TE/Prabhupada 0871 - మొదటి-తరగతి బ్రాహ్మణులచే, సాధువులచే రాజులు మార్గనిర్దేశము చేయబడే వారు

Revision as of 01:30, 7 October 2017 by Kamalakar (talk | contribs) (Created page with "<!-- BEGIN CATEGORY LIST --> Category:1080 Telugu Pages with Videos Category:Telugu Pages - 207 Live Videos Category:Prabhupada 0871 - in all Languages Category:...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


750519 - Lecture SB - Melbourne

మొదటి-తరగతి బ్రాహ్మణులచే, సాధువులచే రాజులు మర్గానిర్దేశము చేయబడే వారు రాజు, చక్రవర్తి సామ్రాజ్యం లోపల ప్రతి ఒక్కరికీ రక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ఆయన మనిషా లేదా జంతువా అని పట్టింపు లేదు. చెట్లకు కూడా. అనవసరంగా నరకడానికి లేదా చంపడానికి ఏ చట్టము లేదు. లేదు వాస్తవమునకు, మీరు సహేతుకముగా ఉంటే ... జాతీయ... జాతీయత అంటే ఆ దేశంలో జన్మించిన ఎవరైనా. ప్రస్తుతము ప్రభుత్వాలు మనుషుల మీద మాత్రమే శ్రద్ధ వహిస్తున్నాయి. జంతువులను చూసుకోవడము లేదు. ఈ జాతీయవాదం ఏమిటి? జంతువు ఏమి చేసింది వాటిని ఎందుకు కాపాడకూడదు? కాబట్టి ఇది కలియుగము అని పిలుస్తారు, పాపపు యుగము. పాపపు యుగము. అది పెరుగుతోంది. అది పెరుగుతోంది. కాని మహారాజ పరీక్షిత్తు సమయంలో, ఎవరు ఏ విధమైన అన్యాయం చేయలేరు. అందువల్ల శాస్త్రములో చెప్పబడినది, kāmaṁ vavarṣa parjanyaḥ (SB 1.10.4). ప్రతిదీ సరిగ్గా ఉండటము వలన, ప్రకృతి యొక్క మార్గం మనకు అన్ని సౌకర్యాలను కల్పించడము , జీవితం యొక్క అన్ని అవసరాలు, అది కూడా పూర్తిగా ఉంది. మీరు రాజు లేదా దేవుడు నియమాలకు హానికరముగా ఉంటే లేదా అవిధేయులై ఉంటే వెంటనే... రాజు దేవుడు ప్రతినిధిగా ఉoడాలి. అందువలన, భారతదేశంలో రాజు దేవుడి ప్రతినిధిగా అంగీకరించబడ్డాడు. గతంలో రాజులు అ విధముగా శిక్షణ పొందారు ఒక మనిషి మొత్తం విశ్వమంతా పాలించటానికి సరిపోతాడు, మొత్తం ... కనీసం ఒక లోకమును. అది పద్ధతి. రాజు చాలా పవిత్రముగా ఉంటాడు. చాలామంది ఉన్నారు, ఈ రాజుల గురించి ప్రకటనలు. ఎందుకు వారు పవిత్రంగా ఉన్నారు? ఎందుకంటే వారు కూడా పాలించబడ్డారు. రాజులు మొదటి తరగతి బ్రాహ్మణులు, ఋషులచే మార్గనిర్దేశం చేయబడ్డారు. బ్రాహ్మణులు ప్రభుత్వం యొక్క నిర్వహణలో పాల్గొనకూడదు, కాని వారు క్షత్రియ రాజులకు సలహా ఇస్తారు, ఈ పౌరులను మీరు ఈ విధముగా పాలించoడి. రాజు అలా చేయకపోతే, బ్రాహ్మణులకు చాలా అధికారము కలదు - అనేక సందర్భాలు ఉన్నాయి - వారు రాజును సింహాసనం నుండి తొలగించారు లేదా ఆయనని చంపేవారు. కాని వారు తాము అధికారాన్ని ఆక్రమించే వారు కాదు. ఆయన కుమారుడికి అవకాశం ఇవ్వబడుతుంది. ఇది పద్ధతి.

పరీక్షిత్ మహారాజు ఏడు రోజులలోనే మరణించాలని శపించబడ్డారు అది కూడా చాలా మంచిది, ఆసక్తికరంగా ఉంటుంది. చాలా ఆసక్తికరంగా లేదు; ఇది చాలా దురదృష్టకరం, పరీక్షిత్ మహారాజా ఏడు రోజుల్లో చనిపోవాలని ఒక బ్రాహ్మణ బాలుడు శపించారు, ఒక పాము కరవడము ద్వారా. ఆ సంఘటన ఏమిటి? ఈ సంఘటన ఏమిటంటే మహారాజ పరీక్షిత్ అడవిలో ఉన్నారు, వేటాడుతూ. క్షత్రియ రాజులకు మాత్రమే వేట అనుమతించబడుతుంది. ఎందుకంటే వారు పరిపాలించాలి కనుక , గతంలో రాజు ఆజ్ఞతో దుష్టులను మరియు దుర్మార్గులను, లేదా రాజు స్వయంగా చంపేవాడు వెంటనే , అందువల్ల వారు ఎలా చంపాలో సాధన చేయాలి. ఆ అభ్యాసం అడవిలో కొన్ని భయంకరమైన జంతువులను వేటాడటం ద్వారా చేసే వారు , తినడానికి కాదు. ఈ రోజుల్లో వేట తినే దాని కోసము జరుగుతోంది. లేదు, అది చట్టం కాదు. కాబట్టి మహారాజా పరీక్షిత్ వేట విహారములో ఉన్నాడు. ఆయనకు చాలా దప్పిక వేసింది. అందువల్ల అతడు ఒక సాధువు యొక్క ఆశ్రమములోకి ప్రవేశించాడు. ఆయన ఆ సమయంలో ధ్యానం చేస్తున్నాడు. అందువల్ల అతడు లోపలికి వెళ్ళి, "నాకు నీళ్ళు త్రాగటానికి ఇవ్వండి, నాకు చాలా దాహం వేస్తున్నది" అని అడిగాడు. ఆయన అనుకున్నాడు, "ఇది ఆశ్రమము." కాని ఋషి ధ్యానంలో నిమగ్నమై ఉండటము వలన ఆయన వినలేకపోయాడు. కావున రాజు కొద్దిగా విసుగు చెందాడు "నేను రాజును. నేను నీటిని కోరుతున్నాను, ఈ వ్యక్తి నిశ్శబ్దముగా ఉన్నాడు", అందువల్ల అతడికి కోపం వచ్చింది, అక్కడ చనిపోయిన పాము ఒకటి ఉంది. ఆ పామును తీసుకొని ఆయన మెడకు చుట్టి వెళ్ళిపోయాడు.

ఆయన పుత్రుడు, వాడికి పది, పన్నెండు సంవత్సరాల వయస్సు ఉంటుంది. వాడు ఆడుకొంటున్నాడు, వాడి స్నేహితులు వాడితో చెప్పారు రాజు ఈ విధముగా మీ తండ్రిని అవమానించాడు. ఆ బాలుడికి చాలా కోపము వచ్చింది, ", రాజు చాలా గర్వముగా ఉన్నాడు.కావున నా తండ్రిని అవమానించాడు ." ఆయన చనిపోయిన పామును తన తండ్రి మెడ మీద ఉండటము చూశాడు. ఆయన వెంటనే మహారాజ పరిక్షిత్ ను శపించాడు, "మీరు ఏడు రోజులలో చనిపోతారు, ఒక పాము కరవడము వలన." ఆయన చాలా బిగ్గరగా ఏడవటము వలన , ఆ శబ్దమునకు అ సాధువు, అ ఋషి, అతడు లేచాడు. "ఏమి జరిగింది, నా ప్రియమైన పుత్రుడా, నీవు ఏడుస్తున్నావు?" కాదు కాదు. రాజు మిమ్మల్ని అవమానించాడు. అందువలన నేను శపించాను. ఆయన చాలా భాధ పడ్డాడు, "నీవు ఒక సాధువు వంటి రాజును శపించావు? నీవు మొత్తం బ్రాహ్మణ సమాజానికి అపఖ్యాతి తీసుకువచ్చావు. నీవు కలి యుగమును ప్రవేశించడానికి అనుమతించావు. ఇది కలి యుగము యొక్క కుట్ర. " ఏమైనప్పటికీ, ఆయన ఆ వార్తను రాజుకు పంపించాడు నా కుమారుడు బుద్ధిహీనతతో మిమ్మల్ని శపించాడు. ఇది... కానీ నేను ఏమి చెయ్యగలను? ఇది దేవుడు కోరిక. ఇది జరిగింది. కాబట్టి మీరు సిద్ధముగా ఉండండి." ఇప్పుడు కేవలము చూడండి, ఒక బ్రాహ్మణుడికి జన్మించిన ఒక బాలుడు కూడా, ఆయన ఎంత శక్తివంతమైనవాడో, ఒక పది సంవత్సరాల వయస్సు గల బాలుడు, ఆయన ఒక గొప్ప రాజుకు శాపము ఇస్తే, ఆయన దానికి కట్టుబడి ఉండాలి. ఇది క్షత్రియుని, బ్రాహ్మణుని స్థితి. నేను చెప్పేది ఏమిటంటే, వైశ్య శూద్ర. Cātur-varṇyaṁ mayā sṛṣṭaṁ guṇa-karma-vibhāgaśaḥ (BG 4.13). మానవ సమాజం, దేవుడు సంకల్పం ద్వారా వ్యక్తులు నాలుగు వర్గాలు ఉన్నారు. మొదటి తరగతి వారు బ్రాహ్మణులు; రెండవ తరగతి, క్షత్రియులు; మూడవ తరగతి, వైశ్యులు; ఇతరులు, నాల్గవ తరగతి, శూద్రులు