పోరాడాను, కృష్ణుడు నా రథంపై కూర్చొని ఉండటం వలన నేను విజయము సాధించాను. అది మాత్రమే కారణం. ఇప్పుడు నేను ఈ బాణాలు మరియు విల్లును కలిగి ఉన్నాను, అదే బాణాలు మరియు విల్లును కలిగి ఉన్నాను, వాటితో నేను కురుక్షేత్ర యుద్ధంలో పోరాడాను, కానీ ప్రస్తుత క్షణమున కృష్ణుడు లేడు. అందువలన అవి నిష్ఫలమైనవి. "Īśa-rikta, asad abhūt. అసత్ అంటే పనిచేయనివి అని అర్థం; అది ఉనికిలో ఉండదు. కావున నా విల్లు మరియు బాణము అవే ఉన్నాయి, కానీ ఇప్పుడు అవి నిష్ప్రయోజనము. మనము ఈ పాఠాన్ని తీసుకోవాలి, భగవంతుడు లేకుండా, ఆ స్పూర్తి లేకుండా, ఈ భౌతికంలో, నేను చెప్పేది ఏమిటంటే,ఈ ఉన్నతమైన వాటికి విలువ లేదు