TE/Prabhupada 0876 - మీరు ఆధ్యాత్మిక ఆనంద సాగరాన్ని దరి చేరినప్పుడు,అది అనుదినమూ పెరుగుతూ ఉంటుంది: Difference between revisions

 
m (Text replacement - "(<!-- (BEGIN|END) NAVIGATION (.*?) -->\s*){2,}" to "<!-- $2 NAVIGATION $3 -->")
 
Line 8: Line 8:
[[Category:Telugu Language]]
[[Category:Telugu Language]]
<!-- END CATEGORY LIST -->
<!-- END CATEGORY LIST -->
<!-- BEGIN NAVIGATION BAR -- TO CHANGE TO YOUR OWN LANGUAGE BELOW SEE THE PARAMETERS OR VIDEO -->
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{1080 videos navigation - All Languages|French|FR/Prabhupada 0875 - Chant Votre propre nom de Dieu. Où est l'opposition - Mais Chantez le Saint Nom de Dieu|0875|FR/Prabhupada 0877 - Si vous ne sont pas idéales, alors il sera inutile d'ouvrir un centre|0877}}
{{1080 videos navigation - All Languages|Telugu|TE/Prabhupada 0875 - మీరు మీకు తెలిసిన భగవంతుని నామాన్ని కీర్తించండి.అభ్యంతరం ఎక్కడవుంది|0875|TE/Prabhupada 0877 - మీరు ఆదర్శంగా లేకుంటే, అప్పుడు కేంద్రాన్ని తెరవడము వలన ఉపయోగము లేదు|0877}}
<!-- END NAVIGATION BAR -->
<!-- END NAVIGATION BAR -->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
<!-- BEGIN ORIGINAL VANIQUOTES PAGE LINK-->
Line 19: Line 19:


<!-- BEGIN VIDEO LINK -->
<!-- BEGIN VIDEO LINK -->
{{youtube_right|02dBteIwteQ|మీరు ఆధ్యాత్మిక ఆనంద సాగరాన్ని దరి చేరినప్పుడు,అది అనుదినమూ పెరుగుతూ ఉంటుంది  <br />- Prabhupāda 0876}}
{{youtube_right|TsCGgLZIeTA|మీరు ఆధ్యాత్మిక ఆనంద సాగరాన్ని దరి చేరినప్పుడు,అది అనుదినమూ పెరుగుతూ ఉంటుంది  <br />- Prabhupāda 0876}}
<!-- END VIDEO LINK -->
<!-- END VIDEO LINK -->



Latest revision as of 23:45, 1 October 2020



750519 - Lecture SB - Melbourne


మీరు ఆధ్యాత్మిక ఆనంద సాగరాన్ని దరి చేరినప్పుడు,అది అనుదినమూ పెరుగుతూ ఉంటుంది. ప్రభుపాద: కైరవ-చంద్రిక వలె,ఎలాగైతే చంద్రుడు, మొదటి రోజున ఒక రేఖ లాగా ఉంటాడు, అటుపిమ్మట క్రమంగా పెరుగుతాడు - చంద్రుని శరీరం మరియు చంద్రకాంతి పెరుగుతుంది. అందువలన ఈ పోలిక ఇవ్వబడింది. మీరు మరింత కృష్ణ చైతన్యవంతులైతే, మీ జీవితం మరింత ప్రకాశవంతమౌతుంది. Śriya-kairava-candrikā-vitaraṇa vidyā-vadhū-jīvanam. అప్పుడు ఈ జీవితం జ్ఞానపూర్ణమవుతుంది. Vidyā-vadhū-jīvanam. Ānandāmbudhi-vardhanam. జీవితాన్ని జ్ఞానపూర్ణం చేసుకోవడమంటే ఆనంద స్థితికి చేరడం. అనందం అంటే సుఖము. మనకు సుఖం కావాలి. కాబట్టి మీరు మరింత సుఖవంతమైన జీవితాన్ని పొందుతారు. Ānandāmbudhi-vardhanam. మరియు prati-padaṁ pūrṇāmṛtāsvādanam: జీవితం యొక్క ప్రతి అడుగు, మనకు తెలుసు ... జీవితం యొక్క భౌతిక స్థితిలో మనకు అనుభవంలో వున్నవి కేవలం అసౌకర్యం, ఇబ్బందులు, వ్యతిరేకత మాత్రమే ఎదుర్కొంటున్నాము. Ānandāmbudhi-vard... ఆంబుది అంటే సముద్రం. కాబట్టి ఈ సముద్రానికి పెరుగుదలవుండదు, కానీ మీరు ఆధ్యాత్మిక ఆనంద సాగరాన్ని దరిచేరినప్పుడు, ఆనందమయము,అది అనుదినము పెరుగుతుంది. ఈ అబ్బాయిలను చూడండి. వీరు యూరప్, అమెరికా నుండి వచ్చారు. వీరు భారతీయులు కాదు. కానీ ఎందుకు వీరు ఈ కృష్ణ చైతన్య ఉద్యమానికి కట్టుబడివుంటున్నారు? వారు తమ దివ్యానందాన్ని ఇనుమడింపచేసుకోకుంటే తప్ప అది జరగదు? వీరు మూర్ఖులు మరియు మూఢులు కారు. వీరు విద్యావంతులు. ఎందుకు వీరు దీనిని స్వీకరించారు? Ānandāmbudhi-vardhanam. అది వీరి ఆధ్యాత్మిక ఆనందాన్ని పెంచుతూవుంది.

కాబట్టి ఎవరైనా ఈ విధానాన్ని ఆశ్రయిస్తారో, అ వారు తమ దివ్యానందాన్ని ఇనుమడింపచేసుకుంటారు.ānandāmbudhi-vardhanam. Prati-padam pūrṇāmṛtāsvādanam:మరియు అతను ఆస్వాదించగలడు, జీవితపరమార్థం ఏమిటి, అసలైన ఆనందం ఏమిటి. Paraṁ vijayate śrī-kṛṣṇa-saṅkīrtanam: "హరే కృష్ణ మంత్ర కీర్తనకు సకల జయములు కలుగుగాక."

కాబట్టి ఇది పద్ధతి.మా కృష్ణచైతన్య ఉద్యమం వీలైనంతవరకూ ఈ జ్ఞానాన్ని వ్యాప్తి చేస్తోంది, మరియు కృష్ణని కృపచేత మేము మెల్బోర్న్ లో ఈ ఆలయాన్ని పొందాము, మరియు ఇదంతా మా శిష్యుడు శ్రీమద్ మధుద్విసస్వామికి వలన జరిగింది మీరు దాని ప్రయోజనాన్ని పొందండి. కేవలం ఇదే నా మాత్రమే అభ్యర్థన. మీరు ఏమీ చేయకపోతే, కేవలం వచ్చి కీర్తన చేస్తూ ఉండండి, మీరు క్రమేపి అతి త్వరలోనే తెలుసుకుంటారు. Ataḥ śrī-kṛṣṇā-nāmādi na bhaved grāhyam indriyaiḥ ( CC 17.136) ఆ ... కృష్ణుడు, ఆయన నామము, ఆయన రూపం, ఆయన లీలలు, ఆయన గుణాలు, మనము ఈ మొద్దుబారిన భౌతిక ఇంద్రియాలతో గ్రహించలేము. అది సాధ్యం కాదు. Ataḥ śrī-kṛṣṇa-nāmādi na bhaved grāhyam indriyaiḥ. అలాంటప్పుడు? మనకు ఇంద్రియాలు అనబడే ఒకే ఆధారం వుంది. అలాంటప్పుడు ఎలా గ్రహించాలి? Sevonmukhe hi jihvādau. మీరు భగవంతుని యొక్క సేవ లో మీ ఇంద్రియాలను నిమగ్నం చేసినట్లయితే, Svayam eva sphuraty adaḥ, అప్పుడు కృష్ణడు "నేను ఇక్కడ ఉన్నాను" అని వ్యక్తమవుతాడు. ఇది పద్ధతి. ఇప్పుడు ఈ పదం చాలా ముఖ్యమైనది, sevonmukhe hi jihvādau. జిహ్వ అంటే నాలుక. మీరు కేవలం మీ నాలుకను భగవంతుని యొక్క సేవలో వినియోగించినప్పుడు, మీరు క్రమంగా ఉన్నతి సాధిస్తారు. కాబట్టి నాలుకను ఎలా నిమగ్నం చేయాలి? మీరు చూస్తే, లేదా మీరు తాకినట్లయితే, లేదా వాసన చూస్తే అని చెప్పడం లేదు. లేదు: "మీరు రుచి చూస్తే." కాబట్టి నాలుక పనేమిటి? నాలుక యొక్క పని - మనము మంచి ఆహార పదార్థాలను రుచి చూడగలము మరియు మనం మాట్లాడగలం. ఈ రెండు పనులూ చేయండి. మీ నాలుకతో హరే కృష్ణ మంత్రాన్ని పలకండి,మరియు సాధ్యమైనంత ఎక్కువగా ప్రసాదం తీసుకోండి. (నవ్వు) అప్పుడు మీరు భక్తులు అవుతారు.

చాలా ధన్యవాదాలు.

భక్తులు: జయ శ్రీల ప్రభుపాద.