TE/Prabhupada 0842 - మన ఈ కృష్ణ చైతన్య ఉద్యమం నివృత్తి-మార్గములో శిక్షణ ఇస్తుంది, చాలా నిషేధములు

Revision as of 20:36, 8 October 2018 by Vanibot (talk | contribs) (Vanibot #0023: VideoLocalizer - changed YouTube player to show hard-coded subtitles version)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


761214 - Lecture BG 16.07 - Hyderabad


ఇది అసుర జీవితము యొక్క ప్రారంభము, ప్రవృత్తి మరియు నివృత్తి. ప్రవృత్తి అంటే, మనము పిలిచేది, ప్రోత్సాహం, అది చేస్తుంది... కొంచము చక్కెర ఉంది, చీమకు చక్కెర ఉంది అని తెలుసు. ఆయన దాని కొరకు పరిగెడుతున్నాడు. అది ప్రవృత్తి. నివృత్తి అంటే అర్థం "నేను ఈ విధముగా నా జీవితమును గడిపాను, కానీ ఇది వాస్తవానికి నా జీవితపు పురోగతి కాదు. నేను ఈ విధమైన జీవితాన్ని ఆపాలి. నేను ఆధ్యాత్మిక పరిపూర్ణత వైపుకు వెళ్ళాలి. " అది నివృత్తి-మార్గము. రెండు మార్గాలు ఉన్నాయి: ప్రవృత్తి మరియు నివృత్తి. ప్రవృత్తి అంటే మనం చీకటి, చీకటి ప్రాంతాలకు వెళ్తున్నాం. Adānta-gobhir viśatāṁ tamisram ( SB 7.5.30) మనము మన ఇంద్రియాలను నియంత్రించలేము కనుక, adānta... Adānta నియంత్రణ లేని అని అర్థం, మరియు గో, గో అంటే ఇంద్రియాలు అని అర్థం. Adānta-gobhir viśatāṁ tamisram. మనము జీవితం యొక్క రకాలు చూస్తునట్లు, అదే విధముగా నరకములో కూడా జీవితం ఉంది, తామిశ్రా. కాబట్టి మీరు నరకపు జీవన స్థితికి వెళ్తారు లేదా మీరు విముక్తి మార్గమునకు వెళ్తారు, రెండు మార్గాలు మీకు తెరిచి ఉన్నాయి. కాబట్టి నీవు నరకపు జీవిత స్థితికి వెళ్ళినట్లయితే, అది ప్రవృత్తి-మార్గము అని పిలువబడుతుంది, మీరు విముక్తి మార్గం వైపు వెళ్ళితే, అది నివృత్తి-మార్గము.

మన ఈ కృష్ణ చైతన్య ఉద్యమం నివృత్తి-మార్గములో శిక్షణ ఇస్తుంది, ప్రాథమిక సూత్రాలు, చాలా నిషేధములు. "కాదు" అంటే నివృత్తి. అక్రమ లైంగిక సంబంధము వద్దు, మాంసం తినడం వద్దు, ఏ జూదము వద్దు, ఏ మత్తు వద్దు. కాబట్టి ఇవి నిషేధములు, "కాదు" మార్గం. కాబట్టి వారికి తెలియదు. మనం చాలా నిషేధములు చెప్పినప్పుడు, వారు బ్రెయిన్వాష్ అని భావిస్తారు. బ్రెయిన్ వాష్ కాదు. ఇది సత్యము. మీరు మీ ఆధ్యాత్మిక జీవితాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకుంటే, మీరు చాలా నూసెన్సు ను ఆపాలి. అది నివృత్తి-మార్గము. అసురులు, వారికి తెలియదు. ఎందుకంటే వారికి తెలియదు, ఎప్పుడు నివృత్తి-మార్గము, "వద్దు," "వద్దు" యొక్క మార్గం సిఫార్సు చేస్తే, వారికి కోపము వస్తుంది. వారికి కోపము వస్తుంది.

upadeṣo hi mūrkhāṇāṁ
prakopāya na śāntaye
payaḥ-pānaṁ bhujaṅgānāṁ
kevalaṁ viṣa-vardhanam
(Nīti Śāstra)

ఎవరైతే దుష్టులు, మూర్ఖులో, వారి జీవితమున విలువైనది మీరు మాట్లాడినట్లయితే, ఆయన మీరు చెప్పినది వినడు; ఆయన కోపము తెచ్చుకుంటాడు. ఉదాహరణ ఇవ్వబడింది,payaḥ-pānaṁ bhujaṅgānāṁ kevalaṁ viṣa-vardhanam. ఉదాహరణకు ఒక పాము ఉంటే, మీరు ఆ పాముని అడిగితే నేను రోజు నీకు కప్పు పాలు ఇస్తాను. జీవితములో హాని చేయవద్దు, అనవసరముగా ఇతరులను కాటు వేయవద్దు. మీరు ఇక్కడకు వచ్చి, ఒక కప్పు పాలు తీసుకుని, శాంతిగా జీవించ వచ్చు, "ఆయన అది చేయలేడు. ఆయన... తాగడము ద్వారా, ఆ కప్పు పాలు తాగడం ద్వారా, ఆయన విషం పెరుగుతుంది, విషం పెరిగిన వెంటనే-అది కూడా మరొక దురద అనుభూతి- ఆయన కాటు వేయాలని కోరుకుంటాడు. ఆయన కాటు వేస్తాడు. అందువల్ల ఫలితం payaḥ-pānaṁ bhujaṅgānāṁ kevalaṁ viṣa-vardhanam. అవి ఎంత పస్తు ఉంటాయో, అది వాటికి అంత మంచిది, ఎందుకంటే విషం పెరగదు. ప్రకృతి చట్టం ఉంది.

ఒక పాముని చూసిన వెంటనే, వెంటనే ప్రతి ఒక్కరూ పాముని చంపడానికి అప్రమత్తం అవుతారు. ప్రకృతి చట్టం ద్వారా... ఇది చెప్పబడింది, ఒక గొప్ప సాధువు కూడా పాము చంపబడినప్పుడు ఆయన బాధపడడు. Modeta sādhur api sarpa, vṛścika-sarpa-hatyā ( SB 7.9.14) ప్రహ్లాద మహారాజు చెప్పారు. ఆయన తండ్రి చంపబడినప్పుడు నరసింహ స్వామి అప్పటికీ కోపంతో ఉన్నారు, అందువలన ఆయన భగవంతుడు నరసింహ స్వామిని శాంతింప చేశారు, "అయ్యా, ఇప్పుడు మీరు మీ కోపం వదిలేయ వచ్చు, ఎందుకంటే నా తండ్రి చనిపోయినందుకు ఎవ్వరూ దుఃఖముగా లేరు. " అంటే నేను కూడా దుఃఖముగా లేను, నేను కూడా సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే నా తండ్రి ఒక పాము మరియు ఒక తేలు వంటి వాడు. ఒక తేలు లేదా ఒక పాము చంపబడినప్పుడు ఒక గొప్ప సాధువు కూడా సంతోషంగా ఉంటాడు. " ఎవరినైనా చంపినట్లయితే వారు సంతోషంగా ఉండరు. ఒక చీమను హత్య చేసినా కూడా, ఒక సాధువు దుఃఖముగా ఉంటాడు. కానీ ఒక సాధువు, ఒక పామును చంపడము చూసినపుడు, ఆయన ఆనందంగా ఉంటాడు. ఆయన సంతోషంగా ఉంటాడు.

కాబట్టి మనం పాము యొక్క జీవితాన్ని అనుసరించకూడదు, pravṛtti-mārga. మానవ జీవితం నివృత్తి మార్గము కొరకు ఉద్దేశించబడినది. మనకు చాలా చెడ్డ అలవాట్లు ఉన్నాయి. ఈ చెడు అలవాట్లను విడిచిపెట్టడము, అది మానవ జీవితం. మనం అలా చేయలేకపోతే, జీవితములో ఎలాంటి ఆధ్యాత్మిక ప్రగతి సాధించడం లేదు. ఆధ్యాత్మిక పురోగతి... ఎంత కాలము మీకు కొద్దిగా కోరిక ఉంటుందో పాపములను చేయడానికి మీ ఇంద్రియాలను తృప్తిపర్చడానికి, మీరు తదుపరి శరీరమును అంగీకరించాలి. మీరు ఒక భౌతిక శరీరమును అంగీకరించిన వెంటనే, అప్పుడు మీరు బాధపడతారు.